Take a fresh look at your lifestyle.

నాటి ఉద్యమ స్పూర్తితోనే  నేటి సమ్మె…

తెలంగాణ స్వరాష్ట్రం కోసం అలుపెరగని పోరాటం ఈ నేలపై కొనసాగింది. .1969,1996, 97,98 నుంచి 2009 ,2104 వరకు పోరాటాలు దశలవారీగా స్వరాష్ట్ర సాధన కోసం కొనసాగాయి. తెలంగాణ స్వరాష్ట్ర సాధన పక్రియను ఏర్పాటు చేయాలని నాటి పాలకులపై ఒత్తిడి తీసుకువచ్చేందుకు జరిగిన భావజాల వ్యాప్తి పోరాటం 2009 నాటికి బలంగా చేకూరింది. 2009 తెలంగాణ ఉద్యమంలో పల్లె నుంచి పట్నం దాకా ఉద్యమంలో పెద్ద ఎత్తున విద్యార్థులు యువకులు ఎవరికి వారు నాయకత్వం వహిస్తూ తెలంగాణ ఉద్యమాన్ని ముందుండి నడిపించిన చరిత్ర ఎప్పటికీ మరువలేనిది. తెలంగాణ స్వరాష్ట్రం ఏర్పడితే ఉద్యోగాలు, నీళ్లు ,నిధులు, వస్తాయని నినాదంతో పెద్ద ఎత్తున ప్రజలు, విద్యార్థులు ఉద్యమానికి ఊపిరి పోశారు.
తెలంగాణ ఉద్యమంలో క్రియాశీలకంగా పనిచేసిన విద్యార్థులే, స్వరాష్ట్రం ఏర్పడిన తర్వాత ఉద్యోగ అవకాశాల కోసం సన్నద్ధం అవుతున్న తరుణంలో ప్రభుత్వం జారీ చేసిన పంచాయతీ కార్యదర్శుల ఉద్యోగానికి ఉద్యమంలో పోరాటం చేసి,ఉద్యోగం కోసం పరితపించే పోరాటాల్లో భాగస్వామ్యం అయిన వారే  తెలంగాణ పంచాయతీ రాజ్‌ ‌చట్టం 2018 ప్రకారం వెలుబడిన నోటిఫికేషన్‌ ‌ద్వారా తెలంగాణ పంచాయతీరాజ్‌ ‌డిపార్ట్మెంట్లో జూనియర్‌ ‌పంచాయతీ కార్యదర్శులుగా 11 ఏప్రిల్‌ 2019 ‌నాడు సుమారు 8  లక్షల మంది పంచాయతీ కార్యదర్శులకు పోటీపడిగా 9350 మంది  పంచాయితీ కార్యదర్శులుగా రాత పరీక్ష ద్వారా నియమింపబడ్డారు.

స్వరాష్ట్రం ఏర్పడిన నాటి నుంచి రుణాత్మక మార్కులతో వెలుబడిన ఏకైక నోటిఫికేషన్‌ ‌జెపిఎస్‌ ‌రిక్రూట్మెంట్‌ 2018 ‌నోటిఫికేషన్‌ ‌మాత్రమేనని చెప్పుకోవచ్చు.      8 లక్షల మందితో పోటీపడి 9358 మంది కార్యదర్శులు రాత పరీక్ష ద్వారా నియమింపబడ్డారు. నోటిఫికేషన్‌ ‌లో 15 వేల రూపాయలు కన్సాలిడేంట్‌ ‌పే జీతంతో మూడు సంవత్సరాల ప్రోబేషనరీ పీరియడును పూర్తి చేసిన జూనియర్‌ ‌పంచాయతీ కార్యదర్శులను గ్రేడ్‌ 4 ‌పంచాయతీ కార్యదర్శులుగా పదోన్నతి కల్పిస్తూ రెగ్యులర్‌ ‌చేయడం జరుగుతుందని, పంచాయతీరాజ్‌ ‌చట్టం 2018 ప్రకారం వెలుబడిన నోటిఫికేషన్‌ ‌లో ప్రభుత్వం స్పష్టంగా తేల్చింది. ప్రభుత్వం చెప్పుకుంటున్న బంగారు తెలంగాణ నిర్మాణంలో  పల్లెలన్నీ శస్య శ్యామలంగా తీర్చిదిద్దాలని సంకల్పంతోనే పంచాయతీ  కార్యదర్శులుగా ఉద్యోగాన్ని నిర్వహిస్తున్నామని, ప్రతినిత్యం విధుల్లో ఉన్న పంచాయతీ కార్యదర్శులు గ్రామాల్లో బంగారు తెలంగాణ నిర్మాణంలో ప్రతి ఒక్కరు భాగస్వామ్యం కావాలని పరితపించి ప్రయత్నాన్ని ప్రభుత్వ ఆదేశానుసారం కొనసాగించామన్నారు.జేపీఎస్‌ ‌నోటిఫికేషన్‌ ‌తప్ప  తెలంగాణ రాష్ట్రంలో ఏ ప్రభుత్వ ఉద్యోగాన్ని కూడా మూడు సంవత్సరాల ప్రోబిషనరి పీరియడు లేదు .

