Take a fresh look at your lifestyle.

గుజరాత్‌లో తీరం దాటిన తౌక్తే తుఫాన్‌

  • మహారాష్ట్ర, గుజరాత్‌లలో భారీ వర్షాలు
  • సూరత్‌ ‌విమానాశ్రయం మూసివేత
  • సహాయక చర్యల్లో నిమగ్నమైన ఎన్డీఆర్‌ఎఫ్‌ ‌బృందాలు
  • తౌక్తే తుపాన్‌ ‌ప్రభావం గుజరాత్‌ ‌రాష్ట్రంపై తీవ్రంగా పడింది.

గుజరాత్‌ ‌వద్ద తౌక్తే తుపాను  తీరాన్ని తాక్కింది.  గంటకు 185 కిలోటర్ల వేగంతో  ఈదురుగాలులు వీచాయి. తుపాను ప్రభావంతో మహారాష్ట్ర, గుజరాత్‌లలో భారీ వర్షాలు పెను విధ్వంసం సృష్టిస్తున్నాయి. ముంబై తీరంలో సముద్రపు అలలు ఉవ్వెత్తున ఎగసిపడుతున్నాయి. బీభత్సం సృష్టిస్తున్న తౌక్తే తుపాను… పోర్‌బందర్‌-‌మహువాల దగ్గర తీరం దాటింది. వెరవల్‌-‌సోమనాథ్‌ ‌తీరంలో సముద్ర అలలు ఎగసిపడ్డాయి. వెంటనే రంగంలోకి దిగిన ఎన్డీఆర్‌ఎఫ్‌, ఎస్డీఆర్‌ఎఫ్‌ ‌బృందాలు సహాయక చర్యలు చేపట్టాయి. తుపాన్‌ ‌ప్రభావం వల్ల డియూ,అమ్రేలి, భావనగర్‌, ‌బోటాడ్‌, అహ్మదాబాద్‌, ‌గాంధీనగర్‌, ‌మెహసన, సబర్‌ ‌కాంత,బాణాస్‌ ‌కాంత ప్రాంతాల్లో మంగళవారం భారీవర్షం కురుస్తోంది. తుపాన్‌ ‌ప్రభావం వల్ల ముందు జాగ్రత్తగా సూరత్‌ ‌నగరంలోని విమానాశ్రయాన్ని మూసివేశారు. దేశంలోని వివిధ ప్రాంతాల నుంచి సూరత్‌ ‌కు రాకపోకలు సాగించాల్సిన విమానసర్వీసులను రద్దు చేశారు. అలాగే మహారాష్ట్ర, ముంబైల్లోనూ విద్వంసం కొనసాగుతోంది. కేరళలో తీవ్ర నష్టం వాటిల్లింది. భారీ నుంచి అతి భారీ వర్షాలు, బలమైన గాలులు, ఉవ్వెత్తున్న ఎగిసిపడుతున్న అలలతో పశ్చిమ తీర ప్రాంతం అల్లకల్లోలంగా మారింది.

అరేబియా సముద్రంలో ఏర్పడిన తౌక్తే తుఫాన్‌ ‌తీవ్ర రూపం దాల్చడంతో  కేరళ, కర్ణాటక, గోవాలో భారీ నష్టం వాటిల్లింది. కేరళలో సముద్రం ముందుకు రావడం, అలల ఉధృతికి వందలాది ఇళ్లు ధ్వంసమయ్యాయి. వేలాదిమంది నిరాశ్రయులయ్యారు. కర్ణాటకలో భారీ వర్షాలకు 73 గ్రామాల్లో భారీగా నష్టం జరిగింది. రాష్ట్రంలో వేర్వేరు ప్రమాదాల్లో నలుగురు మరణించారు. మహారాష్ట్ర, గుజరాత్‌కు భారీ వర్ష సూచన ఉంది. తెలుగు రాష్ట్రాలపై తౌక్తే తుపాను ప్రభావం కొనసాగుతోంది. తౌక్తే తుపాను కారణంగా తెలంగాణలో మరో రెండ్రోజుల పాటు వర్షాలు పడే అవకాశం ఉంది. తౌక్తే ప్రభావంతో తెలంగాణలో వాతావరణం చల్లబడింది. వర్షాల కారణంగా పగటిపూట ఉష్ణోగ్రతలు  తగ్గాయి.

