Take a fresh look at your lifestyle.

నేడు కార్మిక సంఘాల.. దేశ వ్యాప్త సమ్మె

  • ఆందోళనలకు సిద్ధమైన కార్మికులు
  • సార్వత్రిక సమ్మెకు టిఆర్‌ఎస్‌ ‌మద్దతు

కార్మిక సంఘాలు మరోసారి దేశవ్యాప్త సమ్మెకు పిలుపునిచ్చాయి. ప్రభుత్వ కార్మిక విధానాలకు వ్యతిరేకంగా గురువారం సమ్మె చేయాలని 10 కార్మిక సంఘాలు నిర్ణయించాయి. బ్యాంకింగ్‌, ‌రక్షణ, రైల్వేలతో పాటు వివిధ రంగాలకు చెందిన దాదాపు 25 కోట్ల మంది కార్మికులు, ఉద్యోగులు ఈ సమ్మెలో పాల్గొంటారని అంచనా. సులభతర వాణిజ్యం పేరుతో ప్రభుత్వం కార్మిక చట్టాలను తుంగలో తొక్కుతోందని ఐఎన్‌టీయూసీ, ఏఐటీయూసితో సహా పది కార్మిక సంఘాలు ఆరోపించాయి. ఇప్పటికే దేశవ్యాప్తంగా లెఫ్ట్ ‌కార్మిక సంఘాలు గతకొన్ని రోజులుగా నిరసన ర్యాలీలు నిర్వహిస్తూ వొచ్చాయి.

ఈనెల 26న జరిగే సార్వత్రిక సమ్మెను జయప్రదం చేయాలని కోరుతూ సిఐటియు, దాని అనుబంధ సంఘాలు, వివిధ కార్మిక సంఘాల ఆధ్వర్యంలో విస్తృతంగా ప్రచార కార్యక్రమాలు జరిగాయి. సార్వత్రిక సమ్మెలో మున్సిపల్‌ ‌కార్మికులు పాల్గొనేందుకు అనుమతించాలని కోరుతూ సిఐటియు స్థానిక అధికారులకు నోటీసును అందజేశారు. అలాగే వివిధ ప్రాంతాల్లో సమ్మెను జయప్రదం చేయాలని కోరుతూ సిఐటియు ఆధ్వర్యంలో ద్విచక్ర వాహనాలతో ర్యాలీ నిర్వహించారు. సిఐటియు ఆధ్యర్వంలో కార్మికులు పాల్గొని బిజెపి విధానాలకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. దేశవ్యాప్త సమ్మె సందర్భంగా నిర్మాణ రంగాన్ని ఆదుకోవాలని, నిర్మాణ కార్మికుల సంక్షేమ బోర్డును రక్షించుకోవడం కోసం పనిబంద్‌ ‌చేయాలని సిఐటియు నేతలు పిలపునిచ్చారు. కేంద్ర ప్రభుత్వ కార్మిక, కర్షక, ఉద్యోగ, ప్రజా వ్యతిరేక విధానాలకు నిరసనగా కేంద్ర కార్మిక సంఘాలు ఈనెల 26న జరపతలపెట్టిన సార్వత్రిక సమ్మెను జయప్రదం చేయాలని కోరారు.

Leave a Reply