పెరిగిన ధరల దృష్ట్యా  15వేల రూపాయలు జీతం సరిపోడం లేదని ఉద్యోగానికి రెండు సంవత్సరాల ప్రొబెషనరి  పీరియడ్ను డిక్లేర్‌ ‌చేయాలని ప్రతి ప్రజా ప్రతినిధులను కలిసి పంచాయతీ కార్యదర్శిలు విన్నవించుకోగా వారి ఆశలు అడియాశలుగానే మిగిలిపోయాయి.నాడు  స్వరాష్ట్ర వస్తే కొలువులు వస్తాయని కొట్లాడిన వారే  గ్రామపంచాయతీ కార్యదర్శులుగా ఉద్యోగం పొంది ఉద్యమస్ఫూర్తితో నేడు సమ్మెకు దిగి తమ హక్కులను ప్రభుత్వం కాల రాస్తుందని తమ హక్కులను కాపాడాలని నినదిస్తూ, గత కొద్ది రోజులుగా సమ్మెకు దిగడంతో గ్రామాలలోని పారిశుద్ధ్యం ఎక్కడి పనులు అక్కడే ఆగిపోయి అస్తవ్యస్తంగా మారిపోయింది.     అరకొర జీతానికి పనిచేస్తున్న గ్రామపంచాయతీ కార్యదర్శులు స్థానికంగా ఉన్న మండల, గ్రామ ప్రజాప్రతినిధులతో నిరంతరం వేధింపులకు భయభ్రాంతులకు గురైన తమ పనిని తాము నిర్వహించామని పంచాయతీ కార్యదర్శులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.  గ్రామపంచాయతీ లోని స్థానిక ప్రజా ప్రతినిధులు వేధిస్తున్న పరిణామాలను గ్రామపంచాయతీ కార్యదర్శులు తమ మనసులో పెట్టుకున్నారే తప్ప ఏనాడు కూడా రోడ్డు ఎక్కలేని పరిస్థితుల్లో ఉద్యోగ భద్రత కోసం ఒత్తిళ్ళను జయిస్తూ ఉద్యోగాన్ని నిర్వర్తిస్తూ పల్లెలను అభివృద్ధి వైపు తీసుకుపోయేలా పాటుపడేవారమని పంచాయతీ కార్యదర్శులు నేడు  సమ్మెలో నినదిస్తున్నారు.     రాష్ట్ర ముఖ్యమంత్రి కే. చంద్రశేఖర రావు అసెంబ్లీలో పిఆర్సి సవరణలో భాగంగా జూనియర్‌ ‌పంచాయతీ కార్యదర్శులకు కూడా వేతనం సవరించి ఇస్తామని ,ప్రొబేషనరీ పీరియడును అవసరమైతే ఇంకో సంవత్సరం పొడిగించుతామని స్వయంగా ప్రకటించారు.జీవో నెంబర్‌ 26‌ను విడుదల చేస్తూ జేపీఎస్‌ ‌ల  ప్రొబేషనరీ పీరియడ్‌ 4 ‌సంవత్సరాలుగా నిర్ధారిస్తూ కన్సలిడేటెంట్‌ 15 ‌నుంచి 28,719 రూపాయలకు పెంచినట్లు జి.వో నెంబర్‌  26 ‌లో ఉన్నట్లు గ్రామపంచాయతీ కార్యదర్శులు స్పష్టంగా ప్రభుత్వానికి సమ్మెలో తమ నినాదాన్ని వినిపిస్తున్నారు.

