Take a fresh look at your lifestyle.

‘‘‌రాజకీయ దురంధరుడు పాములపర్తి’’ నేడు పి.వి. జయంతి

సమకాలీన రాజకీయ పరిస్థితులను అవగాహన చేసుకొని తదనుగుణంగా సానుకూల వాతావరణం ఏర్పరచుకుని పరిపాలన సాగించిన వాడే సమర్ధుడైన నాయకుడు కాగలడు అనేది అర్థశాస్త్ర రచయిత అయిన కౌటిల్యుడిగా పేరున్న చాణక్యుని అభిప్రాయం. ఆ అభిప్రాయాన్ని పూర్తిగా ఆకళింపు చేసుకొని, తదనుగుణంగా నడుచుకొని బలం, బలగం లేకున్నా, దేశ రాజకీయాలపై చెరగని ముద్ర వేయ గలిగారు పి.వి. నరసింహారావు. దక్షిణ భారతావని నుండి ప్రధానమంత్రి పదవిని అధిష్టించిన తొలి నేతగా, ఒకే ఒక తెలుగువానిగా, నరసింహారావు కార్యదీక్షత, దార్శనికత ద్వారా ఖ్యాతి గడించారు. ‘‘పి.వి’’గా లబ్ద ప్రతిష్టులైన ఆయన బహు భాషావేత్త, రచయిత. స్నాతకోత్తర న్యాయశాస్త్ర కోవిదులు, ‘‘అపర చాణక్యుడిగా’’ పేరొందారు.ఆంధ్ర ప్రదేశ్‌ ‌లోని వరంగల్‌ ‌జిల్లా, నర్సంపేట మండలం లక్నేపల్లి గ్రామంలో 1921 జూన్‌ 28 ‌న రుక్నాబాయి, సీతారామారావు దంపతులకు పి.వి జన్మించారు. వరంగల్లు జిల్లాలోనే ప్రాథమిక విద్య మొదలు పెట్టారు. తరువాత కరీంనగర్‌ ‌జిల్లా భీమదేవరపల్లి మండలం వంగర గ్రామానికి చెందిన పాములపర్తి రంగారావు, రుక్మిణమ్మలు ఆయనను దత్తత తీసుకోవడంతో అప్పటినుండీ పాములపర్తి వెంకట నరసింహారావు అయ్యారు.1938 లోనే హైదరాబాదు రాష్ట్ర కాంగ్రెసు పార్టీలో చేరి నిజాము ప్రభుత్వ నిషేధాన్ని ధిక్కరిస్తూ ‘‘వందేమాతరం’’ గేయాన్ని పాడారు. తాను చదువుకుంటున్న ఉస్మానియా విశ్వవిద్యాలయం నుండి ఆయనను బహిష్కరించారు. దాంతో ఓ మిత్రుడి సాయంతో నాగపూరు విశ్వవిద్యాలయంలో చేరి నాగపూరులో ఆ మిత్రుని ఇంట్లోనే ఉంటూ, 1940 నుండి 1944 వరకు ఎల్‌.ఎల్‌.‌బి చదివారు.

స్వామి రామానంద తీర్థ, బూర్గుల రామకృష్ణారావుల అనుయాయిగా స్వాతంత్య్రోద్యమం లోను, హైదరాబాదు విముక్తి పోరాటంలోను పాల్గొన్నారు. 1957 లో శాసనసభ్యుడిగా రాజకీయ జీవితం ఆరంభించిన పివి, రాష్ట్ర మంత్రిగా, ముఖ్య మంత్రిగా కేంద్ర మంత్రిగా, చివరకు ప్రధానిగా తన మేధాశక్తితో, క్రమానుగతంగా ఉన్నత పదవులను, కైవసం చేసుకున్న రాజనీతిజ్ఞులు ఆయన. కాంగ్రెస్‌ ‌హయాంలో, పూర్తి సంఖ్యాబలం లేని మైనారిటీ ప్రభుత్వాన్ని, తన చాకచక్యంతో చాణక్యనీతితో, పూర్తి కాలం నడిపించిన మేధావి. 1957 లో మంథని నుండి ఎమ్మెల్యేగా ఎన్నికై, వరుసగా నాలుగు సార్లు గెలిచారు. 1962 లో మొదటిసారి రాష్ట్ర మంత్రివర్గంలో స్థానం పొంది, 62 నుండి 64 వరకు న్యాయ సమాచార మంత్రిగా, 64 నుండి 67 వరకు దేవాదాయ, న్యాయబీ 67 లో వైద్య ఆరోగ్య 68 నుండి 71 వరకు న్యాయ, సమాచార శాఖలను నిర్వహించారు. 77లో లోకసభకు ఎన్నికైనారు. జనవరి 1980 – జూలై 1984 కేంద్ర విదేశ వ్యవహారాల మంత్రిబీ జూలై 1984 – డిసెంబర్‌ 1984‌కేంద్ర హోం శాఖమంత్రిబీ నవంబరు 1984 – ఫిబ్రవరి 1985 భారత ప్రణాళికా శాఖ మంత్రి, ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు, జనవరి 1985 – సెప్టెంబరు 1985కేంద్ర రక్షణ శాఖమంత్రి, సెప్టెంబరు 1985 – జూన్‌, 1988 ‌కేంద్ర మానవ వనరుల అభివృద్ధి శాఖ మంత్రిబీ జూలై 1986 – ఫిబ్రవరి 1988 కేంద్ర ఆరోగ్యం, కుటుంబ సంక్షేమ శాఖమంత్రిబీ జూన్‌ 1988 – ‌డిసెంబర్‌ 1989 ‌విదేశ వ్యవహారాల శాఖ మంత్రిబీ 1991 మే 29 – 1996 కాంగ్రెసు పార్టీ అధ్యక్షునిగాబీ జూన్‌ 1991 – 1996 ‌మే 10 వరకు ప్రధానమంత్రిగా పని చేశారు. 71 సెప్టెంబర్‌ ‌నుండి 73 జనవరి వరకు ముఖ్యమంత్రిగా ఎన్నో ఒడిదుడుకులను ఎదుర్కొన్నారు.

