Take a fresh look at your lifestyle.

కోవిడ్ తో మొత్తం 15 మంది టిటిడి ఉద్యోగుల మృతి

వారి కుటుంబాలను ఆదుకుంటామన్న ఛైర్మన్‌
కొరోనా సెకండ్‌ ‌వేవ్‌ ‌కారణంగా ఇప్పటి వరకు 15మంది టీటీడీ ఉద్యోగులు మరణించారని.. మరణించిన ఉద్యోగుల కుటుంబాలను టీటీడీ తరుపున ఆదుకుంటామని చైర్మన్‌ ‌వైవీ సుబ్బారెడ్డి తెలిపారు. ఉద్యోగులు తిరుమలలో విధులు నిర్వర్తిస్తూ కొరోనా బారిన పడలేదన్నారు.

తిరుపతిలో నివసిస్తూ ఉద్యోగులు కొరోనా బారిన పడ్డారన్నారు. తిరుమలలో విధులు నిర్వర్తించే ఉద్యోగులందరికీ యుద్ధ ప్రాతిపదికన వ్యాక్సిన్‌ ‌వెయ్యిస్తున్నామని చెప్పారు. టీటీడీ ఉద్యోగుల కోసం బర్డ్ హాస్పిటల్లో  ప్రత్యేకంగా కోవిడ్‌ ‌వార్డును ఏర్పాటు చేస్తున్నామన్నారు.

సేంద్రియ వ్యవసాయంతో పండించిన బియ్యంతో రేపటి నుంచి శ్రీవారికీ నైవేద్యం పెడుతామని తెలిపారు. భవిష్యతులో అన్నప్రసాదంలో కూడా సేంద్రియ వ్యవసాయంతో పండించిన పంటలతో భక్తులకు అన్నప్రసాదం పెట్టేందుకు ప్రయత్నిస్తామని టీటీడీ చైర్మన్‌ ‌వైవీ సుబ్బారెడ్డి పేర్కొన్నారు.

Leave a Reply