ప్రభుత్వ నిర్ణయానికి కట్టుబడి నాలుగు ఏండ్ల ప్రొబేషనరీ పిరియడ్ను విజయవంతంగా 11 ఏప్రిల్‌ 2023 ‌నాటికి పూర్తి చేసుకున్నారు. ప్రభుత్వం నుండి ఎటువంటి జీవో కాని హామీ కానీ విడుదల కాకపోవడంతో ప్రొఫెషనరీ పీరియడ్‌ ‌పూర్తి అగుటకు ఒక నెల ముందు నుండే రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న గ్రామ సర్పంచులకు, ఎంపీటీసీలకు ,ఎంపీపీ లకు, జడ్పిటిసి లకు ఎమ్మెల్యేలకు, ఎమ్మెల్సీలకు, ఎంపీలకు మంత్రులకు, అనేక వినతి పత్రాలను అందజేసి తమ గోడును  విన్నవించుకుని తమ యొక్క ఉద్యోగాన్ని క్రమబద్ధీకరించాలని మొరపెట్టుకున్నారు.11 ఏప్రిల్‌ 2023 ‌నాటికి ప్రభుత్వం నుంచి ఎలాంటి జీవో రానందున, 13 ఏప్రిల్‌ 2023 ‌నుంచి 15 రోజుల గడువు కాలంలో సమ్మె నోటీసును గ్రామపంచాయతీ కార్యదర్శులు అందజేశారు.15 రోజులు కూడా నల్ల బ్యాడ్జీలతో నిరసన తెలియజేస్తూ ఉద్యోగాలకు హాజరయ్యారు.    ప్రభుత్వం నుంచి ఎలాంటి స్పందన రాకపోవడంతో దిక్కులేని దీనస్థితిలో సమ్మె చేయాల్సిన అన్వర్య పరిస్థితులను ప్రభుత్వం కల్పించినందున గ్రామపంచాయతీ కార్యదర్శులు రాష్ట్ర వ్యాప్తంగా సమ్మెకు శాంతియుత మార్గంలో దిగారు    జూనియర్‌ ‌పంచాయతీ కార్యదర్శులను నాలుగు సంవత్సరాల ప్రోబెషనరీ కాలాన్ని సర్వీస్‌ ‌కాలంగా పరిగణిస్తూ గ్రేడ్‌ 4 ‌పంచాయతీ కార్యదర్శిగా రెగ్యులర్‌ ‌చేయాలి.ఆవుట్‌ ‌సోర్సింగ్‌ ‌పంచాయతీ కార్యదర్శులను జూనియర్‌ ‌పంచాయతీ కార్యదర్శులు ప్రమోట్‌ ‌చేస్తూ వారిని కూడా రెగ్యులర్‌ ‌చేయాల్సిన బాధ్యత రాష్ట్ర ప్రభుత్వానిదే.

గత నాలుగు సంవత్సరాలుగా కన్సాలిడేటెడ్‌  ‌ద్వారా నష్టపోయిన వేతనాన్ని తిరిగి గ్రామపంచాయతీ కార్యదర్శులకు అందజేయాలి.చనిపోయిన పంచాయితీ కార్యదర్శుల కుటుంబాలకు ఎక్స్గ్రేషియా ప్రకటిస్తూ వారి కుటుంబంలో ఒకరికి ప్రభుత్వ ఉద్యోగం కల్పించాలి. గ్రామాలను వదిలి మండల ,జిల్లా కేంద్రంలో గత కొన్ని రోజులుగా సమ్మె చేస్తున్న గ్రామపంచాయతీ కార్యదర్శులను ప్రభుత్వం చర్చలకు పిలిచి వారి సమస్యను పరిష్కరించే విధంగా ప్రత్యేకమైన చొరవ తీసుకోకుండా సమ్మెలు చేయడం సరైన పద్ధతి కాదని ఉకుం జారీ చేస్తూ ప్రభుత్వం పంచాయతీ కార్యదర్శులపై బెదిరింపులకు పాల్పడుతుంది.    రాష్ట్రంలో  ఉపాధ్యాయ, ఉద్యోగ, కార్మిక సంఘాలు చేస్తున్న  సమ్మెను ఒక ప్రజాస్వామ్యక రాజ్యాంగ ప్రాథమిక హక్కుగా భావించాలి కానీ  కెసిఆర్‌ ‌ప్రభుత్వం మాత్రం  ఆణిచివేత కు పాల్పడుతుంది.సమ్మెను ప్రభుత్వం బాధ్యతగా తీసుకొని సమస్యల పరిష్కారానికి పాల్పడకుండా బెదిరింపులకు పాల్పడుతుంది.ఉద్యోగంలో చేరకపోతే ఉన్న జాబును ఊడ  పీకుతామంటూ ఆదేశాలను జారీ చేస్తుంది.

