Take a fresh look at your lifestyle.

దేశంలో మొత్తం పాజిటివ్‌ ‌కేసుల సంఖ్య.. 2,07,615

  • భారత్‌లో ఆగని  కొరోనా విజృంభణ
  • వైరస్‌తో 5,815 మంది మృతి

భారత్‌లో కరోనా విజృంభణ కొనసాగుతోంది. దేశవ్యాప్తంగా కరోనా పాజిటివ్‌ ‌కేసులు 2 లక్షలు దాటాయి. గడిచిన 24 గంటల్లో 8,909 కొత్త కోవిడ్‌-19 ‌కేసులు, 217 మరణాలు నమోదయ్యాయని కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ వెల్లడించింది. దీంతో దేశంలో మొత్తం పాజిటివ్‌ ‌కేసుల సంఖ్య 207,615కు చేరింది. ప్రస్తుతం 101,497 యాక్టివ్‌ ‌కేసులుండగా, ఇప్పటివరకు ఈ మహమ్మారి నుంచి 100,303 నయమై కోలుకున్నారు. మొత్తం 5,815 మంది కరోనా బారిన పడి మృతి చెందినట్టు ఆరోగ్య మంత్రిత్వ శాఖ తాజాగా విడుదల చేసిన హెల్త్ ‌బులిటెన్‌ ‌లో పేర్కొంది. మృతుల సంఖ్య కూడా అదే స్థాయిలో ఉంది. గడిచిన 24 గంటల్లో కరోనాతో 217 మంది ప్రాణాలు కోల్పోయారు. తెలుగురాష్ట్రాల్లోనూ కరోనా విలయతాండవం చేస్తోంది. ఎపిలో కరోనా కేసులు 3,200 చేరుకోగా,. 64 మందిని కరోనా కబలించింది. తెలంగాణలో 2,891 కోవిడ్‌ ‌కేసులు? 92 మరణాలు సంభవించాయి. మహారాష్ట్రలో కరోనా వేగంగా విస్తరిస్తోంది. రాష్ట్రంలో కరోనా కేసుల సంఖ్య 72,300కు పెరిగింది. ఇప్పటివరకు 2,465 మంది ప్రాణాలు కోల్పోయారు. తమిళనాడులో 24,586 కేసులు, 197 మరణాలు నమోదయ్యాయి. ఢిల్లీలో 22,132 పాజిటివ్‌ ‌కేసులు, 556 మంది కోవిడ్‌ ‌తో మృత్యువాత పడ్డారు. గుజరాత్‌ ‌లో 17,617 మందికి కరోనా సోకగా 1,092 మంది కరోనాతో మృతి చెందారు. మహారాష్ట్రలో అత్యధికంగా 72,300 పాజిటివ్‌ ‌కేసులు నమోదు కాగా, 2,465 మంది మృతి చెందారు.

తమిళనాడులో 24,586, ఢిల్లీలో 22,132, గుజరాత్‌లో 17,632, రాజస్థాన్‌లో 9,373, యూపీలో 8,729, మధ్యప్రదేశ్‌లో 8,420, పశ్చిమ బెంగాల్‌లో 6,168, బీహార్‌లో 4,096, కర్ణాటకలో 3,796, ఏపీలో 3,791, తెలంగాణలో 2,891, జమ్మూకశ్మీర్‌లో 2,718, హర్యానాలో 2,652, పంజాబ్‌లో 2,342, ఒడిశాలో 2,245, అసోంలో 1,562, కేరళలో 1,413, ఉత్తరాఖండ్‌లో 1,043, జార్ఖండ్‌లో 722, ఛత్తీస్‌గఢ్‌లో 564, త్రిపురలో 471, హిమాచల్‌ ‌ప్రదేశ్‌లో 345, ఛండీఘర్‌లో 301, మణిపూర్‌లో 89, లఢక్‌లో 81, గోవాలో 79, నాగాలాండ్‌లో 58, అండమాన్‌ ‌నికోబార్‌ ‌దీవుల్లో 33, మేఘలాయలో 30, అరుణాచల్‌‌ప్రదేశ్‌లో 28, మిజోరాంలో 13, సిక్కింలో ఒక్క పాజిటివ్‌ ‌కేసు నమోదైంది. దేశంలో కరోనా కేసుల సంఖ్య పెరగడానికి టెస్టుల సంఖ్య పెరగడం కూడా ఓ కారణమే. రోజుకు సగటున 1,20,000 టెస్టులు చేస్తున్నారు. భారత్‌లో కరోనా పీక్‌ ‌స్టేజ్‌కు చేరుకోదని.. దీనికి ప్రభుత్వం తీసుకున్న చర్యలే కారణమని ఐసీఎంఆర్‌ ‌తెలిపింది. మిగతా దేశాలతో పోలిస్తే కరోనా విషయంలో భారత్‌ ‌మెరుగైన స్థితిలో ఉందని ఐసీఎంఆర్‌ అధికారి తెలిపారు. ప్రపంచవ్యాప్తంగా కరోనా మరణాల రేటు 6.13 శాతం ఉండగా.. మనదేశంలో ఇది 2.82 శాతం మాత్రమేనని ఆరోగ్య శాఖ తెలిపింది.

Get real time updates directly on you device, subscribe now.

Leave a Reply

error: Content is protected !!