- దక్షిణ అమెరికా, ఆస్ట్రేలియా, దక్షిణాఫ్రికాలో అధిక ప్రభావం
- భారత్లో సరిగ్గా కనపడదని నిపుణుల అంచనా
నేడు సూర్యగ్రహణం సంభవిస్తుంది. అయితే అది భారతదేశంలో స్వల్పంగానే కనిపిస్తుంది. తాజాగా శనివారం ఏర్పడే సూర్యగ్రహణం దక్షిణ అమెరికా, ఆస్ట్రేలియా, దక్షిణాఫ్రికాలోని అన్ని ప్రాంతాల్లో పూర్తి స్థాయిలో కనిపిస్తుంది. భారత కాలమానం ప్రకారం డిసెంబర్ 4న శనివారం ఉదయం రూ.10.59 గంటలకు ప్రారంభమయ్యే సూర్యగ్రహణం మధ్యాహ్నం 3.07 గంటల వరకూ కొనసాగుతుంది.
ఇది అతిపెద్ద సూర్యగ్రహణం అని.. అందరూ అప్రమత్తంగా ఉండాలని గ్రహాలు నమ్మేవారికి పండితులు సూచిస్తున్నారు. ఈ ఏడాది ఏర్పడే సూర్యగ్రహణం ఇదే చివరిది అని చెబుతున్నారు. అయితే ఈ సూర్యగ్రహణం భారత్లో సరిగ్గా కనపడదని నిపుణులు చెబుతున్నారు.ఈ సూర్యగ్రహణం హిందూ క్యాలెండర్ ప్రకారం కృష్ణపక్షంలోని మార్గశిర అమావాస్య తిథి (అమావాస్య రాత్రి) వొస్తుందని చెబుతున్నారు.