Take a fresh look at your lifestyle.

దేశంలో మొత్తం కొరోనా కేసుల సంఖ్య.. 1,58,333

24 గంటల్లో నమోదైన పాజిటివ్‌ ‌కేసులు.. 6,566

భారత్‌ ‌లో రోజురోజుకూ కొరోనా వైరస్‌ ‌వేగంగా విజృంభిస్తోంది. గడిచిన 24 గంటల్లో 6,566 కొత్త కోవిడ్‌-19 ‌పాజిటివ్‌ ‌కేసులు,  194 మరణాలు నమోదయ్యాయని ఆరోగ్య, కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ తెలిపింది. దీంతో దేశంలో మొత్తం కొరోనా కేసుల సంఖ్య 1,58,333కి పెరిగింది. వీటిలో ప్రస్తతం 86,110 యాక్టివ్‌ ‌కేసులున్నాయి. ఇప్పటివరకు దేశవ్యాప్తంగా 67,692 నయమై కోలుకున్నారు. ఈ వైరస్‌ ‌మహమ్మారితో 4,531 ప్రాణాలు కోల్పోయారు. ఇండియాలో కోలుకున్న వారు 42.72 శాతంగా ఉందని ఆరోగ్య మంత్రిత్వ శాఖ పేర్కొంది. అటు ప్రపంచవ్యాప్తంగా  కరోనా వ్యాప్తి ఆగడం లేదు. ప్రపంచలో 56లక్షల 81వేల మందికి కరోనా వైరస్‌ ‌సోకింది. రాజస్థాన్‌లో కొత్తగా 131 కరోనా పాజిటివ్‌ ‌కేసులు  ప్రజలు సాధారణ జీవనంవైపు క్రమంగా అడుగులు వేస్తున్నవేళ కరోనా వైరస్‌ ఆం‌దోళనకు గురిచేస్తున్నది. ఎడారి రాష్ట్రమైన రాజస్థాన్‌లో గత 24 గంటల్లో కొత్తగా 131 కరోనా పాజిటివ్‌ ‌కేసులు నమోదవగా, ఆరుగురు మరణించారు. దీంతో రాష్ట్రంలో మొత్తం కేసుల సంఖ్య 7947కు చేరగా, మృతులు 179కి పెరిగారు. ఇప్పటివరకు నమోదైన కరోనా పాజిటివ్‌ ‌కేసుల్లో 3202 యాక్టివ్‌గా ఉండగా, 4566 మంది బాధితులు కోలుకున్నారు. కొత్తగా నమోదైన 131 కేసుల్లో అత్యధికంగా ఝలావర్‌లో 69, పాలిలో 13, భరత్‌పూర్‌లో 13 చొప్పున ఉన్నాయని రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ ప్రకటించింది

Leave a Reply