Take a fresh look at your lifestyle.

పేదలకు నిత్యావసరాలు పంపిణీ చేసిన ఉత్తమ్‌

  • హుజూర్‌నరగ్‌లో 200మంది పారిశుద్ధ్య సిబ్బందికి  నిత్యావసర సరుకులు అందచేసిన పీసీసీ చీఫ్‌ ఉత్తమ్‌కుమార్‌రెడ్డి

లాక్‌డౌన్‌తో కష్టాల్లో ఉన్న పేదలకు టీపీసీసీ చీఫ్‌, ‌నల్గొండ ఎంపీ ఉత్తమ్‌కుమార్‌ ‌రెడ్డి నిత్యావసర సరుకులను పంపిణీ చేశారు. సోమవారం హుజూర్‌నగర్‌లో దాదాపు 200 మంది పారిశుద్ధ్య కార్మికులకు, అంగన్వాడి కార్యకర్తలు, ఆటో కార్మికులు నిత్యావసర సరుకులను అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కష్టకాలంలో కాంగ్రెస్‌ ‌కార్యకర్తలు ప్రజలకు అందుబాటులో ఉండాలని పిలుపునిచ్చారు. రేషన్‌ ‌బియ్యం పంపిణీ విషయంలో ముఖ్యమంత్రి స్పష్టత ఇవ్వాలన్నారు.

రాష్ట్ర ప్రభుత్వం పంపిణీ చేస్తున్న 12 కేజీల బియ్యంలోనే కేంద్ర ప్రభుత్వం ఇస్తున్న 5 కేజీల బియ్యం కూడా ఇస్తున్నారా అని ప్రశ్నించారు. రేషన్‌ ‌కార్డు లేని వారికి ప్రభుత్వం రేషన్‌ ‌బియ్యం పంపిణీ చేయాలని ఆయన డిమాండ్‌ ‌చేశారు. గన్ని బ్యాగుల కొరతపై ప్రభుత్వానికి ముందుచూపు లేదని విమర్శించారు. ఉద్యోగులకు కోత లేకుండా జీతం చెల్లించాలని… వలస కూలీలకు, రేషన్‌ ‌కార్డు లేని వారికి లాక్‌డౌన్‌ ‌సాయం రూ.1500 అందించాలని ఉత్తమ్‌ ‌కుమార్‌ ‌రెడ్డి చేశారు.

Get real time updates directly on you device, subscribe now.

Leave a Reply

error: Content is protected !!