Take a fresh look at your lifestyle.

గవర్నర్‌, ‌హై కోర్టు తిట్టినా.. కేసీఆర్‌ ‌సర్కార్‌కి చీమకుట్టినట్టు లేదు

  • ప్రైవేట్‌ ‌హాస్పిటళ్ల నుండి సూట్‌ ‌కేసులు ఎవరింటికి వెళ్తున్నాయి
  • సొంత నియోజకవర్గంలో మంత్రి ఈటల అరాచకంగా వ్యవహరిస్తున్నారు
  • ప్రవీణ్‌ ‌యాదవ్‌ ‌మరణానికి ఈటలనే కారణం : పిసిసి ఛీఫ్‌ ఉత్తమ్‌
  • ‌టీఆర్‌ఎస్‌ ‌ప్రభుత్వం ప్రజల ఆరోగ్యాన్ని గాలికి వదిలేసింది
  • రాష్ట్రంలో హాస్పిటళ్ల పరిస్థితిపై స్పీకర్‌, ‌గవర్నర్‌లను కలిసి చెప్తం
  • అసెంబ్లీలో ప్రశ్నిస్తాం : సిఎల్పీ నేత భట్టి

హైకోర్టు, గవర్నర్‌ ‌తిట్టినా కేసీఆర్‌ ‌ప్రభుత్వానికి చీమకుట్టినట్టు కూడా లేదని టీపీసీసీ చీఫ్‌ ఉత్తమ్‌ ‌కుమార్‌ ‌రెడ్డి మండిపడ్డారు. మార్చ్ ‌నెలలో కొరొనా స్టార్ట్ అయితే సెప్టెంబర్‌ ‌వచ్చినా కనీసం టెస్టులు సరిగ్గా చేయని పరిస్థితిలో ప్రభుత్వం ఉందని విమర్శించారు. శనివారం ఇందిరాభవన్‌లో ఆయన, సిఎల్పీ నాయకుడు భట్టి విక్రమార్క, ఎమ్యెల్యేలు శ్రీధర్‌ ‌బాబు, జగ్గారెడ్డి, సీతక్క, పొడెం వీరయ్యలతో కలిసి ప్రెస్‌ ‌మీట్‌ ‌నిర్వహించారు. ఇందిరాభవన్‌లో కొరోనా ఫోటో ఎక్సిబిషన్‌ ఏర్పాటు చేశారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ ….ప్రైవేట్‌ ‌హాస్పిటల్స్‌తో మంత్రి ఈటలకు పనేం ఉందని, సూటికేసులు ఎవరి ఇంటికి వెళ్తున్నాయని ప్రశ్నించారు. ప్రైవేట్‌ ‌హాస్పిటల్స్‌లో సగం బెడ్లు తీసుకున్నామన్న ప్రభుత్వం ఎక్కడ తీసుకుందో చెప్పాలని ప్రశ్నించారు. కేసీఆర్‌, ఈ•‌ట రాజేందర్‌ ‌కొరొనా పేరుతో తెలంగాణ రాష్ట్రాన్ని దోచుకుంటున్నారని విమర్శించారు.

హుజురాబాద్‌ ‌నియోజకవర్గంలో ఈటల రాజేందర్‌ అరాచకంగా ప్రవర్తిస్తున్నారని హుజురాబాద్‌ ‌హాస్పిటల్‌లో తప్పుడు లెక్కలు చూపనందుకు ప్రవీణ్‌ ‌యాదవ్‌పై తప్పుడు కేసులు పెట్టించారని హుజురాబాద్‌ ‌వైద్యశాఖ ఉద్యోగి మరణానికి కారణం ఈటల రాజేందర్‌ అని ఆరోపించారు. అక్రమ కేసులు పెట్టించి•ప్రవీణ్‌ ‌యాదవ్‌ను కరెంట్‌ ‌షాక్‌ ‌పెట్టించి చంపించారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రవీణ్‌ ‌యాదవ్‌ ‌మరణంపై డీజీపీ విచారణ చేస్తే ఈటల రాజేందర్‌ ‌బయటపడతారని అన్నారు. ఆరోగ్యమంత్రి సొంత నియోజకవర్గం హుజురాబాద్‌ను నడుపలేని మంత్రి రాష్ట్రాన్ని ఎలా నడుపతారని నిలదీశారు. తెలంగాణ రాష్ట్రంలో ప్రజా ఆరోగ్యం, హాస్పిటళ్ల పరిస్థితిపై ప్రభుత్వం సమాధానం చెప్పాలని డిమాండ్‌ ‌చేశారు.

