Take a fresh look at your lifestyle.

రక్తమోడిన హైదరాబాద్ రహదారులు

today road accidents in Hyderabad

ఈ ఉదయం హైదరాబాద్ లో రోడ్ లు రక్తమోడాయి. రెండు చోట్ల ప్రమాదాలు జరిగాయి. ముందుగా తెల్లవారుజామున మియపూర్ పోలీసు స్టేషన్ పరిధిలోని హఫీజ్ పేట్ వద్ద కారు భీభత్సం సృష్టించింది. మద్యం మత్తులో ఉన్న డ్రైవర్…అదుపుతప్పి గ్రీన్ బావర్చి హోటల్ ముందు నిలుచున్న అఫ్సర్ అనే వ్యక్తి పైకి దూసుకుపోయాడు. బీహెచ్ఈఎల్ ప్రాంతానికి చెందిన అఫ్సర్ అక్కడికక్కడే మృతిచెందాడు. మరో రెండు ద్విచక్ర వాహనాలు ద్వంసమయ్యాయి. పలువులు స్వల్పంగా గాయపడ్డారు. అఫ్సర్ మృతదేహాన్ని గాంధీ మార్చురీకి తరలించారు. కారు డ్రైవర్ ను అదుపులోకి తీసుకున్న పోలీసులు అతనిని సతీష్ అనే వ్యక్తిగా గుర్తించారు.

అతనికి బ్రీత్ ఎనలైజర్ టెస్ట్ చేయగా అల్కాహాల్ పర్సంటేజి 63 mg గా నమోదైంది. అతనితో పాటు మరో ఇద్దరు ప్రమాదం జరిగినప్పుడు కారులో ఉన్నారని కానీ ప్రమాదం జరిగిన వెంటనే కారులో ఉన్న మరో ఇద్దరు పారిపోయారని అంటున్నారు. సతీష్ కూడా పారిపోయేందుకు యత్నిస్తుండగా పట్టుకున్న స్థానికులు పోలీసులకి అప్పచెప్పారు. ఇక సికింద్రాబాద్ వెస్ట్ మారేడ్పల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో మరో రోడ్డు ప్రమాదం జరిగింది. సికింద్రాబాద్ రైల్ నిలయం వద్ద అదుపు తప్పిన కారు స్కూల్ కి వెళ్తున్న తండ్రి కొడుకులను గుద్దేసింది. తీవ్ర గాయాలు తో తండ్రి,కొడుకులను స్థానికులు హాస్పిటల్ తరలించారు. చికిత్స పొందుతూ తండ్రి గిరి మృతి చెందగా కొడుకు పరిస్థితి విషమంగా ఉంది. కారు అతివేగంగా దూసుకు రావడం వల్లే ఈ ప్రమాదం జరిగిందని అంటున్నారు.

Get real time updates directly on you device, subscribe now.

Leave a Reply