నగరంల్లో ట్రాఫిక్ ఆంక్షలు..భారీ భద్రతా ఏర్పాట్లు చేశామన్న సిపి అంజనీకుమార్
పాతబస్తీలో లాల్ దర్వాజ బోనాల సందర్భంగా నగరంలో ప్రత్యేక భద్రతా చర్యలు తీసుకున్నారు. కొరోనా నేపథ్యంలో భక్తులు తప్పకుండా మాస్కు ధరించడంతో పాటు, భౌతిక దూరం పాటిస్తూ ముందుకు సాగాలని పోలీస్ శాఖ సూచించింది. ఈ సందర్బంగా నగరంలోని పలు ప్రాంతాల్లో ట్రాఫిక్ ఆంక్షలు విధిస్తూ నగర సీపీ అంజనీకుమార్ ఆదేశాలు జారీ చేశారు. అన్ని ఏర్పాట్లు చేసి తగన పోలీస్ బలగాలను రంగంలోకి దింపామని తెలిపారు. పాతబస్తీలో ఆదివారం బోనాలు, సోమవారం ఘటాల ఉరేగింపు ఉంటుంది. దీంతో సోమవారం బోనాల జాతరకు సంబంధించిన ర్యాలీ పాతబస్తీలో కొనసాగనుంది.ఈ నేపథ్యంలోనే సోమవారం మధ్యాహ్నం 12 నుంచి రాత్రి 11 గంటల వరకు ట్రాఫిక్ ఆంక్షలు విధిస్తూ కమిషనర్ ఉత్తర్వులు జారీ చేశారు.
అంబర్పేట్లోని మహంకాళి ఆలయం వద్ద జరిగే బోనాల సందర్భంగా అంబర్పేట్ పరిసర ప్రాంతాల్లో ఆదివారం, సోమవారం ట్రాఫిక్ ఆంక్షలు కొనసాగనున్నాయి. ఆదివారం ఉదయం 10 నుంచి సాయంత్రం 4 గంటల వరకు, సోమవారం మధ్యాహ్నం 3 నుంచి మరుసటి రోజు తెల్లవారు జామున 3 గంటల వరకు ఈ ఆంక్షలు ఉంటాయి. ఈ సందర్భంగా వరంగల్, పరిసర ప్రాంతాల నుంచి వచ్చే అంబర్పేట్ వైపు వచ్చే జిల్లా బస్సులను దారి మళ్లిస్తారు. వరంగల్, తదితర ప్రాంతాల వైపు నుంచి ఉప్పల్వి•దుగా అంబర్పేట్ వైపునకు వొచ్చే వాహనాలు, తార్నాక, అడిక్మెట్, విద్యానగర్, ఫీవర్ హాస్పిటల్, టూరిస్ట్ హోటల్, నింబోలి అడ్డ, చాదర్ఘాట్, సీబీఎస్ వైపు మళ్లిస్తారు. తిరిగి వెళ్లే వాహనాలు కూడా అదే రూట్లో వెళ్లాలి.