Take a fresh look at your lifestyle.

టోక్యో ఒలింపిక్‌ అప్‌డేట్స్

  • మహిళల డిస్కస్‌‌త్రోలో ఫైనల్‌కు కమల్‌‌ప్రీత్‌ ‌కౌర్‌
  • సెమిస్‌లో పోరాడి వోడిన షట్లర్‌ ‌పివి సింధు
  • చైనీస్‌ ‌తైపీ తైజుతో హోరాహోరీ పోరులో వోటమి
  • మహిళల హాకీ జట్టు వరుసగా రెండో విజయం
  • పతకం లేకుండానే వెనుతిరిగిన టెన్నిస్‌ ‌స్టార్‌ ‌జుకోవిచ్‌

ఒలింపిక్స్‌లో భారత్‌ ‌మరో పతకం సాధించే దిశగా అడుగేసింది. మహిళల డిస్కస్‌‌త్రోలో భారత క్రీడాకారిణి కమల్‌‌ప్రీత్‌ ‌కౌర్‌ ‌ఫైనల్‌ ‌చేరింది. శనివారం జరిగిన క్వాలిఫికేషన్‌ ‌రౌండ్‌లో కమల్‌‌ప్రీత్‌ 64 ‌మిటర్లతో రెండో స్థానంలో నిలిచింది. దాంతో ఆమె ఫైనల్‌కు చేరింది. ఇక క్వాలిఫికేషన్‌ ‌రౌండ్‌లో కమల్‌‌ప్రీత్‌ ‌తొలి ప్రయత్నంలో 60.29 మిటర్లు, రెండో ప్రయత్నంలో 63.97 మిటర్లు డిస్కస్‌ ‌త్రో చేసింది. చివరికి మూడోసారి 64 మిటర్లు విసరడంతో ఫైనల్‌కు అర్హత సాధించింది. మరోవైపు భారీ అంచనాలతో బరిలోకి దిగిన సీమా పూనియా 16వ స్థానంతో సరిపెట్టుకుని ఇంటిముఖం పట్టింది. కాగా, సోమవారం జరిగే ఫైనల్స్‌లో మొత్తం 12 మంది పోటీపడనున్నారు. అక్కడ కూడా కమల్‌‌ప్రీత్‌ ఇలాంటి అద్భుత ప్రదర్శన చేస్తే భారత్‌ ‌ఖాతాలో మరో పతకం చేరడం ఖాయం.

సెమిస్‌లో పోరాడి వోడిన షట్లర్‌ ‌పివి సింధు

Tokyo Olympic Updatesఒలింపిక్స్‌లో బ్యాడ్మింటన్‌ ‌మహిళల సింగిల్స్ ‌సెమిస్‌లో పివి సింధు నిరాశ పరిచింది. సెమిస్‌లో పరాజయం పాలైన భారత షట్లర్‌ ‌సింధు కాంస్య పతకంపై దృష్టిసారించింది. ప్రపంచ నంబర్‌ ‌వన్‌ ‌క్రీడాకారిణి చైనీస్‌ ‌తైపీ తైజుతో హోరాహోరీగా జరిగిన సెమిస్‌ ‌పోరులో సింధు వరుస సెట్లలో వోటమి పాలైంది. తొలి సెట్‌ ‌హోరాహోరీగా సాగినప్పటికీ రెండో సెట్‌లో మాత్రం తై జు దూకుడు ముందు నిలవలేకపోయింది. ఫలితంగా 18-21, 12-21తో వోటమి పాలైంది. సింధు వోడినప్పటికీ పతకం ఆశలు సజీవంగా ఉన్నాయి. చైనాకే చెందిన హి బింగ్జియావోతో నేడు సాయంత్రం ఐదు గంటలకు కాంస్యం కోసం పోరు జరగనుంది. ఈ మ్యాచ్‌లో గెలిస్తే సింధు ఒలింపిక్స్‌లో మరో పతకాన్ని అందుకోనుంది.