టీఆర్‌ఎస్‌ ‌ప్రభుత్వం ప్రజల ఆరోగ్యాన్ని గాలికి వదిలేసింది : సిఎల్పీ నేత భట్టి
సమాదేశంలొ సిఎల్పీ నేత భట్టి విక్రమార్క మాట్లాడుతూ…. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా వైద్యశాఖలో అరకొరగా సిబ్బంది ఉన్నారని కొరొనా సమయంలో ప్రాణాలకు తెగించి ఎలాంటి వసతులు లేకుండా విధులు నిర్వర్తిస్తున్న సిబ్బందికి ధన్యవాదాలు తెలిపారు. టీఆరెస్‌ ‌ప్రభుత్వం ప్రజలను, పాలనను పూర్తిగా గాలికి వదిలేసిందని విమర్శించారు. టీఆరెస్‌ ఆరున్నర ఏండ్ల పాలనలో కొత్తగా ఒక్క హాస్పిటల్‌, ‌యంత్ర పరికరాలు ప్రభుత్వం అందించలేదని ఆరోపించారు. జిల్లాలోని ప్రభుత్వ హాస్పిటల్స్‌లో చాలా వాటిలో సిటీ స్కానింగ్‌, ఆం‌జియోగ్రామ్‌ ‌లేవని ఉద్యమం అంతా ఉద్యోగాల కోసం అన్న ఈటల కనీసం వైద్యశాఖలో పూర్తిగా ఉద్యోగులు భర్తీ చేయలేదని మండిపడ్డారు. కొరొనా వచ్చిన ప్రతి ఒక్కరినీ హోమ్‌ ‌క్వారంటైయిన్‌ ‌చేయడం వల్ల గ్రామాల్లోకి పూర్తిగా పాకిందన్నారు. యశోదతో పాటు ప్రైవేట్‌ ‌హాస్పిటళ్ల్లు పేదల దగ్గర కొరొనా పేరుతో జలగల్లా పట్టి పీడిస్తూ లక్షలు వసూలు చేస్తున్నారని ప్రభుత్వంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. రాష్ట్రంలో హాస్పిటళ్ల పరిస్థితిపై స్పీకర్‌, ‌గవర్నర్‌ను కలిసి చెప్తామని ప్రభుత్వం స్పందించకపోతే హైకోర్టు దృష్టికి కూడా తీసుకుపోతామన్నారు. రాష్ట్రంలో హాస్పిటళ్ల గురించి బుక్‌ ‌కూడా విడుదల చేస్తామని, జరిగే అసెంబ్లీ సమావేశాల్లో ప్రశ్నిస్తాముని అన్నారు.

  • మునిసిపల్‌ ఎన్నికలో టీఆర్‌ఎస్‌ ‌వైఫల్యాలను ఎండగడుతాం
  • కేటీఆర్‌ ‌ముక్కుమూసుకోకుండా మూసీ వెంట తిరగాలి
  • దొంగలు దొంగలు ఊర్లు పంచుకున్నట్లు పాలన చేశారు
  • ఉమ్మడి ప్రెస్‌ ‌మీట్‌లో కాంగ్రెస్‌ ‌వర్కింగ్‌ ‌ప్రెసిడెంట్స్ ‌పొన్నం, రేవంత్‌, ‌కుసుమ కుమార్‌లు

తెలంగాణ కాంగ్రెస్‌ ‌వర్కింగ్‌ ‌ప్రెసిడెంట్స్ ‌పొన్నం ప్రభాకర్‌, ‌కుసుమ కుమార్‌ ,‌రేవంత్‌ ‌రెడ్డిలు ప్రభుత్వంపై ఘాటుగా స్పందించారు. శనివారం గాంధీభవన్‌లో ముగ్గురు కలిసి ప్రెస్‌ ‌మీట్‌ ‌నిర్వహించారు. మంత్రి కేటీఆర్‌ ‌ముక్కుమూసుకోకుండా మూసీ వెంట తిరిగితే మేము దేనికైనా రెడీ అని తెలంగాణ కాంగ్రెస్‌ ‌వర్కింగ్‌ ‌ప్రెసిడెంట్‌, ఎం‌పీ రేవంత్‌ ‌రెడ్డి సవాల్‌ ‌విసిరారు. ఆరు నెలల్లో ఖమ్మం, వరంగల్‌, ‌జిహెచ్‌ఎం‌సి ఎన్నికలు రాబోతున్నాయని, ఈ ఎన్నికల నేపథ్యంలో కేటీఆర్‌ ‌సమీక్షల మీద సమీక్షలు చేస్తున్నారని, గతంలో గ్రేటర్‌ను ఇస్తాంబుల్‌ ‌చేస్తామని, ట్యాంక్‌ ‌బండ్‌ )‌నీళ్లను కొబ్బరి నీళ్లు చేస్తామని, లక్ష డబుల్‌ ‌బెడ్‌ ‌రూమ్‌ ఇం‌డ్లు కట్టిస్తామన్నారని, కానీ ఆ అందమైన అబద్దాలు చెప్పి 99 డివిజన్లలో కార్పొరేటర్లను గెలుచుకున్నారని విమర్శించారు. టిఆర్‌ఎస్‌ ‌చెప్పింది నమ్మి ఆశతో ప్రజలు వోట్లేశారని గ్రేటర్‌లో ఇప్పటివరకు కేవలం 128 ఇండ్లు మాత్రమే కట్టారని తెలిపారు. డబుల్‌ ‌బెడ్‌ ‌రూమ్‌ ఇం‌డ్లు ఇవ్వకపోవడం వల్ల కిరాయి రూపంలో పేదలపై 1200కోట్ల భారం పడిందని లాక్‌ ‌డౌన్‌లో విద్యుత్‌ ‌భారం, ఇంటి పన్ను భారం పడిందని అద్భుతాలు సృష్టించినట్లు కేటీఆర్‌ ‌గొప్పలు చెబుతున్నారని మండిపడ్డారు.

