Take a fresh look at your lifestyle.

నేడు కేజీవ్రాల్‌ ‌ప్రమాణ స్వీకారం

Today Kejriwal Sworn oath

ఢిల్లీ ముఖ్యమంత్రిగా ఆమ్‌ ఆద్మీ పార్టీ అధ్యక్షుడు అరవింద్‌ ‌కేజీవ్రాల్‌ ఆదివారం ప్రమాణస్వీకారం చేయనున్నారు. రాంలీలా మైదానంలో నిర్వహించనున్న ఈ కార్యక్రమానికి ఏర్పాట్లు చురుగ్గా కొనసాగుతున్నాయి. ఇప్పటికే ఢిల్లీ ప్రజలను ప్రమాణస్వీకార కార్యక్రమానికి ఆప్‌ ఆహ్వానించింది. తాజాగా ఢిల్లీలోని అన్ని ప్రభుత్వ పాఠశాలల ప్రధానోపాధ్యాయులు, వైస్‌ ‌ప్రిన్సిపల్స్, ‌కరిక్యూలమ్‌ ‌కో ఆర్డినేటర్స్‌తో పాటు పలువురు ఉపాధ్యాయులను ఆహ్వానించారు.

కేజీవ్రాల్‌ ‌ప్రమాణస్వీకార కార్యక్రమానికి ప్రధాని నరేంద్ర మోడిని, ఎన్నికల ఫలితాల సందర్భంగా సోష•ల్‌ ‌మీడియాలో కోట్లాదిమందిని ఆకర్షించిన ఏడాదిబాలుడు లిటిల్‌ ‌మఫ్లర్‌మ్యాన్‌ ‌కూడా ఆహ్వానించారు.ఇతర రాష్ట్రాల సీఎంలను, ప్రముఖజాతీయనాయకులను ఎవరినీ పిలవలేదు.

Leave a Reply