Take a fresh look at your lifestyle.

టోక్యో ఒలింపిక్‌ అప్‌డేట్స్

‌రెజ్లింగ్‌లో రవి కుమార్‌ ‌దహియా మరియు దీపక్‌ ‌పునియాలకు పతకాలు ఖాయం
సెమి ఫైనల్స్‌కు రెజ్లర్లు
మహిళల హాకీ సెమీస్‌లో భారత్‌ ఓటమి..
ఇక కాంస్యం కోసం పోరు
టోక్యో, ఆగస్ట్ 4 : ‌మనం గమనిస్తున్నట్టు అయితే ప్రారంభం నుంచి టోక్యో ఒలింపిక్స్‌లో భారత రెజ్లర్లు ఆధిపత్యం చెలాయిస్తున్నారు. నేటి ఫ్రీస్టైల్‌ ‌రెజ్లింగ్‌ ‌పోటీలలో, భారత రెజ్లర్లు రవి కుమార్‌ ‌దహియా మరియు దీపక్‌ ‌పునియా సెమీ ఫైనల్‌కు చేరుకున్నారు. పురుషుల 57 కేజీల విభాగంలో క్వార్టర్‌ ‌ఫైనల్స్‌లో దహియా బల్గేరియన్‌ ‌రెజ్లర్‌ను ఓడించాడు. 86 కేజీల బరువు విభాగంలో దీపక్‌ ‌పూనియా క్వార్టర్‌ ‌ఫైనల్స్‌లో చైనా రెజ్లర్‌ను 6-1తో ఓడించాడు. రవి మరియు దీపక్‌ ఇద్దరూ సెమీ ఫైనల్‌కు చేరుకోవడం ద్వారా భారతదేశానికి పతక ఆశలను పెంచారు. ఇద్దరు రెజ్లర్‌ల సెమీ ఫైనల్‌ ‌మ్యాచ్‌ ‌నేడు జరగనుంది. ఇక మరో పక్క ఈ ఉదయం జరిగిన పురుషుల జావెలిన్‌ ‌త్రోలో, భారత ఆటగాడు నీరజ్‌ ‌చోప్రా కూడా బలమైన ప్రదర్శనతో ఫైనల్‌ ‌చేరుకున్నాడు. గ్రూప్‌ %•%‌లో ఉన్న నీరజ్‌ ‌మొదటి ప్రయత్నంలో 86.65 మీటర్ల జావెలిన్‌ ‌త్రోతో ఫైనల్‌ ‌గెలిచాడు. అయితే, జావెలిన్‌ ‌త్రో క్వాలిఫైయింగ్‌ ‌రౌండ్‌లో గ్రూప్‌ %‌దీ% లో ఉన్న భారతదేశం యొక్క శివపాల్‌ ‌సింగ్‌ ఆశించిన స్థాయిలో రాణించ లేదు.

మహిళల హాకీ సెమీస్‌లో భారత్‌ ఓటమి..ఇక కాంస్యం కోసం పోరు
మహిళల హాకీలో భారత్‌ ‌కు నిరాశ తప్పలేదు. రాణి రాంపాల్‌ ‌సారథ్యంలోని భారత్‌ ‌మహిళల హాకీ జట్టు సెమీ ఫైనల్స్‌లో అర్జెంటీనా చేతిలో ఓడిపోయింది. 2-1 గోల్స్ ‌తేడాతో భారత అమ్మాయిలు సెమీస్‌లో ఓడిపోయారు. ఇక, కాంస్యం కోసం భారత అమ్మాయిలు పోరాడనున్నారు.

Leave a Reply