Take a fresh look at your lifestyle.

నేడు ప్రపంచ ఆరోగ్య దినోత్సవం ఆధునిక జీవనశైలితో ఆరోగ్యం కుదేలు

Dr Atla Srinivas Reddy
డా।। అట్ల శ్రీనివాస్‌రెడ్డి
కౌన్సెలింగ్‌ ‌సైకాలజిస్ట్ ‌ఫ్యామిలీ కౌన్సెలర్‌,
‌చేతన సైకాలజికల్‌ ‌ఫ్యామిలీ కౌన్సెలింగ్‌ ‌సెంటర్‌
9703935321

ప్రపంచ ఆరోగ్య సంస్థ ప్రపంచ ఆరోగ్య దినోత్సవంను పురష్కరించుకొని 7 ఏప్రియల్‌ 2020‌న ప్రతి ఒక్కరు, ప్రతి చోటా ఆరోగ్య దినోత్సవంలో పాల్గొనాలన్న (వరల్డ్ ‌హెల్త్ ‌డే సందర్భంగా వరల్డ్ ‌హెల్త్ ఆర్గనైజేషన్‌ ‌థీమ్‌ 2020 ‌సపోర్ట్ ‌నర్సెస్‌ ‌మరియు మిడ్‌ ‌వైవ్స్) ‌లక్ష్యంతో ప్రపంచ వ్యాప్తంగా చైతన్య కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. ప్రపంచ ఆరోగ్య సంస్థ 7 ఏప్రియల్‌ 1948 ‌నుండి అందరికి ఆరోగ్యం(స్లోగన్‌) ‌నినాదంతో ధనిక పేద అనే వ్యత్యాసంతో పని లేకుండా ప్రపంచంలో ప్రతి ఒక్కరు ఆరోగ్యంగా ఉండడానికి ఎన్నో రకాల కార్యక్రమాలు నిర్వహిస్తోంది. ఆరోగ్యవంతమైన జీవన అలవాట్లను పెంపొందించుకోవడం వల్ల మనిషి ఆయుష్షు పరిమితి పెరుగుతుంది. ఆరోగ్యం అనేది మానవ హక్కు. మనిషి మానసిక ఆరోగ్యం పెంపొందించుకుంటేనే శారీరకంగా ఉత్సాహంగా ఉండగలుగుతారు.

మనిషి ఆధునిక సాంకేతిక పరిజ్ణానంతో కాలంతో పాటుగా పరుగులు తీస్తూ మనిషి కూడా ఒక యంత్రం వలే మారిపోయాడు. మనిషి ఆరోగ్యాన్ని ఫణంగా పెట్టి డబ్బు సంపాద•న వేటలో పడి, కంపెనీల సంస్థల టార్గెట్ల సాధనలో పరుగులు తీస్తూ ఉన్నాడు. మానసిక ఆరోగ్యానికి తన జీవిత గమనంలో సమయం కెటాయించక శారీరక దృఢత్వాన్ని కోల్పోతున్నాడు. విలాసవంతమైన జీవన విధానంలో విహారిస్తూ కొద్దిపాటి చిన్న చిన్న ఆరోగ్య సమస్యలకు పరిష్కరించలేని స్తాయికి పడిపోతున్నాడు. సమాజంలో ఎక్కువ మంది యువత నిరాశ, నిస్పృహలతో మానసిక ఆందోళనకు గురై అనారోగ్యం పాలవుతున్నారు. ఆరోగ్యమే మహాభాగ్యం అంటారు పెద్దలు. ఎంత సంపాదించిన ఆరోగ్యంగా లేకపోతే సంపాదనంతా వృధాయే. ఇతరులను నవ్వుతూ పలకరించు, ఇతరులతో ప్రేమగా మాట్లాడు, అందరికి ఆత్మీయతను పంచు ఇదే ఆరోగ్యానికి సూత్రం. మనం ఉన్న ఆధునిక సాంకేతికత రంగంలో దూసుకెల్తున్న ప్రస్తుత పరిస్తితులలో అన్ని పనులను సులభంగా చేసుకుంటూ, జీవన శైలి సుఖమయంగా మారింది. టి.వి రిమోట్‌ ‌నుండి మొబైల్‌ ‌ఫోన్‌ ‌వరకు అన్ని పనులు చేతులపై జరగటం వలన శారీరక పనులకు దూరమయినామేమో అని అన్పిస్తుంది. ఫలితంగా లైఫ్‌ ‌స్టైల్‌ ‌వ్యాధులకు కూడా అంతే వేగంగా గురవుతున్నాము. శారీరక పనులు చేయకపోవటం, ఒత్తిడి, అనారోగ్యకర ఆహార అలవాట్లు, నిద్రలేమి, స్మోకింగ్‌, ఆల్కహాల్‌ ‌తాగటం మరియు కాలుష్యం వంటి వాటి వలన లైఫ్‌ ‌స్టైల్‌ ‌వ్యాధులు కలిగే అవకాశం ఉంటుంది.

