Take a fresh look at your lifestyle.

హృదయం – పదిలం నేడు ప్రపంచ హృదయ దినోత్సవం

“ఏ ‌వయసు వారైనా వాకింగ్‌, ‌యోగ, ప్రాణాయామము,ధ్యానము, వ్యాయామం చేయడం, మానసిక ఉల్లాసం కలిగించే సంగీతము, కళలు, పుస్తకాలు చదవడం వంటివి అలవర్చుకోవాలి. ఇవన్నీ సమస్యలో సమగ్ర భాగం. మన ఆరోగ్యానికి మంచి ఆహారమేమిటో మనందరికీ తెలుసు. సరదా, కాలక్షేపాలకోసం మనతొపాటు పిల్లలకు సైతం జంక్‌ఫుడ్‌ ‌తినిపిస్తున్నాం. కూల్‌‌డ్రింక్‌లతో జరిగే నష్టం తెలిసీ ప్రసార మాధ్యమాలమోజులో తాగిస్తున్నాం. బాల్యంలోనే వికృత రుచులకు అల్వాటు అనేకంటే బానిసలై ప్రకృతి రుచులను మరచిపోతున్నారు. వయసుతోపాటే రోగాల తాకిడీ పెరుగుతున్నది. మాంసాహారాన్ని త్యజిస్తే గొప్ప వ్యత్యాసం తెలుస్తుంది. మాంసాహారులకంటే శాఖాహారులు తక్కువ బరువుతో ఉంటారు. శాఖాహారుల్లొ గుండెవ్యాధుల ప్రమాదం 40% తక్కువగానుండటంవల్ల మరో ఏడేళ్ళపాటు ఆదనంగానూ, ఆరోగ్యంగానూ జీవిస్తారు.వ్యాయామ అవసరమెంతో తెలుసు. వ్యక్తులతోపాటు వ్యవస్థాపరమైన మార్పులు అవసరం.”

ప్రపంచ హృదయ దినోత్సవం ప్రతి నెల సెప్టెంబర్‌ 29‌వ తేదీన నిర్వహిస్తారు. హృదయ దినోత్సవం ను ప్రపంచ ఆరోగ్య సంస్థ మరియు వరల్డ్ ‌హార్ట్ ‌ఫౌండేషన్‌ ‌సంయుక్తంగా నిర్వహిస్తాయి. గుండెపోటు, గుండెజబ్బులను నివారించడానికి 1946లో జెనీవాలో వరల్డ్ ‌హార్ట్ ‌ఫౌండేషన్‌ ‌సంస్థ ఏర్పాటయ్యింది. 2000 సంవత్సరం నుండి ప్రపంచ వ్యాప్తంగా సెప్టెంబర్‌ ‌నెల ఆఖరి ఆదివారం నిర్వహించబడిన ప్రపంచ హృదయ దినోత్సవం 2011 సంవత్సరం నుండి సెప్టెంబర్‌ 29‌వ తేదీననిర్వహించబడుతుంది. గుండెజబ్బు అనేది నేడు సమాజం ఎదుర్కొంటున్న అతి పెద్ద అనారోగ్య సమస్య. గతంలో కేవలం వృద్ధులకు మాత్రమే వచ్చే గుండెజబ్బులు నేడు యుక్తవయస్కుల్లో కూడా రావడం ఆందోళనకర పరిణామం. అత్యంత ఆధునిక వైద్య సదుపాయాలు ఉన్నప్పట్టికీ ఎక్కువమంది మరణిస్తున్నది గుండె జబ్బుతోనే. ప్రపంచ వ్యాప్తంగా సగటున సంవత్సరానికి ఒక కోటీ డెబ్భైఐదులక్షల మంది అంటే 31% మరణాలు సంభవిస్తున్నది గుండె జబ్బులతోనే. ఈసంఖ్యను 2025 వరకు 25% తగ్గించడం లక్ష్యంగా ప్రపంచ హృదయ సంస్థ కృషిచేస్తున్నది. దీన్నే 25/25 అంటున్నారు.