అటు ఏపీలోనూ రెండ్రోజుల పాటు తేలికపాటి వర్షాలు కురవనున్నాయి. రాయలసీమలో ఒకట్రెండు చోట్ల ఉరుములతో కూడిన వర్షం పడుతోంది. తుఫాన్‌ ‌తీరం దాటే సమయంలో 150 నుంచి 170 కి. వేగంలో గాలులు వీస్తాయని హెచ్చరించారు. ఇప్పటికే తీరం వెంబడి గంటకు 60 నుంచి 70 కి.. వేగంతో బలమైన గాలులు వీస్తున్నాయి. ప్రభావిత రాష్ట్రాల్లో 100 ఎన్డీఆర్‌ఎఫ్‌ ‌బృందాలను రంగంలోకి దించారు. తుఫాన్‌ ‌ప్రభావం రాష్ట్రంపై ఉండబోదని వాతావరణ శాఖ అధికారి ఒకరు తెలిపారు. తుఫాన్‌ ‌దిశగా గాలులు వీస్తున్నందున ఉక్కపోత కొనసాగు తుందన్నారు. మరో 24 గంటల్లో ముంబై, థానె, ఉత్తర కొంకణ్‌, ‌పాలగఢ్‌ ‌ప్రాంతాలలో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని ఐఎండీ హెచ్చరించింది. రాయ్‌గఢ్‌లో మరింత ఎక్కువగా వర్షాలు పడతాయని తెలిపింది. తీర ప్రాంతాలలో బలమైన గాలులు వీస్తాయని సూచించింది.

తుఫాన్‌ ‌నుంచి ముంబై నగరానికి నేరుగా ముప్పులేదని వెల్లడించిందిభారీ వర్షసూచన ఉండటంతో ముంబై వాసులు జాగ్రత్తగా ఉండాలని, నగర పాలక సంస్థ సూచనలను పాటించాలని మేయర్‌ ‌కిశోరి పడ్నేకర్‌ ‌విజ్ఞప్తి చేశారు. తుఫాన్‌ ‌తీరం దాటనున్న గుజరాత్‌లో అధికారులు యోల్లో అలర్ట్ ‌ప్రకటించారు.  రవాణా, విద్యుత్‌, ‌కమ్యూనికేషన్‌ ‌వ్యవస్థకు అంతరాయం ఏర్పడే అవకాశం ఉందని ఐఎండీ హెచ్చరించింది. గోవాలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. బలమైన ఈదురుగాలులకు వందలాది స్తంభాలు విరిగాయని, హై టెన్షన్‌ ‌వైర్లపై చెట్లు కూలడంతో సరఫరా నిలిచిపోయిందని తెలిపారు. భారీ నుంచి అతి భారీ వర్షాలు, అలల తాకిడికి కేరళ అల్లాడిపోతోంది.

సముద్రం ఉన్నట్టుండి ముందుకు చొచ్చుకురావడంతో వందలాది ఇళ్లు ధ్వంసమయ్యాయి. 9 జిల్లాలలో తీవ్ర ప్రభావం ఉంది. ముఖ్యంగా ఎర్నాకుళం, త్రిసూర్‌, ‌తిరువనంతపురం, అలప్పుజా, కోజికోడ్‌లలో అలలు బీభత్సం సృష్టిస్తున్నాయి. నేవీ, ఎయిర్‌ ‌ఫోర్స్, ఎన్డీఆర్‌ఎఫ్‌ ‌బృందాలు సహాయక చర్యలు చేపడుతున్నాయి. తీర, లోతట్టు ప్రాంతాలలో వందలాది కుటుంబాలను పునరావాస శిబిరాలకు తరలించారు. ఎర్నాకులం, ఇడుక్కి, మలప్పురం జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తున్నాయి. అధికారులు ఆరెంజ్‌ అలర్ట్ ‌ప్రకటించారు.

Leave a Reply