Take a fresh look at your lifestyle.

మొత్తం కేసులు 59,662..

  • 24గంటల్లో 95మంది మృతి.. కొరోనా వివరాలు వెల్లడించిన కేంద్రం
  • మరణాల రేటు 3.3 శాతం మాత్రమే : కేంద్ర ఆరోగ్యశాఖ మంత్రి హర్షవర్ధన్‌ 

గడిచిన 24గంటల్లో 95మంది కరోనాతో మరణించినట్లు కేంద్రం తెలిపింది. దేశంలో కరోనావైరస్‌ ‌కేసులు పెరుగుతూనే ఉన్నాయి. కేంద్రం తెలిపిన వివరాల ప్రకారం.. శనివారం ఉదయం వరకు 59662 మందికి సోకగా..17847మంది డిశ్చార్జ్ అయ్యారు. కాగా ఇప్పటి వరకు వైరస్‌ ‌తో 1981 మంది మృతి చెందగా..3320 కొత్త కేసులు నమోదయ్యాయి. ఢిల్లీలో కరోనా కేసులు 6వేలు దాటినట్లు తెలుస్తోంది. మరోవైపు విదేశాల్లో ఉన్న భారతీయులు స్వదేశానికి చేరుకుంటున్నారు. లాక్‌ ‌డౌన్‌ ‌కారణంగా ఇతర దేశాల్లో ఉన్న భారతీయుల్ని స్వదేశానికి తెచ్చేందుకు కేంద్రం భారీ ఏర్పాట్లు చేస్తోంది. ఇందులో భాగంగా బంగ్లాదేశ్‌, ‌యుఎఇ, మస్కట్‌, ‌మలేషియాలో ఉన్న భారతీయుల్ని ఓడలు, విమానాల ద్వారా స్వదేశానికి తరలించింది.వీరందనిని నేరుగా క్వారంటైన్‌ ‌కేంద్రాలకు తరలిస్తున్నారు. ప్రపంచ వ్యాప్తంగా 3.86 మిలియన్ల మందికి పైగా నవల కరోనావైరస్‌ ‌సోకినట్లు తెలుస్తోంది. ఇప్పటికే 2,68,620 మంది మరణించారు. కరోనాతో యుఎస్‌ ‌తరువాత 30,000మరణాలతో ఎక్కువ నమోదైన దేశంగా ప్రపంచంలోనే ఇటలీ మూడో స్థానంలో నిలిచింది.

దేశంలో కొరోనా మరణాల రేటు 3.3 శాతం మాత్రమే : కేంద్ర ఆరోగ్యశాఖ మంత్రి హర్షవర్ధన్‌
‌నోవెల్‌ ‌కరోనా వైరస్‌ ‌వల్ల దేశంలో మరణాల రేటు 3.3 శాతంగా ఉన్నట్లు కేంద్ర ఆరోగ్యశాఖ మంత్రి హర్షవర్ధన్‌ ‌తెలిపారు. రికవరీ రేటు కూడా 29.9 శాతానికి పెరిగినట్లు మంత్రి చెప్పారు. హర్షవర్ధన్‌ ‌శనివారం డియాతో మాట్లాడుతూ మనదేశానికి ఇవి మంచి సంకేతాలన్నారు. ఇక దేశంలో వైరస్‌ ‌రెట్టింపు అవుతున్న రేటు గురించి కూడా ఆయన వెల్లడించారు. గత మూడు రోజుల్లో వైరస్‌ ‌డబ్లింగ్‌ 11 ‌రోజులుగా ఉన్నట్లు తెలిపారు. గత చివరి ఏడు రోజులకు డబ్లింగ్‌ ‌రేటు 9.9 శాతంగా ఉందన్నారు. కరోనా వైరస్‌ ‌వల్ల చాలా దేశాల్లో దయనీయ పరిస్థితి నెలకొన్నదని, అయితే మన దేశంలో అటువంటి

Leave a Reply