వ్యవస్థాపక సంపాదకులు

దేవులపల్లి అమర్

ఎడిటర్

దేవులపల్లి అజయ్

రేపు కేసీఆర్‌, ‌జగన్‌ల భేటీ

January 11, 2020

Tomorrow KCR and Jagan's meeting

  • రాజధాని ఆందోళన సమయంలో ఆసక్తికరంగా భేటీ
  • ఇరు రాష్టాల్ర మధ్య సమస్యలు కొలిక్కి వొచ్చేనా?
  • రెండురాష్టాల్ల్రో ఆసక్తికర చర్చ

ప్రజాతంత్ర, హైదరాబాద్‌ : ఏపీ సీఎం జగన్మోహన్‌ ‌రెడ్డి, తెలంగాణ సీఎం కేసీఆర్‌ ‌మరోసారి భేటీ కాబోతున్నారు. సోమవారం మధ్యాహ్నం సమయంలో వీరి భేటీ జరగనున్నట్లు తెలుస్తోంది. ప్రధానంగా అమరావతిలో రాజధాని తరలింపుపై పెద్ద ఎత్తున ఆందోళనలు జరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో వీరి భేటీ ప్రాధాన్యతన సంతరించుకుంది. అమరావతి రాజధాని శంకుస్థాపన సమయంలో తెలంగాణ సీఎం కేసీఆర్‌సైతం పాల్గొన్నారు. అమరావతి నిర్మాణానికి తన సహకారం అందిస్తానని ప్రకటించారు. ఈ నేపథ్యంలో ఇరువురి సీఎంల మధ్య రాజధానిపై చర్చజరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి. అమరావతిలోనే ఏపీ రాజధాని నిర్మాణం జరిగితే హైదరాబాద్‌కు కొంత ఇబ్బందికర పరిస్థితి అనే వాదన వినిపిస్తుంది. హైదరాబాద్‌కు అమరావతి దగ్గరగా ఉండే ప్రాంతం. దీంతో ఎక్కువ మంది హైదరాబాద్‌ ‌నుంచి అమరావతి షిప్ట్ అయ్యేందుకు వెనుకాడరు. అదే విశాఖపట్టణం అయితే హైదరాబాద్‌ ‌నుంచి వెళ్లాలంటే కష్టం. దీంతో హైదరాబాద్‌లోని ఏపీ ప్రాంత వాసులు తరలిపోకుండా ఉండలాంటే అమరావతికంటే విశాఖపట్టణం రాజధానిగాఉంటేనే మంచిదనే భావన అందరిలో ఉంది. ఈ నేపథ్యంలో సీఎం కేసీఆర్‌సైతం ఏపీ రాజధానిని విశాఖపట్టణం తరలించడానికే జగన్‌కు సలహాఇచ్చే అవకాశం ఉన్నట్లు ప్రచారం జరుగుతుంది. ఇక ద తెలుగు రాష్టాల్ర మధ్య అనేక సమస్యలు ఉన్నాయి. ఈ భేటీలో ఇరు రాష్టాల్రకు సంబంధించిన కీలక అంశాలపై చర్చించనున్నారు. విభజన చట్టం, ఎన్నో రోజులుగా పెండింగ్‌లో ఉన్న సమస్యలపై ప్రధానంగా ఫోకస్‌ ‌పెట్టనున్నట్లు తెలుస్తోంది. ఈ సమావేశంలో విద్యుత్‌ ఉద్యోగుల విభజన సమస్యలు, శ్రీశైలానికి గోదావరి నీళ్ల తరలింపుపై ప్రధానంగా చర్చించనున్నట్లు తెలుస్తోంది.

గోదావరి-కృష్ణా అనుసంధానంపై ఇప్పటికే ఇద్దరు సీఎంలు చర్చించారు.. కానీ ఎలాంటి క్లారిటీకి రాలేకపోయారు. ఈ భేటీలో ఇదే అంశంపై ఫోకస్‌ ‌పెట్టే అవకాశాలు కనిపిస్తున్నాయి. అంతేకాదు రాజధానిపై రగడ జరుగుతున్న సమయంలోనే ఈ సమావేశం జరగనుండటంతో.. ఈ అంశం కూడా ప్రస్తావనకు వచ్చే అవకాశం ఉంది. ఇద్దరు ముఖ్యమంత్రులు ఇప్పటికే రెండు, మూడుసార్లు సమావేశమయ్యారు. విభజన చట్టం, పెండింగ్‌ ‌సమస్యలపై చర్చించారు. కొన్నిటికి పరిష్కారం దొరికినా.. మరికొన్ని మాత్రం అలాగే పెండింగ్‌ ఉం‌డిపోయాయి. దీంతో ఈ సమస్యల్ని వీలైనంత త్వరగా క్లియర్‌ ‌చేయాలని భావిస్తున్నారు. మరి ఈ భేటీలో సీఎంలు ఎలాంటి చర్చలు జరుపుతారన్నది ఆసక్తికరంగా మారింది. సోమవారం భేటీ సందర్భంగా జగన్‌మోహన్‌రెడ్డి శనివారం మధ్యాహ్నం అమరావతి నుంచి బయల్దేరి భాగ్యనగరానికి చేరుకున్నారు. ముఖ్యమంత్రి మూడు రోజుల పాటూ హైదరాబాద్‌లోనే ఉంటారు.

Tags: ys jagan kcr, meeting highlights, telugu states