నేడు మదర్ థెరెసా 110వ జయంతి సందర్బంగా..
మదర్ థెరిసా అల్బేనియా దేశానికి చెందిన రోమన్ కాథలిక్ సన్యాసిని.26ఆగస్ట్ 1910న స్కోప్ట్ పట్ట ణంలో నికోలే మరియు బోజక్షుహ్యూ దంప తులకు జన్మిం చింది. 12 ఏళ్ల వయస్సు లోనే సామాజిక సేవ చేయాల ని నిర్ణయం తీసుకుని సన్యాసినిగా మార దామనుకుంటే చిన్న వయస్సు కావడంతో మారలేకపోయింది.నిజానికి ఆ వయస్సు పిల్లలు అందరూ ఆట పాటలతో అల్లరి చేస్తూ బాల్యాన్ని ఆనందంగా గడిపే వయస్సు. కానీ ఆ వయస్సు లోనే సేవ చేయాలనే ఆలోచన రావడం ఆమెకు సేవపై గల మక్కువను తెలియజేస్తున్నది.తన 18వ ఏట’’ నన్’’ గా మారి సేవలు అందించడం మొదలు పెట్టింది.1929వ సంవత్సరం లో భారతదేశానికి వచ్చి డార్జిలింగ్ లో ఉపాధ్యాయురాలిగా చేరింది. కానీ ఆ సమయంలో తన చుట్టు పక్కల పేదరికంతో దుర్భర జీవితాన్ని గడుపుతున్న అభాగ్యులను గుర్తించి వారికి సేవ చేయడమే పరమావధిగా భావించి తన పేరును సిస్టర్ థెరిస్సాగా మార్చుకున్నది. మొదటి ప్రపంచ యుద్ధం ఆమెను గొప్ప మానవతా వాదిగా మార్చింది. యుద్ధం సృష్టించిన పెను విధ్వంసం, ప్రజల్లో కలిగిన సంక్షోభం, గాయాల పాలైన వారి రోదనలు ఆమెను తల్లడిల్లేలా చేసాయి.యుద్ధం చేసిన గాయాలు చూసిన ఆమె లోని మానవత్వాన్ని రెట్టింపు చేసి వారందరిని ఆదుకునేలా చేసాయి. అసహాయ స్థితిలో గల వారందరికి చేయుతనందించింది.1950లో వాటికన్ అనుమతితో మిషనరీ అఫ్ చారిటీ ని ప్రారంభించి,1951లో భారతీయ పౌరసత్వమును స్వీకరించి ఎక్కువగా భారతీయులకే తన సేవలు అందించింది. ప్రపంచంలో ఎక్కడ విపత్తులు వచ్చినా, విధ్వంసాలు జరిగినా అక్కడికి వెళ్లి సేవలను అందించేది.భృణ హాత్యలను వ్యతిరేఖించింది. అభాగ్యుల కొరకు ,అనాధల కొరకు ,శరణార్థుల కొరకు 1952లో కలకత్తా లో ‘‘నిర్మల్ హృదయ’’ పేరుతో ఆశ్రమాన్ని నెలకొల్పి వారిని అక్కున చేర్చుకుంది.’’శాంతి నగర్’’ పేరుతో కుష్టు రోగులకు ఆసుపత్రి స్థాపించి,అందులో భోజనం మరియు వైద్య సదుపాయాలు కల్పించింది.
తన ఆత్మీయ స్పర్శ తో మరియు పలకరింపు తో వారిలో ఆత్మ స్థయిర్యాన్ని నింపేది.మిషనరీ ఆఫ్ చారిటీ ద్వారా 123 దేశాలలో 610కి పైగా సంస్థల ను స్థాపించి దాని ద్వారా 45 సంవత్సరాలకు పైగా సేవా కార్యక్రమాలను నిర్వహించారు. ముఖ్యంగా హెచ్ ఐ వి ,కుష్టు, క్షయ వ్యాధిగ్రస్తులకు మరియు వారి కుటుంబ సభ్యులకు ఉచిత వైద్య,భోజన వసతులు కల్పించి వారిని ఆత్మేయంగా చూసుకున్నారు.భారతదేశంతో పాటు ప్ర పంచం లోని అన్ని దేశాలలో పేదలకు,రోగ గ్రస్తులకు, అనాధలకు,మరణ శయ్య పై ఉన్నవారందరికి తన చారిటీ ద్వార సేవలు అందించి గొప్ప మానవతావాది గా,నిస్సహాయులకు అమ్మగా,శాంతి దూతగా అంతర్జాతీయ ఖ్యాతిని పొంది ‘‘మానవ సేవే మాధవ సేవ’’ గా భావించిన మదర్ థెరిస్సాకు ప్రపంచ దేశాలు ఎన్నో అవార్డులు మరియు బిరుదులను ఇచ్చి సత్కరించినవి. వాటిలో ముఖ్యంగా 1962లో పద్మశ్రీ మరియు రామన్ మెగాసేస్సే శాంతి బహుమతి,1972లో జవాహర్ లాల్ నెహ్రు అవార్డు,1980లో భారతదేశ అత్యున్నత పురస్కారమైన ‘‘భారతరత్న’’ అవార్డును పొందారు. పేదరికాన్ని తొలగించేందుకు తన జీవితాన్ని అంకితం చేసిన ఆమె కృషి కి గాను1979లో ‘‘నోబుల్ శాంతి బహుమతి’’పురస్కారాన్ని అందుకున్నారు.ప్రపంచ వ్యాప్తంగా ఆమె చేసిన సేవలు నిరుపమానం.ఎందరికో స్ఫూర్తి దాయకం. ప్రపంచం వ్యాప్తంగా మదర్ థెరిస్సా స్పూర్తితో ఎన్నో స్వచ్ఛంద సంస్థలు వెలిసి అనాధలకు, అభాగ్యులకు, పేదలకు, రోగ గ్రస్తులకు, శరణార్ధులకు సేవలను అందిస్తున్నవి.మదర్ థెరిస్సా జీవితం సమాజసేవకు ఒక కొత్త నిర్వచనాన్ని ఇచ్చింది. తను మరణించే వరకు కూడా పూర్తి స్థాయిలో సేవా కార్యక్రమాల్లో నిమగ్నమైనది. 19997 సెప్టెంబర్ 5న ఎనభైయేడు సంవత్సరాల వయసులో మదర్ థెరెసా మరణించింది ‘‘ప్రార్ధించే పెదవుల కన్నా సాయం చేసే చేతులు మిన్న ‘‘అనే మదర్ థెరెసా మాటలను మనమందరం మననం చేసుకుంటూ మదర్ థెరెసా చూపిన మానవత్వాన్ని దయ హృదయాన్ని ,సేవలను ఆచరించడమే ఆమెకు మనమివ్వగలిగే ఘనమైన నివాళి.
