వ్యవస్థాపక సంపాదకులు

దేవులపల్లి అమర్

ఎడిటర్

దేవులపల్లి అజయ్

నేడు ‘సహకార’ పోరు

February 14, 2020

Today's cooperative fight PACS elections statewide Strict arrangements for pollingనేడు రాష్ట్రంలోని ప్రాథమిక వ్యవసాయ సహకార పరపతి సంఘాలకు (పీఏసిఎస్‌) ఎన్నికలు జరుగనున్నాయి. ఈ ఎన్నిలకు సహకార సంఘాల ఎన్నికల అధికారి, అడిషనల్‌ ‌రిజిస్ట్రార్‌ ‌పూర్తి స్థాయిలో ఏర్పాట్లు చేశారు. రాష్ట్రంలోని మొత్తం 12 లక్షల మంది రైతులు సంఘాలలో తమ ఓటు హక్కును వినియోగించుకోనున్నారు. ప్రతీ పీఏసీఎస్‌కు గజిటెడ్‌ ‌హోదా కలిగిన అధికారిని ఎన్నికల అధికారిగా ప్రభుత్వం నియమించింది. సూపరిం టెండెంట్‌, ‌సీనియర్‌ అసిస్టెంట్‌, ‌జూనియర్‌ అసిస్టెంట్‌, ‌రికార్డ్ అసిస్టెంట్‌ ‌హోదా కలిగిన అధి కారు లను పోలింగ్‌ అధి కారులుగా నియ మిం చారు. రైతులు రహాస్య బ్యాలెట్‌ ‌పద్దతిలో వోటు వేసే విధంగా ప్రతీ పీఏసీఎస్‌ ‌ప్రాంగణంలో ఏర్పాట్లు చేశారు. రాష్ట్రంలోని మొత్తం 909 సహకార సంఘాలకు ఎన్నికలు నిర్వహించాలని నోటిఫికేషన్‌ ‌విడుదల చేశారు.అయితే, శుక్రవారం వరకు 156 సంఘాలు ఏకగ్రీవం అయినట్లు తెలిసింది. ఎప్పటికప్పుడు ఏకగ్రీవాలపై ఆభ్యర్థులలో చర్చ జరుగుతున్నప్పటికీ రాష్ట్ర స్థాయిలో ఎన్నికలు పూర్తయిన తరువాత అన్ని వివరాలను ఎన్నికల సంఘం వివరించనున్నది. ఈ మేరకు ఎన్నికల అధికారి శుక్రవారం స్పష్టం చేశారు. కాగా, 647 ప్రాథమిక వ్యవసాయ సహకార పరపతి సంఘాలకు శనివారం ఎన్నికలు జరుగనున్నాయి. దాదాపు 13 వేల మంది అభ్యర్థులు పోటీలో ఉన్నారు.వీటిలో 6438 డైరెక్టర్‌ ‌పదవులకు రాష్ట్రవ్యాప్తంగా ఎన్నికలు జరుగుతున్నాయి. ఉదయం 7 గంటల నుంచి మద్యాహ్నం 1 గంట వరకు పోలింగ్‌ ‌పూర్తవుతుంది. భోజన విరామం అనంతరం పోలైన ఓట్లను లెక్కించి ఫలితాలను వెల్లడిస్తారు. ప్రతీ సంఘంలో శనివారం నాడే పూర్తి స్థాయి ఫలితాలు వెలవడనున్నాయి. డైరెక్టర్ల ఎన్నిక పూర్తి కాగానే, ఆయా సంఘాలకు చైర్మన్లను ఎన్నుకుంటారు. జిల్లాలలోని పీఎసీఎస్‌ల నుంచి ఎన్నికైన చైర్మన్లు జిల్లా డైరెక్టర్లను చైర్మన్లను ఎన్నుకుంటారు. జిల్లా ఎన్నికల కోసం త్వరలో రాష్ట్ర సహకార ఎన్నికల కమిషన్‌ ‌నోటిఫికేషన్‌ ‌విడుదల చేయనుంది.