సంపూర్ణ అవగాహనే ఆయుధము
అవగాహనను ఆయుధంగా చేసుకుని గుండె జబ్బు నుంచి నివారించుకోవడమే ప్రస్తుతం మన ముందున్న తక్షణ కర్తవ్యం.గుండెవ్యాధికి అనారోగ్య సమస్యలు, వైద్యపరమైన కారణాల కన్నా సామాజిక, మానసిక సమస్యలు ప్రధాన కారణం. ఒత్తిడి, ఒడిదొడుకులకు లోనవడం, మానసిక పరంగా డిప్రెషన్‌ ‌కు లోను కావడం, చిన్న సమస్యలను పెద్దగా తీసుకోవడం, ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్, ‌శాఖాహారం తగ్గించి మాంసాహారం అధికంగా తినడం, ఉప్పు, కారం, మసాలాలు,నూనెలు దట్టించి తినడం, బాల్యం నుండే జంక్‌ ‌ఫుడ్‌ ‌కు అలవాటు పడటం వంటి కారణాల వల్ల నేడు గుండె జబ్బులు అధికంగా రావడానికి కారణం అవుతున్నాయి.

విద్యార్థి దశ నుండే అవగాహన అవసరం
తలిదండ్రులు పిల్లల ఆటలు, వినోదానికీ సరిగా సమయం కేటాయించలేక టాబులు, మొబైళ్ళు, కంప్యూటర్‌ ‌వంటి డిజిటల్‌ ఉపకరణాలతో కాలక్షేపం చేయిస్తున్నారు. ఇక స్కూళ్లలో ఆటస్థలాలే లేకుండా, ఆటల్లేకుండా బాల్యంనుండి యవ్వనంలోకి అడుగిడుతూ యుక్తవయసుకొచ్చేసరికి శరీరం, కండరాలకు తగినంత శక్తి లేకపోవడంతో 20-25 ఏళ్లకే మధుమేహం, హైబీపీల బారిన పడుతున్నారు. వ్యాహ్యాళికీ, వాకింగ్‌కీ వసతుల్లేని పార్కులూ, ఆటస్థలం లేని స్కూళ్లు. ఆడించని పాఠశాలలు ఇవన్నీ అనారోగ్యానికి హేతువులు.

‘నేటి బాలలు రేపటి భావి భారత పౌరులకు’ బదులుగా ‘నేటి బాలలే రేపటి రోగులుగా’ తయారవుతున్నారు.
దానికి తల్లిదండ్రులు, విద్యార్థులు, ఉపాధ్యాయులు ఆలోచించాల్సిన అవసరం ఉంది.బాల్యం నుండే విద్యార్థులకు ఆహారము, వ్యాయామము,విలువలతో కూడిన విద్య, ఒత్తిడిలేని విద్యపై అవగాహనను ఏర్పరచాలి. ఏ వయసు వారైనా వాకింగ్‌, ‌యోగ, ప్రాణాయామము,ధ్యానము, వ్యాయామం చేయడం, మానసిక ఉల్లాసం కలిగించే సంగీతము, కళలు, పుస్తకాలు చదవడం వంటివి అలవర్చుకోవాలి. ఇవన్నీ సమస్యలో సమగ్ర భాగం. మన ఆరోగ్యానికి మంచి ఆహారమేమిటో మనందరికీ తెలుసు. సరదా, కాలక్షేపాలకోసం మనతొపాటు పిల్లలకు సైతం జంక్‌ఫుడ్‌ ‌తినిపిస్తున్నాం. కూల్‌‌డ్రింక్‌లతో జరిగే నష్టం తెలిసీ ప్రసార మాధ్యమాలమోజులో తాగిస్తున్నాం. బాల్యంలోనే వికృత రుచులకు అల్వాటు అనేకంటే బానిసలై ప్రకృతి రుచులను మరచిపోతున్నారు. వయసుతోపాటే రోగాల తాకిడీ పెరుగుతున్నది. మాంసాహారాన్ని త్యజిస్తే గొప్ప వ్యత్యాసం తెలుస్తుంది. మాంసాహారులకంటే శాఖాహారులు తక్కువ బరువుతో ఉంటారు. శాఖాహారుల్లొ గుండెవ్యాధుల ప్రమాదం 40% తక్కువగానుండటంవల్ల మరో ఏడేళ్ళపాటు ఆదనంగానూ, ఆరోగ్యంగానూ జీవిస్తారు.వ్యాయామ అవసరమెంతో తెలుసు. వ్యక్తులతోపాటు వ్యవస్థాపరమైన మార్పులు అవసరం.

