కొత్తగా 1842 మందికి పాజిటివ్
తెలంగాణ వ్యాప్తంగా కొరోనా కేసులు పెరుగుతూనే ఉన్నాయి. ఆదివారం 8 గంటలకు గడిచిన 24 గంటల్లో రాష్ట్రవ్యాప్తంగా 1842 పాజిటివ్ కేసులు నమోదవడంతో మొత్తం కేసుల సంఖ్య 1,0,6091 కు చేరింది. తాజాగా ఆరు మంది బాధితులు మృతి చెందడంతో మొత్తం మరణాల సంఖ్య 761 కు చేరింది. వైరస్ నుంచి కొత్తగా 1825 మంది కోలుకుని ఆదివారం హాస్పిటళ్ల నుంచి డిశ్చార్జ్ అయ్యారు. మొత్తం 82,411 మంది కోవిడ్ పేషంట్లు ఇప్పటివరకు కోలుకున్నారు. ప్రస్తుతం రాష్ట్రంలో 22,919 యాక్టివ్ కేసులున్నాయి. కొత్తగా నమోదైన కేసుల్లో అత్యధికంగా హైదరాబాద్లో 373 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి.
ఈ మేరకు రాష్ట్ర వైద్యారోగ్యశాఖ సోమవారం హెల్త్ బులెటిన్లో పేర్కొంది. తెలంగాణలో రికవరీ రేటు 77.67 శాతంగా ఉందని తెలిపింది. గత 24 గంటల్లో 36,282 కోవిడ్ నిర్దారణ పరీక్షలు చేశామని, దాంతో మొత్తం పరీక్షల సంఖ్య 9,68,121 కి చేరిందని వైద్యారోగ్యశాఖ వెల్లడించింది. ఇందులో హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోనే 373 నమోదయ్యాయి. ఇంట్లో, ఐసోలేషన్కేంద్రాల్లో 16,482 మంది ఉన్నారు. గడిచిన 24 గంటల వ్యవధిలో 36,282 మందికి కొవిడ్ -19 పరీక్షలు చేయగా, ఇప్పటివరకు 9,68,121 మందికి టెస్టులు చేసినట్లు పేర్కొంది.