Take a fresh look at your lifestyle.

ఆధైర్య పడకండి, వొచ్చేది కాంగ్రెస్‌ ‌ప్రభుత్వమే

జిల్లా నేతలకు భరోసానిచ్చిన టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌ ‌రెడ్డి
ఎవరు కూడా అధైర్య పడాల్సిన అవసరం లేదనీ, వొచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్‌ ‌పార్టీ అధికారంలోకి వొస్తుందనీ, ఆ దిశగా ప్రజల్లోకి ముందుకెళ్ళి సమస్యలపై పోరాటం చేయాలని టిపిసిసి నూతన అధ్యక్షుడు రేవంత్‌ ‌రెడ్డి అన్నారు. శనివారం సిద్దిపేట, గజ్వేల్‌ ‌నుంచి డిసిసి ప్రెసిడెంట్‌ ‌తూంకుంట నర్సారెడ్డి ఆధ్వర్యంలో రేవంత్‌ ‌రెడ్డిని కలిసి సన్మానించారు. ఈ సందర్భంగా రేవంత్‌ ‌రెడ్డి, నర్సారెడ్డి మాట్లాడుతూ..నీళ్లు, నిధులు నియామకాల కోసమే తెలంగాణ రాష్ట్రం కోసం ఎంతో మంది అమరవీరులు తమ ప్రాణ త్యాగాలు అర్పించారని గుర్తు చేశారు. ఎన్నికల ముందు మాయమాటలు చెప్పిన సీఎం కేసీఆర్‌ ‌నేటి వరకు ఇచ్చిన ఒక్క హామీ కూడా నెరవేర్చడం లేదని ఆరోపించారు. ఉమ్మడి ఆంధప్రదేశ్‌లో దేనికోసమైతే పోరాటం చేశామో అవి కూడా ఇంతవరకు జరగడం లేదన్నారు.

తెలంగాణ రాష్ట్రాన్ని ఏర్పాటు చేసిన కాంగ్రెస్‌ ‌పార్టీ వల్లే అభివృద్ధి జరుగుతుందని తెలిపారు. ఎన్నికల ముందు నిరుద్యోగులకు నిరుద్యోగ భృతి చెల్లిస్తామని చెప్పి సీఎం కేసీఆర్‌ ‌మోసగించారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఏడేళ్లు గడుస్తున్నా ఇంతవరకు తెలంగాణా రాష్ట్రం అభివృద్ధిలో ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్న చందంగా ఉందన్నారు. ప్రాజెక్టుల భూములు ఇచ్చిన రైతులు దేవుళ్ళుతో సమానమని వారందర్నీ తాను అన్ని వేళలా ఆదుకుంటామని సీఎం కేసీఆర్‌ ‌హామీ ఇచ్చి, నేడు వారికిచ్చిన మాటను మరిచి రైతుల ఆత్మహత్యలకు కారణమవుతున్నడన్నారు.

నాయకులు, కార్యకర్తలు నిరుత్సాహపడవొద్దని, వొచ్చే ఎన్నికల కోసం ఇప్పటి నుండే ప్రజా క్షేత్రంలో తిరిగి ప్రజా సమస్యలపై పోరాటం చేసే విధంగా ముందుండాలని పిలుపునిచ్చారు. నాయకులకు కార్యకర్తలకు తను అండగా నిలబడతారని భరోసా ఇచ్చారు. ఈ కార్యక్రమంలో పార్టీ నాయకులు దరిపల్లి చంద్రం, దేవులపల్లి యాదగిరి, వంటేరు నరేందర్‌ ‌రెడ్డి, నాయిని యాదగిరి, కేశిరెడ్డి రవీందర్‌ ‌రెడ్డి, అత్తు ఇమామ్‌, ‌తప్పేట శంకర్‌, ‌మిట్టపల్లి, సురేష్‌ ‌వర్మ, రామచంద్రన్‌, ‌రాములు, అంజిరెడ్డి, మధు సయ్యద్‌, అతీక్‌ ‌తదితర నాయకులు, కార్యకర్తలు భారీ ఎత్తున పాల్గొన్నారు.

Leave a Reply