సీఎం పీఠం అధిష్టించగానే అసమ్మతి. ఈ విషయమై అధిష్టానంతో చర్చించేందుకు ఢిల్లీ – హైదరాబాదుల మధ్య తిరిగేందుకే ఆయనకు సమయం సరిపోయింది. పట్టణ భూ గరిష్ట చట్టాన్ని తెచ్చింది ఆయనే. ఆ తర్వాత ఆయన కార్యక్షేత్రం ఢిల్లీకి మారింది. ఏఐసిసి ప్రధాన కార్యదర్శిగా, మొదటిసారి హనుమకొండ నుండి లోకసభకు ఎన్నికైనారు. నంద్యాల ద్వారా ఉప ఎన్నికలలో, టిడిపి పోటీ లేకుండా ఐదు లక్షల పైచిలుకు మెజారిటీతో గెలుపొంది, గిన్నిస్‌ ‌రికార్డు సృష్టించి, పదవ లోకసభలో అడుగిడి, పలు శాఖల మంత్రిగా విధులు నిర్వర్తించారు. రాజీవ్‌ ‌హత్య కారణంగా 1991 లో సార్వత్రిక ఎన్నికలలో పోటీ చేయకుండానే, దేశ 10వ ప్రధాన మంత్రి పదవి చేపట్టారు. భారత ఆర్థిక సంస్కరణలకు బీజం వేసి కుంటుతున్న వ్యవస్థను, తిరిగి పట్టాలెక్కించిన ఘనత సొంతం చేసుకుని, ‘‘భారత ఆర్థిక సంస్కరణల పితామహుడిగా’’ పేరొందిన మేధావి. ఆర్థిక వ్యవస్థ పునరుజ్జీవనం కోసం చేపట్టిన సంస్కరణలు, రిజర్వు బ్యాంకు గవర్నర్‌ ‌గా, ఆర్థిక శాస్త్రవేత్త గా ఉన్న మన్మోహన్‌ ‌సింగ్‌ ‌ను, ప్రత్యేకించి పిలిచి, దేశ ఆర్థిక మంత్రిని చేయడం ఆయనకే చెల్లింది. దేశాన్ని బంగారం తాకట్టు పెట్టాల్సిన స్థితి నుండి, సూపర్‌ ‌పవర్‌ ‌గా తేర్చి దిద్దడానికి పునాది వేశారు. ఆర్థిక సంస్కరణల ద్వారా మార్కెట్‌ ‌సరళీకరణ ఆర్థిక విధానాన్ని రూపొందించారు. సంస్కరణల 1992 లో నేషనల్‌ ‌స్టాక్‌ ఎక్స్చేంజ్‌ ‌కంప్యూటర్‌ ఆధారిత వ్యాపార పద్ధతిని ప్రారంభించారు. పంజాబ్‌ ‌తీవ్రవాదాన్ని అణచి వేసింది ఆయన ప్రభుత్వమే. కాశ్మీర్‌ ‌తీవ్రవాదులు ప్రముఖులను అపహరించినప్పుడు, వారి డిమాండ్లను లెక్క పెట్టక బందీలను విడిపించిన ఘనత ఆయనదే. ఇజ్రాయెల్‌ ‌తో దౌత్య సంబంధాలు, తీవ్రవాదానికి పాకిస్థాన్‌ ఇస్తున్న ప్రోత్సాహాన్ని బయటపెట్టి, ఆగ్నేయాసియా దేశాలతో సత్సంబంధాలు కలిగి ఉండడం, పివి ప్రభుత్వం సాధించిన విజయమే.1998లో వాజపేయి ప్రభుత్వం జరిపిన అణుపరీక్షల కార్యక్రమాన్ని మొదలు పెట్టింది పీవీ ప్రభుత్వమే. ఆయన కాలంలోనే బాంబు తయారయింది. ఈ విషయాన్ని స్వయంగా వాజపేయే ప్రకటించారు. రాష్ట్ర విద్యా మంత్రిగా రెసిడెన్షియల్‌ ‌పాఠశాలల వ్యవస్థ, కేంద్ర మానవ వనరుల శాఖ మంత్రిగా నవోదయ విద్యాలయాలకు రూపకర్త అయినారు. 1973లో సీఎంగా భూస్వామ్య వ్యవస్థ నిర్మూలనకు నడుం బిగించి, భూ గరిష్ట పరిమితి, పట్టణ పరిమితి చట్టాన్ని అమలు చేసిందీ పి.వి.నే.

