టిపిసిసి అద్యక్షుడు, ఎంపి కెప్టెన్ ఎన్.ఉత్తమ్ కుమార్ రెడ్డి
సుబేదారి, మార్చి 4, (ప్రజాతంత్ర విలేకరి) : నల్గొండ-ఖమ్మం-వరంగల్ ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారంలో భాగంగా గురువారం కాకతీయ యూనివర్సిటీలో టిపిసిసి అద్యక్షుడు, ఎం.పి. కెప్టెన్ ఎన్.ఉత్తమ్ కుమార్ రెడ్డి, మాజీ ఎంపి వి.హనుమంత రావు, కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి ఎస్.రాములు నాయక్, వరంగల్ అర్బన్, రూరల్ జిల్లా కాంగ్రెస్ కమిటీ అద్యక్షుడు నాయిని రాజేందర్ రెడ్డి, పరకాల నియోజకవర్గ కో-ఆర్డినేటర్ ఇనాగాల వెంకట్రామ్ రెడ్డి తదితరులు ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా కాకతీయ యూనివర్సిటీలోని ఫాకల్టి, విద్యార్థులను, ఉద్యోగులను కలుసుకొని ఎమ్మెల్సీ ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థి ఎస్.సభావాత్ రాములు నాయక్‌కు మొదటి ప్రాధాన్యత ఓటు వేసి గెలిపించాలని కోరారు.
అనంతరం ఉత్తమ్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రము సాధించుకోవడంలో కాకతీయ యూనివర్సిటీ విద్యార్థుల పాత్ర చాల కీలకమని తెలంగాణా రాష్ట్రము ఏర్పడ్డాక ఉమ్మడి వరంగల్ జిల్లా కాకతీయ యూనివర్సిటీ పెద్ద ఎత్తున అభివృద్ధి చెందుతుంది అనుకున్నామని, కానీ అభివృద్ధి చెందలేదన్నారు. వరంగల్ జిల్లాకు టెక్స్టైల్ పార్క్, రింగ్ రోడ్, జర్నలిస్ట్ లకు ఇండ్లు, వేల మందికి ఉద్యోగాలు ఇస్తానని అన్నాడు. ప్రపంచ స్థాయిలో కాకతీయ విశ్వ విద్యాలయం అభివృద్ధి చెందాలని అనుకున్నామని కాని టిఆర్ఎస్ ప్రభుత్వం వచ్చకా విద్యాలయాలను పూర్తిగా నిర్వీర్యం చేస్తూ హామీలను తుంగలో తొక్కాడని విమర్శించారు.
అనాడు తెలంగాణా విభజన చట్టంలో పొందుపరచిన కాజిపేట్ రైల్వే ఫ్యాక్టరీ, బయ్యారం స్టీల్ ఫ్యాక్టరీ, ములుగులో సెంట్రల్ ట్రైబల్ యూనివర్సిటీ, భువనగిరిలో ఎయిమ్స్ వైద్యశాల, రంగా రెడ్డి జిల్లాకు ఐటిఐఆర్ తేవడంలో టిఆర్ఎస్, బిజెపి ప్రభుత్వాలు పూర్తిగా విఫలం చెందాయన్నారు. కాజిపేట్ రైల్వే ఫ్యాక్టరీ గురించి టిఆర్ఎస్ అడగదు, బిజెపి ఇవ్వదు. తెలంగాణా రాష్ట్ర పార్టీ అధ్యక్షుడిగా, ఒక ఎంపిగా ఉమ్మడి వరంగల్ జిల్లా ప్రజలకు ఒక మాట ఇస్తున్నాను కాజిపేట్ కోచ్ ఫ్యాక్టరీ సాధించుకోనేంత వరకు పోరాడుతాం సాధించుకుంటామన్నారు.
టిఆర్ఎస్ పార్టీకి కమిషన్ల మీద ఉన్న ఇంట్రస్ట్ అభివృద్ధిపై లేదని, కాళేశ్వరం, మిషన్ భగీరధ్, కాకతీయ మిషన్ లాంటి వాటి మీద కమిషన్లు వస్త్తాయి కాబట్టి వాటి మీద శ్రద్ధ పెట్టారని, కాజిపేట్ కోచ్ ఫ్యాక్టరీ లాంటి మీద కమిషన్ రాదు కాబట్టి దానిపై శ్రద్ధ పెట్ట లేదన్నారు. ఉమ్మడి వరంగల్ జిల్లా ప్రజలు ఈ ఎమ్మెల్సీ ఎన్నికల్లో టిఆర్ఎస్, బిజెపి పార్టీకి దిమ్మ తిరిగే షాక్ ఇవ్వాలన్నారు. తెలంగాణా ఉద్యమ బిడ్డ కార్మిక నేత రాములు నాయక్ ను నాయకుడిగా ఎన్నుకొని ప్రశ్నించే గొంతుకను చట్ట సభకు పంపాలని అన్నారు. ఎమ్మెల్సీ అభ్యర్ధు రాములు నాయక్ మాట్లాడుతూ 6 సంవత్సరాలు ఎమ్మెల్సీగా పల్లా రాజేశ్వర్ రెడ్డి ఏమి చేసిండాని ఇదే కాకతీయ యూనివర్సిటీ లో కూర్చొని మాట్లడుదామన్నారు.
