హోమియోపతి ప్రపంచవ్యాప్తంగా ప్రాచుర్యంలో ఉన్న ఒక వైద్య పద్ధతి. డాక్టర్ క్రిస్టియన్ ఫ్రెడరిక్ శామ్యూల్ హనీమాన్ జర్మనీ వైద్యుడు, హోమియోపతి వ్యవస్థాపకుడు. అతను గొప్ప పరిశోధకుడు, భాషావేత్త మరియు శాస్త్రవేత్త. ఈ రోజున జన్మించిన డాక్టర్ హనీమాన్ జ్ఞాపకార్థం ప్రతి సంవత్సరం ఏప్రిల్ 10న ‘ప్రపంచ హోమియోపతి దినోత్సవం’’ జరుపుకుంటారు. హోమియోపతికి విశేష ప్రచారము కల్పించడం, ప్రజలలో అవగాహన పెంపొందించడం, హోమియోపతికి సంబంధించి ఎవరి దగ్గర ఎటువంటి కొత్త ఆలోచన ఉన్నా స్వీకరించడం, పరిశోధన జరపడం వంటివి హోమియోపతి దినోత్సవం యొక్క ముఖ్య ఉద్దేశాలు.
ముఖ్యంగా భారత దేశంలో దీనికి లభిస్తున్న ప్రజాదరణ, ఆ కారణంగా అది పొందే ప్రభుత్వాదరణ, ప్రపంచంలో మరెక్కడా పొందడం లేదంటే అతిశయోక్తి కాదు. ఈ పద్ధతి దాదాపు రెండు వందల సంవత్సరాలకు పూర్వం నుండే వాడుకలో ఉన్నప్పటికీ, దీనికి శాస్త్రీయమైన పునాదులు, ఆధారాలు లేవనే చెప్పవచ్చు.
వైద్య విధానాలలో అల్లోపతి(ఇంగ్లీషు వైద్యం) అనే ఆధునిక వైద్యం మొదటి స్థానం ఆక్రమించింది. దాని తర్వాత హోమియోపతి వైద్యం 2వ స్థానంలో ఉంది. డబ్ల్యుహెచ్ఓ హోమియోపతి వైద్యాన్ని రెండవ అతి పెద్ద వైద్య విధానంగా గుర్తించింది. ప్రపంచం మొతంలో ఇది ఎక్కువగా భారతదేశంలోనే ఆదరించబడుతున్నది. అయితే ప్రపంచ వ్యాప్తంగా అనేక దేశాల్లో హోమియో వైద్యం ప్రాచుర్యంలో వుంది.
మన దేశ జనాభాలో 38 శాతం ప్రజలు ఈ వైద్యం పొందుతున్నారు. హోమియో మందులు ఖరీదు తక్కువ. వైద్యుల ఫీజులూ తక్కువ కాబట్టి ఆర్ధికంగా తక్కువ స్థాయిలో ఉన్న వారికి అందుబాటులో ఉంటుంది. హోమియో మందులలో సైడు ఎఫెక్టస్ ఉండవు లేదా తక్కువగా ఉంటాయి. ఈ మందులు ఎక్కువగా ఉచితంగా ఇవ్వడమే జరుగుతుంది. ఆ విధంగా పేద ప్రజల వైద్యంగా ముందుకు దూసుకు పోయింది. వైద్య కళాశాలలు, ఫార్మసీలు, రీసెర్చ్ సెంటర్లు, హాస్పిటల్స్ భారత్‌లో ఎక్కువగా ఉన్నాయి. మన దేశ జనాభా ఎక్కువ, అందులో పేదలు ఎక్కువ. అందువల్ల ఈ విధానం మనకెంతో అనుకూలం. మనదేశానికి సంబంధించిన మెదడు వాపు వ్యాధి(జపనీస్ ఎన్కెఫలైటిన్)ని నిర్మూరించడంలో హోమియోపతి వైద్యం విశిష్టమైన పాత్ర వహించింది. స్వైన్‌ప్లూ వంటి వ్యాధులను నిరోధించడం కోసం హోమియో మందులు వాడారు. దీర్ఘకాలిక వ్యాధులైన డయాబెటిస్, ఒబెసిటి, స్పాండిలైటిస్, థైరాయిడ్ వ్యాధుల నివారణలోనూ హోమియో మందులు వాడుతున్నారు. అన్నిరకాల అక్యూట్ వ్యాధులు, దీర్ఘకాల వ్యాధులైన అలర్జీ, ఆస్తమా, మైగ్రెయిన్, హైపర్ టెన్షన్, రుమటాయిడ్ అర్థరైటిస్ వంటి వ్యాధులను పూర్తిగా నయం చేస్తుంది. ఇవే కాక ఆపరేషన్ అవసరమయ్యే పై•ల్స్, ఫిషర్ట్ ఫిస్టులా, కిడ్నిలో రాళ్లు, ట్యూమర్లు, నాసల్ పాలిప్స్, టాన్సిల్స్ వంటి వ్యాధులు హౌమియో వైద్యంలో నయమవుతున్నాయి. హోమియో వైద్య విధానంతో ఔషధాలు ‘పోటెన్సీ’ల రూపంలో అతి తక్కువ పరిమాణంలో ఇవ్వబడుతుంది. ఔషధ దుష్ఫలితాలు తగ్గించబడతాయి. రోగి యొక్క మానసిసక, శారీరక లక్షణాల ఆధారంగా చికిత్స చేయబడుతుంది. అన్ని వయసుల వారు ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఈ మందులను వాడుకోవచ్చు. హోమియోపతికి సంబంధించినంతవరకు ప్రజామోదము లభించింది. కానీ నవీన వైద్యవిధానము(అల్లోపతి) వారు మాత్రము దీనిపైన తమ అభ్యంతరాలులు చెపుతునే ఉన్నారు. త్వరిత గతిన వ్యాధులను నివారించాలంటే ఇంగ్లీష్ వైద్యమే మేలని వారు చెబుతారు.
ఏద్కెనా ఒక జబ్బు ఎంతో మందికి సోకవచ్చు. కానీ, ఆ వ్యాధి ప్రభావం అందరిలోనూ ఒకేలా ఉండదు. అందుకే ఒక్కొక్కరిలో ఒక్కోరకం లక్షణాలు కనిపిస్తాయి. దానికి వ్యక్తికీ, వ్యకికీ మధ్య ఉన్న శరీర తత్వాల్లోని వ్యత్యాసాలే కారణం. హోమియో విధానంలో ఆ వ్యత్యాసాలను కూడా గుర్తించి చికిత్స చేస్తారు. అందుకే ఎంతో దీర్ఘకాలికంగా ఉన్న వ్యాధులు సైతం హోమియోలో సులువుగా తగ్గిపోతున్నాయి. హోమియో విధానం వ్యాధి నిరోధక శక్తిని పెంచడం మీదే ఎక్కువగా దృష్టి సారిస్తుంది. శరీరంలోని ఏ భాగం బలహీనపడితే ఆ భాగం రోగగ్రస్తమవుతుందని కూడా హోమియోపతి సూత్రీకరణ. వ్యాధి నిరోధక శక్తి బలంగా ఉన్నప్పుడు శరీరంలోకి ప్రవేశించిన వైరస్, బ్యాక్టీరియాలు చనిపోతాయి. ఆ శక్తే బలహీనపడితే వైరస్ తీవ్రమై శరీరం రోగగ్రస్తమవుతుంది. ఆ భాధను శరీరం కొన్ని లక్షణాల ద్వారా వ్యక్తం చేస్తుంది. ఆ లక్షణాల ఆధారంగా వ్యాధి తీవ్రతను దాని మూలాలను గుర్తించి హోమియో చికిత్సలు పనిచేస్తాయి. ప్రస్తుత కాలంలో వైరస్‌లో జన్యు రూపాలను మార్చుకొని మానవాళిని వివిధ రకాల కొత్త కొత్త వ్యాధులతో కబళించి వేస్తున్నాయి. వాటిని నివారించుటకు హోమియోపతి వైద్యులు కూడా కృషి చేస్తున్నారు.
(ఈ వ్యాసం అవగాహన కొరకు మాత్రమే ఉద్దేశించినది)