సిద్దాంతాల ఆచరణలో రోశయ్య పెట్టింది పేరు : రోశయ్య మృతి పట్ల టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి సంతాపం
రోశయ్య మృతిపై టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి విచారం వ్యక్తం చేశారు. రోశయ్య జీవితం నేటి రాజకీయ నాయకులకు ఆదర్శం కావాలన్నారు. నీతి నిజాయతీ, నిబద్ధత, ప్రజా సేవ పట్ల అంకితభావం, సిద్దాంతాల ఆచరణలో రోశయ్య పెట్టింది పేరని రేవంత్ కొనియాడారు. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతుడిని ప్రార్థిస్తున్నట్లు తెలిపారు.