నాగర్ కర్నూల్,జూన్17. ప్రజాతంత్రవిలేకరి: గ్రామాల అభివృధ్ధికోసం ప్రజాప్రతినిధులు, అధికారులు కలిసి పనిచేస్తేనే అభివృద్ధి సాధ్యం అవుతుందని కొల్లాపూర్ ఎంఎల్ఏ బీరం హర్షవర్ధన్ రెడ్డి అన్నారు.బుధవారం పానుగల్ మండల కేంద్రంలో ఎంపీపీ మామి ళ్లపల్లి శ్రీధర్ రెడ్డి అధ్యక్షతన నిర్వహించిన మండల సర్వసభ్య సమావేశంలో పాల్గొని మాట్లాడారు.ప్రభుత్వ ఫలాలు అర్హులైన వారందరికీ అందించాలన్నారు.వారం రోజు ల్లో రైతులకు రైతు బంధు డబ్బులు రైతుల ఖాతాలోకి జమ చేయనున్నట్లు సీఎం కేసీఆర్ హామీ ఇచ్చారని రైతులు ఎలాంటి ఆందోళన చెందవద్దన్నారు.నియంత్రిత సాగు,హరితహారం తదితర అంశాలపై అధికారులు, ప్రజాప్రతినిధులు ప్రత్యేక శ్రద్ధ కనబరచాలన్నారు.కరోన పట్ల ప్రజలు అప్ర మత్తంగా ఉండాలన్నారు. మార్కెట్ కమిటీ చైర్మన్ నరేందర్ రెడ్డి, జడ్పీ టిసి లక్ష్మీ, వైస్ ఎంపీపీ కవిత,విండో చైర్మన్ విష్ణువర్ధన్ రెడ్డి,తహశీల్దార్ శ్రీరాము లు, ఎంపిడిఓ సాయి బృంద,గ్రామాల ప్రజాప్రతి నిధులు,అధికారులు,పాల్గొన్నారు.