Take a fresh look at your lifestyle.

నేడు నర్సాపూర్‌కు సీఎం కేసీఆర్‌ ఆరో విడత హరితహారానికి శ్రీకారం

ఆరో విడత హరిత హారం కార్యక్రమానికి సీఎం కేసీఆర్‌ ‌గురువారం మెదక్‌ ‌జిల్లా నర్సాపూర్‌లో శ్రీకారం చుట్టనున్నారు. అర్బన్‌ ‌ఫారెస్ట్‌లో మొక్కలు నాటి హరిత హారం కార్యక్రమాన్ని లాంఛనంగా ప్రారంభించనున్నారు. ముఖ్యమంత్రి పర్యటన నేపథ్యంలో మంత్రులు ఇంద్రకరణ్‌రెడ్డి, హరీష్‌రావు ఏర్పాట్లను పరిశీలించారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే మదన్‌రెడ్డి, మాజీ మంత్రి సునీతా లక్ష్మారెడ్డి, పీసీసీఎఫ్‌ ‌స్వర్గం శ్రీనివాస్‌, ‌కలెక్టర్‌ ‌ధర్మారెడ్డి, ఎస్పీ,డీఎఫ్‌వోలు పాల్గొన్నారు. కాగా,  రాష్ట్రంలో 24 శాతంగా ఉన్న అటవీ ప్రాంతాన్ని 33 శాతానికి పెంచాలనే లక్ష్యంతో సీఎం కేసీఆర్‌ ‌హరితహారం కార్యక్రమానికి రూపకల్పన చేశారు.

ఈ కార్యక్రమం ద్వారా 230 కోట్ల మొక్కలను నాటాలని లక్ష్యంగా నిర్ణయించుకోగా ఇప్పటి వరకు 182 కోట్ల మొక్కలను నాటడం జరిగింది.  ఈ కార్యక్రమానికి కొనసాగింపుగా ఆరో విడత హరితహారం కార్యక్రమాన్ని గురువారం సీఎం కేసీఆర్‌ ‌నర్సాపూర్‌ అటవీ పునరుద్ధరణ కార్యక్రమంలో భాగంగా ప్రారంభిస్తారని తెలిపారు. ఆరో విడత హరితహారంలో భాగంగా రాష్ట్రవ్యాప్తంగా 30 కోట్ల మొక్కలను నాటడం లక్ష్యంగా నిర్ణయించారు.

Leave a Reply