యోగ, శారీరక వ్యాయామాలకు ప్రాధాన్యత
ఈమధ్య కాలాల్లో ‘యోగా’ను పెద్దఎత్తున ప్రోత్సాహించారు. ప్రభుత్వాలనుండి, సమాజంనుండీ విధానపరమైన ప్రోత్సాహం ఉంటున్నంది.ఉదయాన్నే లేచి సూర్యకిరణాలు చూస్తూ కొంత వ్యాయామం చెయడం శరీరానికి, మనసుకి కనీసావసరం. యోగ-ధ్యానము ప్రాణాయామము వంటివాటిని మత విశ్వాసానికి సంబంధించిందని కొందరు భావించడం వారి సంకుచిత మనస్తత్వం తెలియజేస్తుంది. నిజానికి యోగా కాణీ ఖర్చులేని సంపూర్ణ ఆరోగ్య జీవన విధానం. వయసుతో నిమిత్తంలేకుందా శరీరం కండరాలు అనుమతించినంతరకు ఆసనాలు వేయవచ్చు.ఇక ధ్యానం శ్వాసపై ధ్యాసను నిలిపే ప్రక్రియ. నమ్మకాలనుబట్టి ఆయా దేవుళ్ళను స్మరించుకోవచ్చు,. రాందేవ్‌బాబా తనొక మతవిశ్వ్వాసాన్ని ఆచరించినప్పటికీ నమ్మకంలేనివారు మనసును శూన్యంలో లగ్నంచేయవచ్చునని పలుసార్లు చెప్పారు. యోగా ధ్యానాలతో కండలు పెరగకపోయినా శారీరక ధృడత్వం, మానసిక స్థిరత్వం పెరుగుతాయి. ప్రపంచ యోగా దినోత్సవవం జూన్‌ 21 ‌తేదీన నిర్వహించుకోవడం యోగా ప్రాముఖ్యతను తెలియజేస్తుంది. ప్రపంచ యోగా దినోత్సవం జరుపుకోవడానికి అన్ని దేశాలనుండి పెద్ద మద్దతు వచ్చింది.

ధూమపానం, మద్యపానాలు త్యజించాలి
ధూమ పానం, మధ్యపానాలు వల్ల కూడా చాలా మంది గుండె జబ్బుల బారిన పడుతున్నారు వీటితో సంక్రమించే కేన్సర్‌, ‌మధుమేహం, పక్షవాతం గుండెజబ్బుకు ఆదనపు మద్దతునిస్తాయి. ఈఅలవాట్లను విసర్జించడానికి కావలసింది మానసిక స్థైర్యం. సాంప్రదాయిక అలవాట్లు, ఆహారవిధానాలకు దూరమై తిరోగమన పద్ధతులకు చేరువయ్యాం.

ఆరోగ్యకరమైన జీవనశైలి అవసరం
కావున ఆరోగ్యకరమైన జీవనశైలిని అలవరచుకుని మానసికంగా శారీరకంగా సామాజికంగా దూరంగా ఉండి సరైన ఆహార నియమాలు పాటిస్తూ యోగా ప్రాణాయామము వ్యాయామాలు చేస్తూ సంపూర్ణ ఆరోగ్యవంతమైన జీవన విధానంతో గుండెజబ్బులను దరిచేరనీయకుండా చూసుకోవచ్చు. ప్రతి ఒక్క పౌరుడు తగు జాగ్రత్తలు పాటిస్తూ హృదయం పదిల పరుచుకొని గుండెపోటు ముప్పు నుంచి తమను తాము రక్షించుకుంటారని ఆశిద్దాం.

– పిన్నింటి బాలాజీ రావు
హనుమకొండ, 9866776286

Leave a Reply