Take a fresh look at your lifestyle.

నేడు జనతాకర్య్ఫూ..!

  • కొరోనా వైరస్‌పై పోరాటం
  • ఉదయం 7 గం।।ల నుంచి రాత్రి 9 వరకు
  • ప్రజలు స్వీయ నిర్బంధం
  • వ్యాపార, వాణిజ్య సంస్థలు, పెట్రోల్‌ ‌బంకులు మూసివేత

భారత గడ్డ మీది నుంచి కొరోనా వైరస్‌ను తరిమికొట్టేందుకు ప్రధాని నరేంద్ర మోదీ ఇచ్చిన పిలుపు మేరకు జనతా కర్ఫ్యూ పాటించడానికి తెలంగాణ సిద్ధమైంది. ఒక ప్రదేశంలో కరోనా వైరస్‌ 12 ‌గంటల పాటు సజీవంగా ఉంటుంది. మనం పాటిం• 14 గంటల కర్ఫ్యూ కారణంగా కరోనా మనుగడ సాగించిన, సాగిస్తున్న బహిరంగ ప్రదేశాల లేదా పాయింట్లు 14 గంటల వరకు తాకే అవకాశం ఉండదు. ఈ 14 గంటల తరువాత ఇది వైరస్‌ ‌గొలుసును విచ్ఛిన్నం చేస్తుంది. దీంతో మనకు లభించేది సురక్షితమైన దేశం. జనతా కర్ఫ్యూ పిలుపు వెనక ప్రధాని మోదీ అసలు ఉద్దేశ్యం ఇదే. ఆదివారం ఉదయం 7 గంటల నుంచి రాత్రి 9 గంటల వరకు జనతా కర్ఫ్యూ పాటించాలని ప్రధాని మోదీ పిలుపునివ్వగా దానికితోడు రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్‌ ఆదివారం ఉదయం 6 గంటల నుంచి సోమవారం ఉదయం 6 గంటల వరకు అందరూ ఇళ్లలోనే ఉండాలనీ, ఎట్టి పరిస్థితుల్లోనూ బయటికి రావొద్దని పిలుపునిచ్చారు. జనతా కర్ఫ్యూ పిలుపుతో ప్రజలలో ఈ వైరస్‌ ‌వ్యాప్తి, దీని నివారణకు తీసుకోవాల్సిన ముందు జాగ్రత్తలపై అవగాహన కలిగించడం సాధ్యమవుతుంది.

ఈ కారణంగా ప్రజలు తమ నివాసాల నుంచి బయటికి రాకుండా దూరంగా ఉంటారు కాబట్టి ఈ వైరస్‌ ఒకరి నుంచి మరొకరికి విస్తరించకుండా కట్టడి చేయడం వీలవుతుంది. ఇందులో భాగంగానే ప్రజలు బయటికి రాకుండా నిరోధించేందుకు ఆర్టీసీ బస్సులు, మెట్రో రైళ్లు కూడా నిలిపివేస్తున్నట్లు సీఎం ప్రకటించారు. దీంతో రాష్ట్రంలో ప్రజా రవాణా వ్యవస్థ పూర్తిగా స్థంభించనుంది. ఇప్పటికే ప్రైవేటు బస్సులను శనివారం రాత్రి నుంచే నిలిపివేస్తున్నట్లు నిర్వాహకులు ప్రకటించారు. దీనికితోడు విద్య, వ్యాపార, వాణిజ్య సంస్థలన్నీ స్వచ్చందంగా మూసి ఉంచనున్నారు. జనతా కర్ఫ్యూలో భాగంగా బ్యాంకులు సైతం మూతపడనున్నాయి. అలాగే, ఆదివారం వైన్స్ ‌షాపులను మూసివేయాలని స్వచ్చందంగా నిర్ణయం తీసుకున్నట్లు సంబంధిత అసోసియేషన్‌ ‌ప్రకటించింది. మరోవైపు నిత్యావసర సరుకులు, మందుల దుకాణాలు మినహా మరే ఇతర సంస్థలు పనిచేయకూడదని సీఎం కేసీఆర్‌ ఇచ్చిన పిలుపుమేరకు శనివారం రోజంతా మార్కెట్లలో ఎడతెగని రద్దీ కనిపించింది. ముఖ్యంగా కూరగాయల మార్కెట్లకు ప్రజలు క్యూ కట్టారు. అయితే, ప్రజలకు అవసరమైతే నిత్యావసర వస్తువులను ప్రభుత్వమే పంపిణీ చేస్తుందని సీఎం కేసీఆర్‌ ‌ప్రకటించడంతో ప్రజలు కాస్తంత ఊపిరిపీల్చుకున్నారు.

Leave a Reply

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More

Privacy & Cookies Policy