సింగపూర్ లో కరోనా బారిన పడిన వలస కార్మికుల కోసం గోల్డ్ మైన్ తువాస్ ఫ్యాక్టరీని డార్మిటరీగా మార్చారు. ఇక్కడ రోజుకు 450 మందికి ఆహారం తయారు చేయడానికి వంటశాలను ఏర్పాటు చేశారు. కరోనా బాధితులైన వలస కార్మికులకు ఆహారాన్ని అందజేయడం కోసం ఆ దేశం ప్రముఖ చెఫ్ లు( వంట వాళ్లకు హెడ్) డామియన్ డి సిల్వ, జ్యూలియన్ రోయర్, ఎల్ జి హాన్ ఒక బృందంగా ఏర్పడ్డారు.
ఆగ్నేయాసియా దేశాలకు చెందిన వలస కార్మికుల కోసం దీనిని రూపకల్పన చేశారు. ఏప్రిల్ 22 నుంచి ఇది పని చేస్తోంది. ప్రభుత్వ సహాయంతో నడుస్తున్న ఈ ఆహార సరఫరా కేంద్రంలో రోజుకు 2 డాలర్లకు ఆహారం సరఫరా అవుతోంది,.