కాగా, ఈ ఎన్నికలు పార్టీ గుర్తుపై , టికెట్‌పై జరగనప్పటికీ గ్రామాలలో రాజకీయ పార్టీల మధ్య పోటీ నువ్వా నేనా అనే విధంగా సాగింది. టీఆర్‌ఎస్‌, ‌కాంగ్రెస్‌, ‌బీజేపీ, టీజేఎస్‌, ‌వామపక్షాలు తమ పార్టీ శ్రేణుల గెలుపు కోసం ప్రయత్నాలు చేశాయి. పార్టీల పేరుతోనే చర్చలు జరగడం గమనార్హం. రాజకీయాలు అన్ని స్థాయిల్లో వ్యాపించాయని చెప్పడానికి రాష్ట్ర స్థాయిలో సహకార సంఘాల ఎన్నికలే ఉదాహరణ. స్థానిక సంస్థల ఎన్నికలలో విజయ దుండుభి మోగించిన తరహాలోనే టీఆర్‌ఎస్‌ ‌మెజార్టీ సహకార సంఘాలను కైవసం చేసుకుంటున్నట్లు చర్చ జరుగుతోంది. ఇదివరలో 2013లో ఈ ఎన్నికలు జరిగాయి. 2018లో ఈ ఎన్నికలు నిర్వహించాలని ప్రయత్నించినప్పటికీ సాంకేతిక కారణాలతో జరపలేక పోయారు. 2013లో గెలిచిన మెజార్టీ డైరెక్టర్లు కాంగ్రెస్‌ ‌పార్టీకి చెందిన వారే. దీంతో కొంత పార్టీ అభిమానంతో కాంగ్రెస్‌ ‌పునాది ఉన్న గ్రామాలలో టీఆర్‌ఎస్‌ ‌కాంగ్రెస్‌ ‌మధ్య పోటీ తీవ్ర స్థాయిలో జరిగింది. అన్ని ఎన్నికల్లో గెలవడానికి ఉపయోగించిన సాధనాలనే ఈ ఎన్నికల్లో కూడా టీఆర్‌ఎస్‌ ఉపయోగించిందని రాజకీయ వర్గాలలో చర్చ జరుగుతోంది.

కొల్లాపూర్‌ ‌టీఆర్‌ఎస్‌లో కొనసాగుతున్న వర్గపోరు: 
నాగర్‌కర్నూలు జిల్లా కొల్లాపూర్‌ ‌నియోజకవర్గం టీఆర్‌ఎస్‌లో తలెత్తిన వర్గపోరు కొనసాగుతోంది. ఇక్కడ మాజీ మంత్రి జూపల్లి కృష్ణారావు, ఎమ్మెల్యే హర్షవర్ధన్‌రెడ్డి మధ్య మున్సిపల్‌ ఎన్నికల సందర్భంగా మొదలైన విభేదాలు తారాస్థాయికి చేరుకున్నాయి. గత అసెంబ్లీ ఎన్నికలలో కొల్లాపూర్‌ అసెంబ్లీ నియోజకవర్గం నుంచి టీఆర్‌ఎస్‌ అభ్యర్థిగా బరిలో నిలచిన మాజీ మంత్రి జూపల్లి కృష్ణారావుపై కాంగ్రెస్‌ ‌పార్టీ అభ్యర్థిగా బరిలో నిలచిన హర్షవర్ధన్‌ ‌రెడ్డి విజయం సాధించారు. ఆయితే, అనంతరం జరిగిన పరిణామాలతో హర్షవర్ధన్‌ ‌రెడ్డి కాంగ్రెస్‌ ‌పార్టీని వీడి అధికార టీఆర్‌ఎస్‌లో చేరారు. అప్పటి నుంచి ఇరు వర్గాల మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమనే పరిస్థితి నెలకొంది. గత నెలలో జరిగిన మున్సిపల్‌ ఎన్నికల సందర్భంగా కొల్లాపూర్‌ ‌మున్సిపాలిటీ టీఆర్‌ఎస్‌ అభ్యర్థులుగా హర్షవర్ధన్‌రెడ్డి పూర్తిగా తన అనుచరులకే టికెట్లు ఇచ్చారు. దీంతో జూపల్లి టీఆర్‌ఎస్‌ అభ్యర్థులకు దీటుగా తిరుగుబాటు అభ్యర్థులను నిలబెట్టారు. దీంతో ఆయన నిలబెట్టిన అభ్యర్థులే అధిక శాతం విజయం సాధించారు. ప్రస్తుతం జరుగుతున్న సహకార సంఘాల ఎన్నికలలోనూ జూపల్లి తన వర్గానికి చెందిన నేతలను బరిలో దింపారు.