Take a fresh look at your lifestyle.

రాష్ట్రంలో దుర్మార్గమైన పాలన నడుస్తుంది: టీపీసీసీ చీఫ్‌ ఉత్తమ్‌కుమార్‌రెడ్డి

  • కొండపోచమ్మ కార్యక్రమంలో  కొరోనా నిబంధనలు గాలికి
  • గచ్చి బౌలి ఆస్పత్రిలో ఒక్కరినీ ఎందుకు చేర్చలేదు: జీవన్‌ ‌రెడ్డి

కేసీఆర్‌ ‌ప్రభుత్వం స్థానిక సంస్థల ను నిర్వీర్యం చేసిందని టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌ ‌కుమార్‌ ‌రెడ్డి విమర్శించారు. సర్పంచ్‌ ‌లకు, మండల పరిషత్తు లకు నిధులు ఇవ్వకుండా స్థానిక సంస్థలను పట్టించుకోవడం లేదని మండిపడ్డారు.శనివారం జూమ్‌ ఆప్‌ ‌ద్వారా రాష్ట్రంలోని కాంగ్రెస్‌ ‌పార్టీ స్థానిక సంస్థల ప్రజా ప్రతినిధులతో గాంధీభవన్‌ ‌నుంచి ఉత్తమ్‌ ‌కుమార్‌ ‌రెడ్డి మాట్లాడారు ..ఈ సందర్భంగా ఆయన తెలంగాణ రాష్ట్రం లో దుర్మార్గమైన పాలన నడుస్తుందని ,కెసిఆర్‌ అ‌క్రమ సంపాదన తో కాంగ్రెస్‌ ఎమ్మెల్యే లను, ప్రజాప్రతినిధులను కొంటున్నాడని ఆగ్రహం వ్యక్తం చేశారు..రైతులకు శుభ వార్త అంటున్న కెసిఆర్‌ ‌కు సిగ్గుండలని ధ్వజమెత్తారు. రైతు బందు ఇవ్వడం లేదు, రైతు రుణ మాఫీ చేయడం లేదు ,పంట నష్టం ఇవ్వడంలేదు మరీ ఇంకా రైతుల కు శుభ వార్త ఏంటని ప్రశ్నించారు ?నిజాం కట్టిన ప్రాజెక్ట్ ‌లు,కాంగ్రెస్‌ ‌ప్రభుత్వం లో కట్టిన ప్రాజెక్ట్ ‌ల తో నే పంటలు సాగు అవుతున్నయని తెలిపారు .కమీషన్‌ ‌ల కోసమే కేసీఆర్‌ ‌కాళేశ్వరం ప్రాజెక్ట్ ‌కట్టడాని ఆరోపించారు ..ఎస్‌ఆర్‌ఎస్పీ కింద పండిన పంటలను కాళేశ్వరం ప్రాజెక్ట్ ‌కింద చూపిస్తున్నాడని అన్నారు.కాంగ్రెస్‌ ‌పార్టీ కేడర్‌ ‌రెండు రకాలుగా పోరాటం చేయాలని ఒకటి పార్టీ పటిష్టత కోసం, క్షేత్రాస్థాయి కమిటీలను నియమించుకోని పని చెయడం తో పాటు ప్రజల సమస్యల పై నిరంతరం పోరాటాలు చేస్తు ప్రజలకు అందుబాటులో ఉండాలని పిలుపునిచ్చారు..

కొండపోచమ్మ కార్యక్రమంలో కరోనా నిబంధనలు గాలికి
గచ్చి బౌలి ఆస్పత్రిలో ఒక్కరినీ ఎందుకు చేర్చలేదు: జీవన్‌ ‌రెడ్డి
జగిత్యాల : కొండ పోచమ్మ ఎత్తి పోతల పథకం ప్రారంభ సమయంలో సీఎం కేసీఆర్‌ ‌కొవిడ్‌ ‌నియమ నిబంధనలను పాటించలేదని ఎమ్మెల్సీ జీవన్‌ ‌రెడ్డి అన్నారు. కనీసం భౌతిక దూరం, మాస్క్ ‌ధరించకుండా సుదర్శన యాగంలో పాల్గొన్నారని విమర్శించారు. శనివారం జగిత్యాలలోని తన నివాసంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ.. గచ్చిబౌలి స్టేడియాన్ని సూపర్‌ ‌స్పెషాలిటీ స్టేడియంగా మార్చి కరోనా సోకిన వారికి చికిత్స అందిస్తామని పేర్కొన్న సీఎం.. ఆ వైద్యశాలలో ఒక్క పేషెంట్‌ను కూడా చేర్చలేదన్నారు. దీన్ని బట్టి ప్రభుత్వం కోవిడ్‌ ‌పరీక్షలు ఏ విధంగా చేస్తుందో అర్థం అవుతుందని చెప్పారు. కరోనా వైరస్‌ ‌నివారణలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పూర్తిగా విఫలమయ్యాయని ఆయన అన్నారు. తెలంగాణ రాష్ట్రంలో ఇప్పటివరకు కేవలం 30 వేల పరీక్షలు మాత్రమే చేశారన్నారు. అధికారుల, నాయకుల మాటలు మధ్య కరోనా విషయంలో పొంతన లేదని, దాటవేత ధోరణి ప్రదర్శిస్తున్నారని జీవన్‌ ‌రెడ్డి అన్నారు. ఇతర రాష్టాల్ర తరహాలో మన దగ్గర కూడా కరోనా పరీక్షలు నిర్వహించాలని, కరోనా వైరస్‌ అనుమానితుల అందరికీ ప్రభుత్వ వసతులతో కూడిన క్వారంటైన్‌ ‌వసతి కల్పించాలని డిమాండ్‌ ‌చేశారు. మద్యం అమ్మకాలు ఆశించిన స్థాయిలో జరగకపోవడంతోనే ఉద్యోగుల వేతనాల్లో కోతలు విధించారన్న జీవన్‌ ‌రెడ్డి.. ప్రభుత్వ పరంగా విధులు నిర్వహిస్తున్న ఉద్యోగ, ఉపాధ్యాయ, ఇతర వర్గాలకు పూర్తి స్థాయిలో నెలసరి వేతనాలు చెల్లించాలన్నారు. బీపీఎల్‌ ‌కుటుంబాలకు 6 నెలల పాటు నిత్యావసర సరుకులు, ఆర్థిక సాయం అందించాలని డిమాండ్‌ ‌చేశారు. భౌతిక దూరం పాటిస్తూ దైవ ప్రార్థనలకు అనుమతులు ఇవ్వాలని అన్నారు.

Leave a Reply