Take a fresh look at your lifestyle.

తెలంగాణలో కొత్తగా మరో 2,123 కొరోనా కేసులు

‌తెలంగాణలో కొత్తగా మరో 2,123 కొరోనా కేసులు నమోదయ్యాయి. కొరోనా వైరస్‌ ‌వల్ల  9 మంది మృతి చెందారు. శనివారం ఉదయం రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ  బులిటెన్‌ ‌విడుదల చేసింది. రాష్ట్రంలో కొరోనా వైరస్‌ ‌పాజిటివ్‌ ‌కేసుల సంఖ్య రోజు రోజుకు పెరిగిపోతుంది. రాష్ట్రంలో ఇప్పటి వరకు నమోదైన కేసుల సంఖ్య 1,69,169 చేరాయని బులిటెన్‌‌లో తెలిపింది.

మొత్తం 1,37,508 మంది డిశ్చార్జ్ ‌కాగా, రాష్ట్రంలో కొరోనాతో ఇప్పటివరకు 1,025మంది మృతి     చెందారు. ప్రస్తుతం రాష్ట్రంలో 30,636 యాక్టివ్‌ ‌కేసులు ఉన్నాయి. జీహెచ్‌ఎం‌సీ పరిధిలో 305 కేసులు కాగా, ఇక జిల్లాల వారీగా చూసినట్లయితే.. రంగారెడ్డి 185, మేడ్చల్‌ 149, ‌నల్గొండ 135, కరీంనగర్‌లో 112 కొరోనా పాజిటివ్‌ ‌కేసులు నమోదయ్యాయి.

Today Telangana Corona Bulletin1

Leave a Reply