Take a fresh look at your lifestyle.

మరొక్కమారు తాకిపోవా?

కాలం నేర్పించే ఇష్టాలు
చేదు విచిత్రాలు….
ఆ నైజమే నిజంగా ఏదో ఓ రూపంలో
మనసుకు పరీక్ష…మనిషికి శిక్ష.

మనసును కౌలిగి పట్టే మాట
మాటకు పట్టం కట్టే ప్రేమ
రెండు పక్క పక్కనే ఉంటూ
తరించాలని ఏడిపిస్తాయి..

నీవు కురిసిన తేమకు
తీయని కల చిగురిస్తూనే ఉంది…
మరొక్కమారు తాకిపోవా?
మనసు విరగ్గసెందుకు ..

మనసుకు బహు రుచి
ఇష్టం, సంతోషం, అభిమానం,నమ్మకం…
వీటి బలం చూసుకునే
కలలు ఎగిసిపదేది…

భూమి బరువు తక్కువే
ప్రేమ పరువు ముందు
సముద్రం ఓ పిల్ల కాలువే.
బంధపు లోతు ముందు

నీటి అద్దంలో  అందాన్ని
చూసుకుంటుంది మేఘం.
మాట మెరుపుతో
జోరు వాన  ప్రేమ.

ఎంత దూరమైనా  మనసు
ఓ మాటకు    లొంగీపోవాల్సిందే…
ఎంత లోతునున్నా ఇష్టం
ఒక నాటికి నిజమై పొంగిపోవలసిందే…

మనిషి తవ్వకం లో
కొండల్ని వెలికితీయడం సులభమే..
కానీ ఒక కన్నీటి బొట్టు చిరునామా
కనుక్కోవడం జీవిత సమస్యే…

– చందలూరి నారాయణరావు
      9704437247

Leave a Reply