Take a fresh look at your lifestyle.

నేడు రాష్ట్ర మంత్రివర్గ సమావేశం

‌రాష్ట్ర మంత్రివర్గ సమావేశం శనివారం జరుగనుంది. సీఎం కేసీఆర్‌ అధ్యక్షతన ప్రగతి భవన్‌లో సాయంత్రం 7 గంటలకు ఈ సమావేశం జరుగనుంది. తెలంగాణ రాష్ట్ర బడ్జెట్‌ 2020 21‌ను ఆదివారం శాసనసభలో ప్రవేశపెట్టనున్న నేపథ్యంలో ఈ మంత్రివర్గ సమావేశం జరుగనుంది. ఈ సమావేశంలో బడ్జెట్‌ను మంత్రివర్గం లాంఛనంగా ఆమోదించనుంది. గవర్నర్‌ ‌ప్రసంగంలో వచ్చిన అంశాలన్నింటినీ చర్చించనున్నారు. ఈ ప్రసంగంపై ప్రతిపక్షాలు చేసిన విమర్శలను మంత్రులు అందరు ఐక్యంగా తిప్పికొట్టాలని విమర్శలకు తావివ్వవద్దని సీఎం కేసీఆర్‌ ‌మంత్రులకు సూచించనున్నట్లు తెలిసింది. బడ్జెట్‌ను ఆమోదించడం కోసం జరిగే సమావేశమే అయినప్పటికీ చాలా రాజకీయ అంశాలు ఈ సమావేశంలో ప్రస్తావనకు రానున్నట్లు సమాచారం. రుణ మాఫీపైన ప్రభుత్వం నుంచి స్పష్టమైన ప్రకటనలు లేవని వస్తున్న విమర్శలకు మంత్రివర్గ సమావేశంలో చర్చించి రుణమాఫీపై సీఎం కేసీఆర్‌ ‌శాసనసభలో స్పష్టంగా ప్రకటన వ్యవసాయ శాఖ మంత్రి విజ్ఞప్తి చేసే అవకాశం ఉంది.

మరోవైపు, శాసనసభ సమావేశాలను ఏ విధంగా నిర్వహించాలి.అనే విషయంపై కూడా ఈ సమావేశంలో మంత్రులు చర్చించనున్నారు. సభలో విపక్ష సభ్యులు చేసే విమర్శలను ఏ విధంగా తిప్పికొట్టాలి ? ఏయే అంశాలను ప్రాధాన్యతా క్రమంలో సభలో చర్చకు తీసుకు రావాలి వంటి విషయాలపై నేడు జరిగే మంత్రివర్గ సమావేశంలో చర్చించనున్నట్లు సమాచారం.

Tags: Telangana State, Budget 2020 21st, Minister of Agriculture

Leave a Reply