ఆప్రజాస్వామిక విధానాన్ని  ప్రభుత్వం మానుకోవాలి.
దేశంలో ,రాష్ట్రంలో స్వేచ్ఛ, పౌర ప్రజాస్వామిక హక్కులను కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అమలు చేయడం లేదు. హక్కుల కోసం మాట్లాడితే అమలు చేయాల్సిన కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అక్రమ అరెస్టులు ,కేసులు పెట్టుతూ  బెదిరింపులకు పాల్పడుతూ ప్రజాస్వామ్య వాతావరణాన్ని లేకుండా ఇష్టానుసారంగా పరిపాలిస్తున్న పాలకులకు ప్రజలు ప్రజాస్వామ్యవాదులు బుద్ధి చెప్పక తప్పదు.పాలకులు  ఇచ్చిన హామీలను అమలు చేయాలని శాంతియుత మార్గంలో నినదిస్తున్న ప్రజలను ప్రజాస్వామ్యవాదులను కార్మికులను ఉద్యోగస్తులను అణిచివేత విధానాన్ని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు మానుకోవాలి.మ పంచాయతీ కార్యదర్శులు గ్రామ పంచాయతీ కార్మికులు ఐకెపి వివో ఏలు రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద ఎత్తున పోరాటం చేస్తున్నప్పటికీ కేంద్రంలోని బిజెపి సర్కార్‌ ‌రాష్ట్రంలోని బీఆర్‌ఎస్‌ ‌సర్కార్లు ఏ మాత్రం పట్టింపు లేకుండా వ్యవహరిస్తున్నాయి. మండుటెండలో శరీరాలు కాలుతున్న సమ్మెను కొనసాగిస్తూ తమ హక్కుల కోసం ఉద్యమిస్తామని తెలంగాణ రాష్ట్ర సాధనలో క్రియాశీలకంగా పని చేసినటువంటి వాళ్ళంగా మా రాష్ట్రంలో మా హక్కుల కోసం కొట్లాడుతామంటూ నినదిస్తూన్నారు.డాక్టర్‌ ‌బి.ఆర్‌ అం‌బేద్కర్‌ ‌స్ఫూర్తితో పాలన సాగిస్తున్నామని ఇటీవల విగ్రహ ఏర్పాటులో ఆర్భాటంగా ప్రచారం చేసుకున్న బిఆర్‌ఎస్‌ ‌ప్రభుత్వం అంబేద్కర్‌ ‌రాజ్యాంగ స్ఫూర్తితో కల్పించిన సమ్మె హక్కులపై రాష్ట్ర ప్రభుత్వం ఎందుకు అణిచివేత విధానాన్ని అమలు చేస్తుందో ఆత్మ పరిశీలన చేసుకోవాల్సిన అవసరం ఉంది. రాష్ట్రంలో అనేక గ్రామపంచాయతీలకు వివిధ పరిపాలన విభాగాల్లో జాతీయ అవార్డులు వచ్చాయంటే గ్రామ పంచాయతీ కార్మికులు గ్రామ పంచాయతీ కార్యదర్శులు కిందిస్థాయి ఉద్యోగుల పాత్ర ఉండడంతోనే అవార్డులు దక్కై అన్న విషయాన్ని రాష్ట్ర ప్రభుత్వం మర్చిపోవద్దు..ప్రభుత్వ విధానాన్ని మార్చుకొని సమ్మె చేస్తున్న గ్రామ పంచాయతీ కార్యదర్శులు, గ్రామపంచాయతీ కార్మికులు, ఐకెపి వివోఏ ల సమస్యలను పరిష్కరించి వారి ఉద్యోగానికి భద్రత కల్పించాల్సిన బాధ్యతను రాష్ట్ర ప్రభుత్వం తీసుకోవాలి. ప్రజలు ప్రజాస్వామిక వాదులు ప్రతి సమస్యను మనదిగా చూస్తూ  హక్కుల సాధన కోసం జరిగే పోరాటంలో ప్రతి ఒక్కరు భాగస్వామ్యం అయినప్పుడే మన హక్కులను మనం కాపాడుకున్న వాళ్ళంగా అవుతాము. ప్రతి సమస్యను మన సమస్యగా భావించి ఒకరికి ఒకరు తోడుగా ఉంటూ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అవలంబిస్తున్న ప్రజా కార్మిక, విద్యార్థి, నిరుద్యోగ వ్యతిరేక విధానాలపై పెద్ద ఎత్తున జరిగే పోరాటాలలో తమ వంతు భాగస్వామ్యం అందిస్తూ, స్వరాష్ట్ర సాధన కోసం తెలంగాణ ఉద్యమాన్ని భుజాన వేసుకొని నడిపించనవాళ్లమే నేడు  హక్కుల సాధన కోసం ప్రజాస్వామ్యాన్ని కాపాడుకునేందుకు ప్రతి ఒక్కరు గల్లీ నుంచి పట్నం,  ఢిల్లీకి పాకే విధంగా నినదించాల్సిన బాధ్యత మన అందరిపై ఉంది.

-వేముల గోపినాథ్‌ ( ఏం.‌పిల్‌ ‌విద్యార్థి )
తెలుగు యూనివర్సిటీ హైదరాబాద్‌..

Leave a Reply