మహిళల హాకీ జట్టు వరుసగా రెండో విజయం

Tokyo Olympic Updatesవిశ్వక్రీడలు ఒలింపిక్స్‌లో భారత మహిళల హాకీ జట్టు వరుసగా రెండో విజయం నమోదు చేసింది. శనివారం దక్షిణాఫ్రికాతో జరిగిన పూల్‌-ఏ ‌మ్యాచ్‌లో భారత మహిళా జట్టు 4-3 తేడాతో గెలిచింది. భారత జట్టులో వందన కటారియా మూడు గోల్స్ ‌చేసి భారత్‌కు తిరుగులేని ఆధిక్యాన్ని అందించింది. అలాగే నేహా ఒక గోల్‌ ‌చేసింది. నువ్వా నేనా అన్నట్టు సాగిన ఈ మ్యాచ్‌లో ప్రత్యర్థి దక్షిణాఫ్రికా చివరి వరకు భారత్‌కు గట్టిపోటీ ఇచ్చింది. ఇక ఈ విజయంతో రాణిరాంపాల్‌ ‌సారథ్యంలోని భారత జట్టు క్వార్టర్‌ ‌ఫైనల్‌ ఆశలు సజీవంగా ఉంచుకుంది.

భారత్‌కు నిరాశ మిగిల్చిన పూజారాణి ఓటమి
టోక్యో ఒలింపిక్స్ ‌బాక్సింగ్‌లో ఇండియాకు మరో జలక్‌ ‌తగిలింది. 69-75 కిలోల మహిళల బాక్సింగ్‌ ‌బౌట్‌లో.. పూజా రాణి ఓటమి పాలైంది. క్వార్టర్స్‌లో చైనా బాక్సర్‌ ‌లీ క్వియాన్‌ ‌చేతిలో 5-0 తేడాతో మ్యాచ్‌ను చేజార్చుకున్నది. పూజా రాణి ఓటమి భారత్‌కు నిరాశనే మిగ్చిలింది. చైనా బాక్సర్‌ ‌లీ.. మూడు రౌండ్లలోనూ దూకుడు ఆటను ప్రదర్శించింది. భారీ పంచ్‌లతో పూజాను ఉక్కిరిబిక్కిరి చేసింది. దీంతో అయిదుగురు జడ్జీలు చైనా బాక్సర్‌కే మొగ్గు చూపారు. పూజా రాణి చాలా పేలవమైన ఆటను ఆడింది. ఎక్కడా అటాక్‌ ‌చేసినట్లు కనిపించలేదు. దీంతో ఆమె మెడల్‌ ‌గెలుచుకునే అవకాశాన్ని కోల్పోయింది.

పతకం లేకుండానే వెనుతిరిగిన టెన్నిస్‌ ‌స్టార్‌ ‌జుకోవిచ్‌
‌టోక్యో ఒలింపిక్స్‌లో వరల్డ్ ‌నెం.1 టెన్నిస్‌ ‌స్టార్‌ ‌నోవాక్‌ ‌జోకోవిచ్‌ ‌పోరాటం ముగిసింది. వింబుల్డన్‌ 2021 ‌టైటిల్‌ ‌గెలిచి జోరుమిద ఉన్న జోకోవిచ్‌ ‌టోక్యో ఒలింపిక్స్‌లో పతకం లేకుండానే ఇంటిముఖం పట్టాడు.సెమి ఫైనల్స్‌లో అలెగ్జాండర్‌ ‌జ్వెరెవ్‌ ‌చేతుల్లో ఓడిన నోవాక్‌ ‌జొకోవిచ్‌, ‌కారెన్నో బూస్టతో జరిగిన కాంస్య పతక మ్యాచ్‌లోనూ పోరాడి ఓడాడు. రెండు గంటల 47 నిమిషాల పాటు సాగిన ఈ సుదీర్ఘ మ్యాచ్‌లో జొకోవిచ్‌… 4-6, 8-6, 3-6 ‌తేడాతో ఓటమి పాలయ్యాడు. కాగా జకోవిచ్‌ 2008 ‌బీజింగ్‌ ఒలింపిక్స్ ‌పురుషుల సింగిల్స్‌లో కాంస్య పతకాన్ని గెలుచుకున్నాడు.

Leave a Reply