Take a fresh look at your lifestyle.

టూరిజం కార్యాలయ అధికారి దురహంకారం

  • మాస్క్ ‌పెట్టుకోమన్న మహిళా ఉద్యోగిపై దాడి
  • విచారణకు ఆదేశించిన మంత్రి అవంతి

నెల్లూరు,జూన్‌ 30 : ‌మాస్క్ ‌పెట్టుకోమన్నందుకు మహిళ ఉద్యోగిపై దాడి చేయడమే గాకుండా ఆమెను చితకబాదిన ఓ అధికారి సంఘటన నెల్లూరులోని ఏపీ టూరిజం కార్యాలయంలో చోటు చేసుకుంది. అక్కడ డిప్యూటీ మేనేజర్‌గా విధులు నిర్వహిస్తున్న భాస్కర్‌రావు ముఖానికి మాస్క్ ‌లేకుండా కార్యాలయానికి వచ్చాడు. దీంతో అక్కడే పనిచేస్తున్న కాంట్రాక్ట్ ఉద్యోగిని ఉషారాణి ముఖానికి మాస్క్ ‌పెట్టుకోమని సూచించింది. దీంతో ఆగ్రహానికి గురైన భాస్కర్‌రావు దివ్యాంగురాలైన ఉషారాణిపై విచక్షణా రహితంగా దాడి చేశాడు. మహిళ అని కూడా చూడకుండా ఇనుపరాడ్డుతో కొట్టాడు. పలువురు ఉద్యోగులు అడ్డుకున్నప్పటికీ.. అతను శాంతించలేదు.

ఈ ఘటనకు సంబంధించిన దృశ్యాలు సీసీ కెమెరాలో రికార్డ్ అయ్యాయి. వీటి ఆధారంగా పోలీసులు కేసు నమోదు చేసి భాస్కర్‌ ‌రావును రిమాండ్‌కు తరలించారు. ఈ ఘటనపై ఏపీ టూరిజం శాఖ మంత్రి అవంతి శ్రీనివాసరావు స్పందించారు. బాధితురాలితో ఆయన ఫోన్లో మాట్లాడారు. ఆ రోజు కార్యాలయంలో ఏం జరిగిందో పూర్తి నివేదిక ఇవ్వాలని కలెక్టర్‌ ‌సైతం అధికారును ఆదేశించారు. ఈ ఘటనపై ఉద్యోగులు తీవ్రస్తాయిలో మండిపడ్డారు. అతనిపై  కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్‌ ‌చేశారు.

Leave a Reply

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More

Privacy & Cookies Policy