నువ్వు అంటున్నావు లక్షన్నర ఉద్యోగాలు యిచ్చినవని అంటున్నావు ఇటు రాష్ట్ర ప్రభుత్వం, అటు కేంద్ర ప్రభుత్వంగాని నిరుద్యోగులకు,గవర్నమెంట్ ఉద్యోగులకు, ప్రైవేటు ఉద్యోగులకు, ప్రైవేట్ టీచర్లకు, ఫీల్డ్ అసిస్టెంట్లకు ఇచ్చిన ఏ ఒక్క వాగ్దానం నెరవేర్చాలేదన్నారు. ఏ మొహం పెట్టుకొని ఓట్లు అడగడానికి వస్తున్నారన్నారు. ప్రైవేటు లెక్చరర్ల, యూనివర్సిటీ, కాంట్రాక్టు లెక్చరర్ విషయంలో ఒక్క జిఓతో పెర్మనెంట్ చేస్తా అన్న ముఖ్యమంత్రిని నువ్వు ఎందుకు అడుగుత లేవని ప్రశ్నిచారు. 150 బార్లకు పర్మిషన్ లు ఇచ్చిండు కాని 150 మందికి పర్త్మెంట్లో ఉద్యోగాలకు నోటిఫికేషన్ లు ఇవ్వలేదన్నారు.
అనంతరం జిల్లా కోర్ట్‌లో న్యాయవాదులను కలుసుకొని ఎమ్మెల్సీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి ఎస్.సభావాత్ రాములు నాయక్ మొదటి ప్రాధాన్యత ఓటు వేసి గెలిపించాల్సిందిగా కోరారు. ఈ సందర్భంగా రాములు నాయక్, టిపిసిసి అద్యక్షుడు కెప్టెన్ ఎన్.ఉత్తమకుమార్ రెడ్డి మాట్లడుతూ తెలంగాణా వచ్చిన తర్వాత కెసిఆర్ నల్ల కోర్ట్ వేసుకున్నోలు అందరు దేవుళ్ళు అన్నాడు. కాని ఈ రోజు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రజా స్వామ్యాన్ని ఖూని చేస్తోందన్నారు. అధికార పార్టీ అక్రమాలను అరాచకాలను నిలదీస్తే వారిపై కేసులు పెడుతున్నారన్నారు. తెలంగాణా ఉద్యమంలో వాకీళ్ళు లేక పోతే తెలంగాణా వచ్చేది కాదని, ఆపదలో ఆడుకునే దేవుళ్ళు మీరు, ప్రశ్నించే గొంతుకను గెలిపించండని, మీకు ఏమైనా సమస్యలు ఉన్న పరిష్కరించడానికి వందకు వంద శాతం పోరాడటానికి కృషి చేస్తామన్నారు.
ఈ కార్యక్రమంలో మాజీ మేయర్ ఎర్రబెల్లి స్వర్ణ, పిసిసి సబ్యులు బత్తిని శ్రీనివాస్ రావు, బి. అశోక్ రెడ్డి, టిపిసిసి కార్యదర్శులు దొమ్మాటి సాంబయ్య, కొత్తపల్లి శ్రీనివాస్, మీసాల ప్రకాష్, టిపిసిసి ఆర్గనైజింగ్ సెక్రటరీలు, దుబ్బా శ్రీనివాస్, గ్రేటర్ వరంగల్ కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ ఎంబాడి రవీందర్, టిపిసిసి ఒబిసి డిపార్టుమెంటు ప్రధాన కార్యదర్శి మోడెమ్ శ్రీధర్ గౌడ్, టి.పి.సి.సి. ఓ.బిసి డిపార్టుమెంటు కార్యదర్శి పులి రాజు, జిల్లా మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు పోశాల పద్మ, జిల్లా ఎస్.సి. డిపార్టుమెంటు చైర్మన్ డాక్టర్ రామకృష్ణ, గ్రేటర్ వరంగల్ మైనారిటీ సెల్ చైర్మన్ మిర్జా అజీజుల్లః బేగ్, గ్రేటర్ వరంగల్ మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు బంక సరళ, వరంగల్ వెస్ట్ బ్లాక్ కాంగ్రెస్ అద్యక్షుడు బంక సంపత్ యాదవ్, గ్రేటర్ వరంగల్ కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు కందికొండ చిన్న రాజు యూత్ కాంగ్రెస్ జిల్లా ఉపాధ్యక్షుడు అలువాల కార్తిక్, ఎన్.ఎస్.యు.ఐ జిల్లా ఉపాధ్యక్షుడు పల్లకొండ సతీష్, డివిజన్ అద్యక్షులు, జిల్లా మరియు నగర కాంగ్రెస్ నాయకులు జిల్లా మరియు నగర అనుబంధ సంఘాల అద్యక్ష కార్యదర్శులు పాల్గొన్నారు.