జీవనశైలిలో గణనీయమైన మార్పులు:
ఆధునిక టెక్నాలజీ మూలంగా ఎలక్ట్రానిక్‌ ‌పరికరాలు మన అవసరాలను తీర్చటమే కాకుండా, మన చుట్టూ ఉండే వాతావరణంలో ప్రవేశించి మన జీవన శైలిలో గణనీయమైన మార్పులకు శ్రీకారం చుట్టింది. ఇవి మనం జీవనశైలిని సులభ తరంగా మార్చినప్పటికీ, శారీరకంగా అసమర్థులుగా తయారు చేసిందనడంలో సందేహం లేదు. తద్వారా జీవన శైలి వ్యాధుల భారిన పడుతున్నాం.ఫిజికల్‌ ఎక్సర్‌ ‌సైజులు లేకపోవటం వలన ఊబకాయం, గుండె సంబంధిత వ్యాధులు, మధుమేహం మొదలైన వ్యాధుల భారిన పడుతున్నాము. శారీరక శ్రమ తక్కువగా చేయటం వలన మెదడు కణాల పని తక్కువ అవటం వలన ఒత్తిడి మరియు ఉద్రేకతలకు లోనయ్యే అవకాశం కూడా ఉంది. వ్యాధులు కలగటానికి గల మరొక కారణం- అనారోగ్యకర ఆహారపు అలవాట్లు. ప్రస్తుతకాలంలో చాలా మంది జంక్‌ ‌ఫుడ్‌ ‌వైపు మొగ్గు చూపుతూ, శరీరానికి కావాల్సిన పోషకాల గురించి మర్చిపోయారు. ఇవి తక్కువ పోషకాలను కలిగి ఉండి, కేలోరీలను అధిక మొత్తంలో కలిగి ఉంటాయి. ఆయిల్‌ ‌ఫుడ్‌ , ‌నూనే లో ఫ్రై చేసిన పదార్థాలు, మాంసం మరియు ఆహార పదార్థాలు ప్రజలను లైఫ్‌ ‌స్టైల్‌ ‌వ్యాధుల భారినపడేలా చేస్తున్నాయి.

