Take a fresh look at your lifestyle.

టోక్యో ఒలింపిక్‌ అప్‌డేట్స్

  • బ్యాడ్మింటన్‌ ‌మహిళల సింగిల్స్‌లో ప్రీ క్వార్టర్‌ ‌ఫైనల్‌కు పివి సింధు
  • ఆర్చరీ క్వార్టర్‌ ‌ఫైనల్లో దీపికా కుమారి
  • ఒలింపిక్స్ ‌నుంచి బ్యాడ్మింటన్‌ ‌ప్లేయర్‌ ‌సాయిప్రణీత్‌ ఔట్‌

టోక్యో ఒలంపిక్స్‌లో భారీ అంచనాలతో అడుగు పెట్టిన పీవీ సింధు మరో విజయాన్ని తన ఖాతాలో వేసుకుంది. బుధవారం జరిగిన గ్రూప్‌ ‌జే మ్యాచ్‌లో సింధు హాంకాంగ్‌ ‌ప్లేయర్‌ను ఓడించింది. హాంకాంగ్‌ ‌ప్లేయర్‌ ‌చియాంగ్‌పై సింధు వరుసగా రెండు సెట్లలో 21-9, 21-16తో గెలుపు అందుకుంది. దీంతో గ్రూప్‌ ‌జె నుంచి మొదటి ప్లేస్‌లో నిలిచి ప్రీ క్వార్ట్రర్స్‌లోకి అడుగు పెట్టింది. టోక్యో ఒలింపిక్స్‌లో 16 వ రౌండ్‌లో సింధు డెన్మార్క్‌కు చెందిన మియా బ్లిచ్‌ఫెల్డ్‌తో తలపడనుంది.

ఆర్చరీ క్వార్టర్‌ ‌ఫైనల్లో దీపికా కుమారి
ఇండియన్‌ ‌స్టార్‌ ఆర్చర్‌ ‌దీపికా కుమారి టోక్యో ఒలింపిక్స్ ‌క్వార్టర్‌ఫైనల్లో అడుగుపెట్టింది. బుధవారం జరిగిన రౌండ్‌ ఆఫ్‌ 16 ‌మ్యాచ్‌లో ఆమె అమెరికన్‌ ఆర్చర్‌ ‌జెన్నిఫర్‌ ‌ఫెర్నాండెజ్‌పై 6-4 తేడాతో గెలిచింది.

Tokyo Olympic Updates

ఐదు సెట్లపాటు హోరాహోరీగా సాగిన ఈ మ్యాచ్‌లో దీపికా.. 2, 3, 5 సెట్లలో విజయం సాధించింది. నాలుగు సెట్ల తర్వాత ఇద్దరు ఆర్చర్లు నాలుగేసి పాయింట్లతో సమంగా నిలవగా.. నిర్ణయాత్మక చివరి సెట్‌లో దీపికా 26 స్కోరుతో ఫెర్నాండెజ్‌(25)‌ను వెనక్కి నెట్టి క్వార్టర్‌ఫైనల్లో అడుగుపెట్టింది.

ఒలింపిక్స్ ‌నుంచి బ్యాడ్మింటన్‌ ‌ప్లేయర్‌ ‌సాయిప్రణీత్‌ ఔట్‌
ఇం‌డియన్‌ ‌బ్యాడ్మింటన్‌ ‌ప్లేయర్‌ ‌సాయి ప్రణీత్‌ ‌టోక్యో ఒలింపిక్స్ ‌నుంచి ఉత్త చేతులతోనే ఇంటిదారి పట్టాడు. బుధవారం జరిగిన సింగిల్స్ ‌మ్యాచ్‌లో అతడు 14-21, 14-21 తేడాతో నెదర్లాండ్స్‌కు చెందిన మార్క్ ‌కాల్జౌ చేతిలో ఓడిపోయాడు. ఒక దశలో రెండో గేమ్‌లో 7-1 లీడ్‌లోకి దూసుకెళ్లిన ప్రణీత్‌.. ‌తర్వాత వరుసగా పాయింట్లు కోల్పోయాడు. గ్రూప్‌ ‌డిలో భాగంగా జరిగిన తొలి మ్యాచ్‌లోనూ ఇజ్రాయెల్‌ ‌ప్లేయర్‌ ‌జింబర్‌మ్యాన్‌ ‌చేతిలో ఓడిన ప్రణీత్‌.. ‌తొలి రౌండ్‌లోనే ఇంటిదారి పట్టాడు.

Leave a Reply