Take a fresh look at your lifestyle.

కరోనో వైరస్ నివారించేందుకు, ప్రజలను, పేదలను ఆదుకునేందుకు ప్రతి కాంగ్రెస్ కార్యకర్త నిరంతరం ఒక సైనికునిలాగా పని చేయాలి

కరోనో వైరస్ నివారించేందుకు, ప్రజలను, పేదలను ఆదుకునేందుకు ప్రతి కాంగ్రెస్ కార్యకర్త నిరంతరం ఒక సైనికునిలాగా పని చేయాలని పిసీసీ అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి పార్టీ శ్రేణులకు వీడియో కాన్ఫరెన్స్ లో సూచించారు. అన్ని రకాలుగా ప్రభుత్వ కార్యక్రమాలకు మద్దతు ఇస్తూనే అన్ని వర్గాల ప్రజలను ఆదుకునేందుకు కాంగ్రెస్ కార్యకర్తలు ముందుకు వచ్చి పనులు చేయాలనీ,కరోనో వైరస్ వ్యాప్తి విషయంలో ఒక మతం రంగు రుద్ది ప్రచారం చేయడం తగదు అన్నారు. అందరం కలిసి కట్టుగా కరోనా నివారణకు కృషి చేయాలి.. మత పరమైన రంగు రుద్దడం మంచిది కాదు అని సూచించారు.”కరనో వైరస్ విషయంలో ప్రభుత్వం లాక్డౌన్ ప్రకటించిన నేపథ్యంలో పేద ప్రజలను, వలస కార్మికులను, దినసరి కూలీలను ఆదుకునేందుకు కాంగ్రెస్ పార్టీ కార్యాలయం గాంధీభవన్ లో కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేశాము.అలాగే నాయకులతో కూడిన కరోనా రిలీఫ్ గ్రూప్ ఏర్పాటు చేసాము.. డీసీసీలు, సీసీ సీలు వారి వారి కార్య ప్రదేశాలలో ఎక్కువ బాధ్యతలు తీసుకొని పని చేయాలి.

ముఖ్య నాయకులు ప్రజలను ఆదుకునెందుకు నిరంతరం పని చేయలి. ఇప్పుడు ఆపదలో ఉన్న ప్రజలను ఆదుకోవడానికి అందరం కలిసి కట్టుగా ముందుకు వచ్చి పనిచేయాలి..కొన్ని జిల్లా కేంద్రాలలో కూడా డీసీసీ లు కంట్రోల్ రూమ్ లు ఏర్పాటు చేశారు. చేయనివాళ్ళు కూడా ఏర్పాటు చేయాలి. ఉదయం 9 నుంచి 6 గంటల వరకు పని చేయాలి. వచ్చిన ఫోన్లకు వెంటనే స్పందించి వారికి తగిన సహాయం అందించాలి..ఒక నిర్మాణాత్మకమైన ప్రతిపక్ష పార్టీగా మనం పనిచేసి ప్రజలకు సహాయం అందించాలి..ప్రభుత్వ పెద్దలు కరోనో సమయంలో ప్రజలకు సహాయం చేస్తామని పెద్దమాటలు మాట్లాడారు. నెలకు మనిషికి 6 కిలోల బియ్యం ఇస్తున్నట్టుగా 2 నెలల బియ్యం కలిపి ఒక్కొక్కరికి 12 కిలోల బియ్యం కుటుంబానికి 1500 రూపాయలు ఇస్తామని అన్నారు.

“రాష్ట్ర వ్యాప్తంగా 76 లక్షల కుటుంబాలకు ఇవ్వాల్సి ఉండగా దాదాపు 15 రోజులు అయ్యింది ఇంతవరకు 22 లక్షల కుటుంబాలకు మాత్రమే అందాయి.. ఇంకా బియ్యం, డబ్బులు ఇచ్చే పనులు వేగవంతం చేయాలి..అలాగే వ్యవసాయ మార్కెట్లకు వ్యవసాయ ఉత్పత్తులు వస్తున్నాయి. సీఎం 30 వేల కోట్లు రూపాయలు కేటాయించామని చెప్పారు. రైతులకు కనీస మద్దతు ధర అందేలా, ప్రతి గింజ కొనేలా రైతులకు అండగా ఉండాలి.రాష్ట్ర వ్యాప్తంగా కరోనా కేసుల టెస్టులు చాలా ఆలస్యంగా జరుగుతున్నాయి. సీఎం, సీసీఎంబీ లో టెస్టులు చేయిస్తాం. ఇంకా కొన్ని పరీక్ష కేంద్రాలు పెడదాం అన్నారు. కానీ ఇంతవరకు టెస్టుల వేగం పెరగలేదు. రాష్ట్రంలో 25 వేల మందికి టెస్టులు చేయాల్సి ఉంది. ఇవి వేగంగా చేయాలి…కాంగ్రెస్ కార్యకర్తలు ఈ సమయంలో దేశ రక్షణలో సైనికుల వలే పనిచేసి ప్రజలకు సహాయ సహకారాలు అందించాలి..అని దిశానిర్దేశం చేసారు.

Leave a Reply