ప్రధానిగా ఆయన హయాంలో 1992 డిసెంబర్‌ 6 ‌న అయోధ్యలో బాబరీ మసీదును కూలగొట్టిన సంఘటనలో పీవి వైఖరి వివాదాస్పదమైంది. ప్రధానిగా ఐదేళ్ళ పదవీకాలంలో అనేక అవినీతి ఆరోపణలను పివి ఎదుర్కొన్నారు. చివరి కేసులన్నీ వీగిపోయాయి. బహుభాషా పండితులు, 17 భాషలలో అలవోకగా మాట్లాడ గలిగిన మేధావి. 1940 లో తన సోదరులతో కలిసి కాకతీయ పత్రికలో ఎన్నో వ్యాసాలు రాశారు. 1948 నుండి 51 వరకు కాకతీయ పత్రిక ‘‘సంపాదకునిగా’’ పని చేశారు. కవిసామ్రాట్‌ ‌విశ్వనాథ సత్యనారాయణ విరచిత వేయి పడగలను, ‘‘సహస్ర ఫణ్‌’’ ‌పేరుతో, హిందీ అనువాదం చేసి జ్ఞానపీఠ అవార్డు పొందారు. 1968-74 మధ్య తెలుగు సాహిత్య అకాడమీ చైర్మన్‌ ‌గా ఉన్నారు. ఆయన రచనల్లో ప్రఖ్యాతి చెందినది ‘‘ఇన్‌సైడర్‌’’ అనే ఆత్మకథ. లోపలి మనిషిగా ఇది తెలుగులోకి అనువాద మయింది. 1983 లో స్పానిష్‌ ‌భాషలో ప్రసంగించి, అలీన దేశాల శిఖరాగ్ర సమావేశంలో, క్యూబా అధ్యక్షులు ఫిడేల్‌ ‌ను అబ్బుర పరిచిన గొప్పతనం ఆయనది. నిరాడంబరుడు, తన పిల్లలను సైతం ప్రధాని కార్యాలయానికి దూరంగా ఉంచిన నిజాయతీ పరులు. చివరిదశలో కోర్టుల చుట్టూ తిరగడానికి సొంత ఆస్తులను అమ్ముకున్న వ్యక్తి. నిజాం వ్యతిరేక పోరాట యుద్ధ తంత్ర నిపుణునిగా చివరకు స్వతంత్య్ర సముపార్జన దినం నాడు, 1947 ఆగస్టు 15 న కూడా అటవీ క్షేత్రంలో పోరాట క్రమంలోనే ఉన్న పోరాట యోధుడు. 2004 డిసెంబర్‌ 23 ‌న తుది శ్వాస వదిలా రాయన. పి.వి. స్మృత్యర్ధం హైదరాబాదులో భారత దేశంలోనే అతిపెద్ద ఫ్లై ఓవర్‌ ‌కు పి.వి. నరసింహారావు ఎక్స్‌ప్రెస్‌ ‌వే అని పేరుపెట్టారు. శంషాబాద్‌ ‌విమానాశ్రయం ప్రయాణీకులను దృష్టిలో ఉంచుకొని దీనిని నిర్మించి,19.10.2009 న ప్రారంభించారు. పివికి భారత రత్న అవార్డు ఇవ్వాలని సీఎం కేసిఆర్‌ ‌కేంద్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తునే ఉన్నారు. శత జయంతి ఉత్సవాలను ఏడాదిపాటు నిర్వహించాలని కేసిఆర్‌ ‌నిర్ణయించి, సీనియర్‌ ‌నేత కేశవరావు అధ్యక్షతన కార్యాచరణ ప్రణాళిక సిద్దం చేసి, అనురించడం ద్వారా కేసిఆర్‌, ‌తెలుగు జాతి మహోన్నత వ్యక్తికి తగిన గౌరవం ఇవ్వడం ముదావహం.
– రామ కిష్టయ్య సంగనభట్ల…
9440595494

Leave a Reply