ఇవే కాకుండా పనిలో ఒత్తిడి, జీవనశైలిలో మార్పు ఈ వ్యాధుల భారినపడటంలో ముఖ్య పాత్ర పోషిస్తున్నాయి. తాజా పండ్లు, ఆకుకూరలు, తాజా కూరగాయలు మరియు తాజా పాలు వాటి ఉత్పత్తులు ఆరోగ్యకరమైన ఆహారంగా తీసుకొనవచ్చు. జీవన శైలి వ్యాధులకు గురి చేసే కారకాలలో ఒత్తిడి కూడా ముఖ్యమైనది. ఒత్తిడి కారణంగా ఊబకాయం, మానసిక రుగ్మతలు, అల్జీమర్స్ ‌మరియు జీర్ణాశయ సంబంధిత వ్యాధులు కలుగుతాయి. నిద్ర తీరులో మార్పు కారణంగా ఉద్రేకత లేదా నిద్రలేమి వలన మానసిక రుగ్మతలు ఎక్కువగా కలుగుతున్నాయి. పనిలో తీవ్రమైన ఒత్తిడి, మరో వైపు స్మోకింగ్‌ ‌మరియు ఆల్కహాల్‌ ‌పానీయాలు తీసుకోవడం వంటి అనారోగ్యకర అలవాట్ల వలన డిప్రెషన్‌కు గురవుతున్నారు. వీటన్నిటి కారణంగా లివర్‌ ‌మరియు కేన్సర్‌ ‌వంటి ప్రాణాంతకర వ్యాధుల భారిన పడుతున్నారు. జీవన శైలి వ్యాధుల భారిన మీరు పడకముందే మేల్కొని, శారీరక పనులు(ఎక్షర్‌ ‌సైజ్‌), ఆరోగ్యకర ఆహారం (సమతుల ఆహారం) తీసుకోవడం, ఒత్తిడి లేని, ఆరోగ్యకర జీవనశైలిని అనుసరించటం ద్వారా ,లైఫ్‌ ‌స్టైల్‌ ‌వ్యాధులకు దూరంగా ఉండే ప్రయత్నం చేయవచ్చు. మానసిక దృఢత్వం వల్లనే మనిషి ఆరోగ్యంగా ఉంటాడు. అందుకు యోగా, మెడిటేషన్‌ ‌లాంటివి చేయాలి. ఉద్వేగాలు అదుపులో ఉంచుకోవడం ద్వారా ఆరోగ్యాన్ని జయించవచ్చు. సహనంను అలవరచుకోవాలి. మానసిక ఆరోగ్యమే మనిషి ఆరోగ్య కరమైన జీవన విధానం.

నర్సులు, ఆరోగ్య కార్యకర్తలకు సాల్యూట్‌:
‌కొరోనా వైరస్‌ ‌కట్టడికి వైద్య సిబ్బంది అందిస్తున్న సేవలు ప్రశంసనీయం. వైద్యులు, నర్సులు, సాంకేతిక నిపుణులు, పారా మెడికల్‌, ‌సహాయక సిబ్బంది తదితర వైద్య రంగానికి చెందిన సిబ్బంది ఆసుపత్రుల్లో వారి బాధ్యతగా పరిమితికి మించి పనిచేస్తున్నారు. సమాజ శ్రేయస్సుకు అహర్నిశలు కృషి చేస్తున్న వైద్య సిబ్బందికి సమాజం అందించే మద్దతు వారికి మరింత స్ఫూర్తిని ఇస్తుంది. నర్సులు, డాక్టర్లు, ల్యాబ్‌ ‌టెక్నీషియన్స్ ఇలా ఆస్పత్రిలో చేస్తున్న వారంతా కొరోనా విస్తరిస్తున్న నేపథ్యంలో తమ సేవలో నిమగ్నమయ్యారు. వైరస్‌ ‌కట్టడికి నిరంతరం శ్రమిస్తున్నారు. కొందరైతే తమ ఇళ్లకు సైతం వెళ్లకుండా దవాఖానాలకు పరిమితం అవుతున్నారు. కొరోనా బారినపడ్డ రోగులకు మొక్కవోని ఆత్మవిశ్వాసంతో సేవ అందిస్తున్నారు. ఈ క్రమంలో ఎన్నో త్యాగాలు చేస్తున్నారు. వారు చేస్తున్న సేవ అనితరసాధ్యం. యుద్ధం వస్తే సైనికులు దేశాన్ని కాపాడటానికి ప్రాణాలకు తెగించి పోరాడుతారు. మనమందరం వారికి ఎల్లప్పుడూ రుణపడి ఉంటాం. కొరోనా కరాళనృత్యం చేస్తున్న వేళ వైద్య సిబ్బంది అందిస్తున్న సేవ సైనికుల సేవకు ఏమాత్రం తీసిపోనిది. ప్రజల ప్రాణాలను కాపాడటానికి వారి ప్రాణాలను ఫణంగా పెడుతున్నారు. కొరోనా వైరస్‌ ‌నేపథ్యంలోనే దేశమంతా వైద్య సిబ్బంది చేస్తున్న సేవలు మరువలేనివి. అలాంటి వారి సేవలకు సాల్యూట్‌.

Leave a Reply