కేటీఆర్‌ ‌బంధువుల రియల్‌ ఎస్టేట్‌, అపార్ట్ ‌మెంట్‌ ‌వ్యాపారాలు ఉన్న దగ్గర మాత్రమే రోడ్లు వేశారని, పేద ప్రజలకు ఉపయోగపడే చోట ఎక్కడా రోడ్లు వేయలేదని ఆరోపించారు. పని చేయకుండా ఏ మొహం పెట్టుకొని వోట్లు అడుగుతారని ఆగ్రహం వ్యక్తం చేశారు. మున్సిపల్‌ ‌మంత్రిగా విఫలమైన కేటీఆర్‌కు వోటు అడిగే హక్కు లేదని , అక్టోబర్‌ 3‌నుంచి తన పార్లమెంట్‌ ‌నియుజకవర్గ పరిధిలో డివిజన్‌ ‌యాత్ర చేపడుతున్నని, ఉదయం ఒక డివిజన్‌, ‌సాయంత్రం ఒక డివిజన్‌ ‌తిరుగుతనని, టిఆర్‌ఎస్‌ ‌విస్మరించిన హామీలపై ప్రజలను చైతన్య పరుస్తామన్నారు. ఇదే సందర్భంగా మాజీ ఎంపీ పొన్నం ప్రభాకర్‌ ‌మాట్లాడుతూ…జిహెచ్‌ఎం‌సి, వరంగల్‌, ‌ఖమ్మం కార్పొరేషన్‌ ఎన్నికల్లో టిఆర్‌ఎస్‌ ‌వైఫల్యాలను ప్రజల్లోకి తీసుకు వెళతామని వరంగల్‌ ‌పర్యటనలో కేసీఆర్‌ అనేక హామీలు ఇచ్చారని వరంగల్‌లోని ఫాతిమా బ్రిడ్జిని ఇప్పటి వరకు నిర్మించలేదని విమర్శించారు. డబుల్‌ ‌బెడ్‌ ‌రూమ్‌ ఇం‌డ్లు ఇవ్వని కేసీఆర్‌ ‌కు ప్రజలు ఈ ఎన్నికలో బుద్ధి చెప్పాలన్నారు. మరొక్క పీసీసీ వర్కింగ్‌ ‌ప్రెసిడెంట్‌ ‌జెట్టి కుసుమ కుమార్‌ ‌మాట్లాడుతూ …అయ్యప్ప సొసైటీలో ప్రజలను భయపెట్టి వోట్లు దండుకున్నారని విమర్శించారు. బస్తి దవాఖాన ఇన్నేళ్లు ఎందుకు గుర్తుకు రాలేదని, హాస్పిటల్స్‌లో సౌకర్యాలు ఎందుకు కల్పించలేదని ప్రశ్నించారు. ఖమ్మం మేయర్‌ ‌పాపలాల్‌ అవినీతి పరుడని సొంత పార్టీ నేతలే తిరుగుబాటు చేశారని, కార్పొరేటర్ల అవినీతిని బయట పెట్టారని తెలిపారు. దొంగలు దొంగలు ఊర్లు పంచుకున్నట్లు పాలన చేశారని ఇవన్నీ రాబోయే ఎన్నికల్లో ఎత్తి చూపుతామని అన్నారు.

Leave a Reply