- టాప్-5లో భారత షూటర్ మనూ భాకర్‌కు చోటు
- బాడ్మింటన్‌లో క్వార్టర్ ఫైనల్స్‌కు పీవీ సింధు..ఒలింపిక్స్‌లో రాణిస్తున్న భారత క్రీడాకారులు
38 ఏళ్ల వయసులోనూ తన పంచ్ పవర్ సత్తాను చాటాలని ప్రయత్నించిన మేరీకోమ్ ప్రీక్వార్టర్స్‌లోనే ఓటమిని చవిచూసింది. ఓటమి భారంతో బాక్స్ రింగ్‌లోనే ఆమె కన్నీటి పర్యంతమయ్యారు. 2019 ప్రపంచ ఛాంపియన్షిప్ క్వార్టర్స్‌లో వలెన్షియాను ఓడించిన మేరీకోమ్ ఒలింపిక్స్ ప్రిక్వార్టర్లో ఆమె చేతిలోనే ఓటమి పాలైంది. కొలంబియా తరఫున ఒలింపిక్స్‌లో తొలి పతకం గెలిచిన మహిళా బాక్సర్ వలెన్షియానే కావడం గమనార్హం.
టాప్-5లో భారత షూటర్ మనూ భాకర్‌కు చోటు
టోక్యో ఒలింపిక్స్ పోటీల్లో పాల్గొన్న భారత షూటర్ మనూ భాకర్ రెండుసార్లు పూర్తిగా నిరాశపరించింది. కానీ, మూడోసారి సత్తా చాటింది. మూడోసారి క్వాలిఫికేషన్ రౌండ్లో అదరగొట్టి టాప్-5లో చోటుదక్కించుకుంది. తద్వారా తదుపరి రౌండ్లోకి అడుగుపెట్టింది. తొలుత 10 మీటర్ల ఎయిర్ పిస్టల్ విభాగంలో ఆమె ట్రిగ్గర్ మొరాయించడంతో అవకాశం కోల్పోయిన మనూ భాకర్.. ఆ తర్వాత జరిగిన మిక్స్డ్ డబుల్స్ ఈవెంట్లోనూ ఆకట్టుకోలేకపోయింది. కానీ, గురువారం జరిగిన మహిళల 25 మీటర్ల ఎయిర్ పిస్టల్ విభాగం పోటీల్లో ఆమె గెలిచి నిలిచింది. 44 మంది మహిళా షూటర్లు పాల్గొన్న ఈవెంట్లో ఆమె 592 పాయింట్లు సాధించింది. పదికి పది పాయింట్లను 9 సార్లు సాధించింది. గురి చూసి ఇన్నర్ రింగ్‌లో కాల్చింది. అయితే, ప్రపంచ నంబర్ 2 ర్యాంకర్ అయిన రాహీ సార్నోబత్ మాత్రం నిరాశపరిచింది.
బాడ్మింటన్‌లో క్వార్టర్ ఫైనల్స్‌కు పీవీ సింధు..
ఒలింపిక్స్‌లో రాణిస్తున్న భారత క్రీడాకారులు టోక్యో ఒలింపిక్స్‌లో భారత క్రీడాకారులు రాణిస్తున్నారు. పతకాలు సాధించే దిశగా ప్రయాణిస్తున్నారు. మెన్స్ హాకీ జట్టు విజయం నమోదు చేసుకోగా.. మరోవైపు ఆర్చర్ అతాను దాస్ ప్రీక్వార్టర్స్ లోని ప్రవేశించాడు. బాడ్మింటన్ స్టార్, తెలుగు తేజం పీవీ సింధు క్వార్టర్ ఫైనల్స్ కి చేరింది. బాక్సర్ సతీశ్ కుమార్ బాక్సింగ్ లో రాణించాడు. ఒలింపిక్స్‌లో భారత హాకీ జట్టు మరో విజయాన్ని సొంతం చేసుకుంది.
పూల్ ఏలో అర్జెంటీనాతో తలపడ్డ మ్యాచులో భారత జట్టు 3-1 తేడాతో విజయాన్ని సాధించింది. మూడవ క్వార్టర్ చివరి వరకు ఇరు జట్లు ఒక్క గోల్ కూడా సాధించలేదు. అయితే మ్యాచ్‌లో 43వ నిమిషంలో భారత ఆటగాడు కుమార్ వరుణ్ తొలి గోల్ చేయగా.. అనంతరం అర్జెంటీనా కూడా గోల్ సాధించి స్కోర్ ఈక్వల్ చేసింది. అయితే 58వ నిమిషంలో ప్రసాద్ వివేక్‌సాగర్, 59వ నిమిషంలో హర్మన్‌ప్రీత్ సింగ్ గోల్ చేయడంతో 3-1 తేడాతో అర్జెంటీనాపై ఘన విజయం సాధించింది. మెన్స్ ఆర్చరీ సింగిల్స్‌లో అతానుదాస్ ప్రీక్వార్టర్స్‌కు దూసుకెళ్లాడు. ఎలిమినేషన్ రౌండ్లో వరల్డ్ మూడో ర్యాంకర్ కొరియాకు చెందిన జిన్ హెక్ హోతో తలపడిన దాస్.. విజయం సాధించి ప్రీక్వార్టర్స్‌లోకి దూసుకెళ్లాడు.