Take a fresh look at your lifestyle.

నేడు నగరంలో వినాయక నిమజ్జనం

  • ఏర్పాట్లను పరిశీలించిన సిపి అంజనీకుమార్‌ 
  • ‌మద్యం దుకాణాల మూసివేత

కొరోనా నేపథ్యంలో ఎటువంటి హంగు ఆర్భాటాలు లేకుండా హైదరాబాద్‌ ‌నగరంలో నేడు వినాయక నిమజ్జనాల నిర్వహణకు అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి. నిమజ్జనానికి వచ్చే భక్తులు అన్ని జాగ్రత్తలు తీసుకోవాలని హైదరాబాద్‌ ‌పోలీసు కమిషనర్‌ అం‌జనీ కుమార్‌ ‌విజ్ఞప్తి చేశారు. సోమవారం ఆయన ట్యాంక్‌బండ్‌పై వినాయక నిమజ్జన ఏర్పాట్లను ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా అంజనీకుమార్‌ ‌డియాతో మాట్లాడుతూ.. వినాయక నిమజ్జనం కోసం పోలీసు శాఖ పకడ్భంది ఏర్పాట్లు చేసిందన్నారు. గత వారం నుంచి నిమజ్జన కార్యక్రమం జరుగుతుందని, ఇప్పటి వరకు 30 వేల విగ్రహాలను నిమజ్జనం అయ్యాయని తెలిపారు. నేడు రాత్రి వరకు ఐదు ఫీట్ల కంటే ఎక్కువ ఎత్తున్న 165 విగ్రహాలు, మూడు నుంచి ఐదు ఫీట్ల వరకు ఉన్న 1239, మూడు ఫీట్ల కంటే తక్కువ ఉన్న 1842 విగ్రహాలు నిమజ్జనం కాబోతున్నాయని, దానికి కావాల్సిన అన్ని ఏర్పాట్లు పూర్తి చేశామని పేర్కొన్నారు. మొత్తం 21 క్రేన్లను ట్యాంక్‌బండ్‌పై ఏర్పాటు చేశామని చెప్పారు. 1500పైగా పోలీసులతో భద్రత ఏర్పాటు చేశామన్నారు. ట్యాంక్‌బండ్‌పై ఇతర వాహనాలకు అనుమతి లేదని, పలు చోట్ల ట్రాఫిక్‌ ‌డైవర్షన్‌ ‌చేశామని చెప్పారు. ఖైరతాబాద్‌ ‌సహా అనేక గణేష్‌ ‌విగ్రహాలను నిమజ్జనం చేయనున్నారు. పరిమిత ఆంక్షలు విధించారు. కొరోనా  నేపథ్యంలో భారీ ఊరేగింపులకు అనుమతులు ఇవ్వడం లేదు.

మద్యం దుకాణాల మూసివేత
గణేష్‌ ‌నిమజ్జనం సందర్భంగా మంగళవారం జంటనగరాల్లో శాంతి భద్రల దృష్ట్యా మద్యం దుకాణాలను మూసి ఉంచాలని హైదరాబాద్‌ ‌నగర పోలీస్‌కమిషనర్‌ అం‌జనీ కుమార్‌ ఆదేశాలు జారీ చేశారు. నేడు ఉదయం 6గంటల నుంచి బుధవారం ఉదయం 6గంటల వరకూ వైన్‌షాపులు, కల్లు దుకాణాలు మూసివేయాలని ఆదేశించారు. నిబంధనలు విరుద్ధంగా వ్యవహరించిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.

హంగూ ఆర్భాటం లేకుండా ఖైరతాబాద్‌ ‌వినాయక నిమజ్జనం నిర్వహణకు ఏర్పాట్లు
గతేడాదితో పోలిస్తే వినాయక నిమజ్జనాలు ఎలాంటి హంగూ ఆర్భాటం లేకుండా ప్రశాంతంగా ముగుస్తున్నాయి. నేడు ఖైరతాబాద్‌  ‌గణేషుడి విగ్రహ నిమజనం కానుంది. మధ్యాహ్నం 3 గంటలకు ఖైరతాబాద్‌ ‌గణేషుడి శోభాయాత్ర ప్రారంభమవుతుందని ఖైరతాబాద్‌ ఉత్సవ నిర్వాహకులు తెలిపారు. టెలిఫోన్‌ ‌భవన్‌, ‌తెలుగుతల్లి ఫ్లై ఓవర్‌, ఎన్టీఆర్‌ ‌మార్గ్ ‌దుగా ట్యాంక్‌ ‌బండ్‌లోని క్రేన్‌ ‌నెంబర్‌ 4 ‌వద్దకు ఈ శోభాయాత్ర చేరుకుంటుందని చెప్పారు. అనంతరం గణేషుడి నిమజ్జనం ఉంటుందని పేర్కొన్నారు. భక్తుల విజ్ఞప్తి మేరకు ప్రతి ఏడాది మాదిరిగానే ఈసారి కూడా ఖైరతాబాద్‌ ‌గణేష్‌ ‌శోభయాత్ర నిర్వహిస్తున్నామన్నారు. ఊరేగింపునకు భక్తులెవరు రావద్దని పిలుపు నిచ్చారు. శోభాయాత్రకు పోలీసులు సహకరించాలని కోరారు. ఖైరతాబాద్‌ ‌గణేషుడి ఊరేగింపునకు పోలీసు బందోబస్తు ఇవ్వకపోయినా, ప్రైవేటు సెక్యూరిటీతోనైనా శోభాయాత్ర నిర్వహిస్తామని ఖైరతాబాద్‌ ఉత్సవ నిర్వాహకులు స్పష్టంచేశారు.

Leave a Reply