Take a fresh look at your lifestyle.

మండిపోతున్న మామిడి పండ్ల ధరలు

వామ్మో మామిడి కాయల ధరలు బగ్గు మంటూ ఉన్నాయి…పచ్చడి మరియు తినే మామిడి కాయల ధరలు అధికంగా ఉండటం తో సామాన్యులు ఈ సారి మామిడి పండ్లు తినడం కష్టమే అనిపిస్తూ వుంది.వేసవి వచ్చిందంటే మామిడికాయ రుచులు నోరూరిస్తాయి. నిల్వ పచ్చళ్ల తయారీతో ప్రతీ ఇంట్లో మహిళలు బిజీగా మారిపోతారు. ప్రాంతాల వారీగా పచ్చళ్లకు రకరకాల పేర్లు ఉన్నా మామిడికాయ పచ్చడి అంటే అందరికీ ఇష్టమే.భోజనం చేసే సమయంలో అంచుకు మామిడి తొక్కు ఉంటే ఆ రుచే వేరుగా ఉంటుంది. కానీ అకాల వర్షాలతో ఈసారి మామిడి దిగుబడి తగ్గిపో యింది. దీంతో మామిడి కాయల ధరలు పెరిగాయి. మరోవైపు ఆవకాయ తయారీకి అవసరమయ్యే నూనెలు, ఇతర సరులకు ధరలు ఆకాశన్న ంటాయి. దీంతో జనంపచ్చడి నిల్వలు తగ్గించుకుంటున్నారు. అన్ని జిల్లాలలో, మండలాల్లో మామిడి కాయల అమ్మకాలు కాస్త తగ్గాయి. మామిడి కాయలను ముక్కలు చేయించుకోవడం, అందుకు కావాల్సిన సరుకుల కొనుగోళ్లతో మార్కెట్‌ ‌కళకళాడుతున్నా నిల్వ పచ్చడికి కావాల్సిన సరుకుల ధరలు చూసి జనం ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఏటా 5 కిలోల వరకు నిల్వ పచ్చడి చేసుకునే వారు కొంత మేరకు తగ్గించుకున్నారు. పచ్చళ్ల సీజన్‌లో ఈ సారి మామిడికాయలతోపాటు అందులోకి కావాల్సిన ధరలు భయపెడుతున్నాయి.

చిన్న సైజు పచ్చడి మామిడికాయ రూ.10 వరకు ధర పలుకుతోంది. కాస్త పెద్దరకం కాయ రూ.15 ఉంది. పచ్చడికి ఉపయోగించే కాయ ఒక్కటి ధర రూ.25 వరకు విక్రయిస్తున్నారు. పచ్చడి తయారీకి అవసరమయ్యే ఇతర సరుకుల ధరలు కూడా పెరిగాయి. మంచి బ్రాండెడ్‌ ‌పల్లి నూనె లీటర్‌ ‌ప్యాకెట్‌ ‌రూ.200, నువ్వుల నూనె కిలో రూ.340, కారంపొడి కిలో సాధారణ రకం రూ.280 ఉండగా పచ్చళ్లకు వాడే కారం కిలో ధర రూ.480 వరకు పలుకుతోంది. మెంతిపొడి కిలో రూ.140, ఆవాలు కిలో రూ.120, జీలకర్ర కిలో ధర రూ.300 వరకు ఉన్నాయి.విదేశాలకుపచ్చళ్లుజిల్లా నుంచి విదేశాల్లో ఉన్న తమ కుటుంబ సభ్యులకు కూడా మామిడి పచ్చడిని తయారు చేసి పంపిస్తుంటారు.

అక్కడ ఉన్నవారు కూడా ఎంతో ఇష్టాన్ని కనబరుస్తారు. విదేశాలకు పంపించడానికి ప్రత్యేకంగా పచ్చడి తయారు చేసి ఇచ్చే వారికి కూడా ఈ సీజన్‌లో ఉపాధి లభిస్తోంది. మామిడికాయ పచ్చడిపై కొన్ని అపోహలు ఉన్నా ఆరోగ్యానికి ఎంతో మంచిది. రోజు తగిన మోతాదులో పచ్చడి తింటే జీర్ణశక్తి పెరగడంతోపాటు మనిషి చలాకీగా ఉంటాడని ఆయుర్వేద వైద్యులు చెబుతున్నారు. ఆవాలు లేకుండా మామిడి పచ్చడి ఉండదు. ఆవాలకు ఉన్న గుణం జీర్ణశక్తిని పెంచుతుంది. వర్షాకాలం, చలికాలం వేడిని కలిగిస్తుంది. జలుబు రాకుండా చేస్తుంది. శరీరంలోని నీరసాన్ని పోగొట్టి ఆకలిని పుట్టిస్తుంది. మెంతులు ఆవకాయలో కలపడంతో శరీరానికి చలువ చేస్తుంది. మెంతులకు ఉన్న శక్తి మధుమేహ వ్యాధిని కూడా నివారిస్తుంది.

- Advertisement -

మామిడికాయలో 37 కేలరీల శక్తి, విటమిన్‌లలో ఏ, సీతోపాటు సోడియం అధికంగా ఉంటుంది. కోలెస్ట్రాల్‌ ‌లేకపోవడం వల్ల ఆరోగ్యానికి ఎలాంటి హానీ కలుగదు. ఒక కప్పు మామిడి పచ్చడిలో కొవ్వు 9 గ్రాములు, కార్బొ హైడ్రేడ్స్ 3 ‌గ్రాములు, కాల్షియం, ఐరన్‌ ‌వంటి పోషకాలు ఉంటాయి… పచ్చళ్లలో అగ్రస్థానం మామిడిది. వేసవికాలంలో ఎవరి ఇంట్లోనైనా మామిడి పచ్చడి గుమగుమలు వెదజల్లుతాయి. మార్కెట్‌లో మంచి రకం మామిడికాయలను తీసుకొని వాటిని ముక్కలుగా చేయాలి. సరైనా పాలలో ఉప్పు, కారం, ఆవాల పొడి, జీలకర్ర, మెంతుల పొడి కలిపి ముక్కలకు పట్టించి ఊరబెడుతారు. తర్వాత ఎల్లిపాయలు, ఆవాలు వేసి పోపు వేయాలి.ఆ తర్వాత పచ్చడి రెడీ అవుతూ వుంది.ఈ సారి తినే మామిడి కాయల ధరలు మండి పోతూ వున్నాయి. బంగణ పల్లి మామిడి ధర కీలో కి 120 నుండి 150 వరకు వుంది. తోతా పూరీ 100 రూపాయల వరకు వుంది.ఈ సారి ధరల పెరుగుదల వల్ల మామిడి కాయలు తినే అవకాశం లేకుండా పోయింది.

– కామిడి సతీష్‌ ‌రెడ్డి

జయశంకర్‌ ‌భూపాలపల్లి జిల్లా.

Leave a Reply