Take a fresh look at your lifestyle.

నేటి కృష్ణా నది యాజమాన్య బోర్డు సమావేశం వాయిదా

నేడు జరుగాల్సిన కృష్ణా నదీ యాజమాన్య బోర్డు త్రిసభ్య కమిటీ సమావేశం వాయిదా పడింది. మళ్లీ సమావేశం నిర్వహించే తేదీని త్వరలో ప్రకటిస్తామని బోర్డు తెలిపింది. తెలంగాణ, ఆంధప్రదేశ్‌ ‌రాష్ట్రాల మధ్య జలవివాదం నేపథ్యంలో ఈ భేటీ కీలకంగా మారింది. ఇదిలా ఉంటే కృష్ణా నది జలాల్లో రెండు రాష్ట్రాల మధ్య నీటి వాటాలను పునః సమీక్షించాలని తెలంగాణ ప్రభుత్వం కృష్ణానదీ యాజమాన్య బోర్డు(కేఆర్‌ఎం‌బీ)కి ఇటీవల లేఖ రాసిన విషయం తెలిసిందే.

కృష్ణా నీటి వినియోగంపై ఏపీ లేవనెత్తిన అభ్యంతరాలపై చర్చించేందుకంటూ ఈ నెల 9న నిర్వహించ తలపెట్టిన త్రిసభ్య కమిటీ సమావేశాన్ని వాయిదా వేయాలని తెలంగాణ కోరింది. ఈ నెల 20 తర్వాత బోర్డు పూర్తిస్థాయి సమావేశం ఏర్పాటు చేయాలని రాష్ట్ర నీటిపారుదల శాఖ ప్రత్యేక ముఖ్యకార్యదర్శి రజత్‌కుమార్‌ ‌కేఆర్‌ఎం‌బీకి లేఖ రాశారు. ఏపీ లేవనెత్తిన అంశాలను మాత్రమే సమావేశాల ఎజెండాలో చేర్చారని, తెలంగాణ అభ్యంతరాలను విస్మరించారని ఈ సందర్భంగా ఆక్షేపించారు.

Leave a Reply