Take a fresh look at your lifestyle.

నేడు ప్రపంచ వితంతువుల దినోత్సవం

వితంతువుల పట్ల వివక్ష ఇంకెన్నాళ్ళు..

వితంతు అనే పదం అనాగరికమైనది. ఈ పదం వినడానికి మనకే ఎంతగానో బాధ వుంటుంది. అలాంటిది వితంతువుల జీవితాలు ఎంత దుర్భరంగా వుంటాయో వేరే చప్పక్కర్లేదు. ఇవాల్టికి కూడా ఎంతో మంది వితంతువులు కుటుంబ పరంగా, సామాజిక పరంగా వివక్షతకు గురౌతున్నారు. ఎంతోమంది సంఘ సంస్కర్తలు వితంతువుల హక్కుల కోసం అలుపెరుగని కృషిచేశారు. అందులో భాగంగా తమ ఆస్తులను, జీవితాలను తృణపాయంగా త్యాగం చేసిన మహనుభావుల కృషిఫలితంగా దుర్మార్గమైన సతి సహగమానం లాంటి దురాచారాలు రూపుమాపబడ్డాయి. అయినా వారు ఇంకా అనేక హత్యలు..అత్యాచారాలకు, చిత్రహింసలకు గురి అవుతునే వున్నారు. ఐక్యరాజ్యసమితి నిర్వహించిన సర్వేలో 29 శాతం మంది చీత్కరాలకు, బలాత్కారాలకు గురి అవూతూ తీవ్ర మానసిక క్షోభ తట్టకోలేక తనువులు చాలిస్తున్నారు. ప్రపంచవ్యాప్తంగా 2016 నాటికి 25 కోట్ల 90 లక్షల మంది వితంతువులు వుండగా మనదేశంలో 4 కోట్ల 60 లక్షల మంది ఉన్నారు. అభివృద్ధి చెందిన దేశాలలోకంటే అభివృద్ధి చెందుతున్న, బీద దేశాల వితంతువులు మూఢనమ్మకాలతో దుర్భర పరిస్ధితులను ఎదుర్కుంటున్నారు. 1856లో తొలి వితంతు వివాహం కలకత్తాలో జరిగింది. వితంతు వివాహన్ని చట్టబద్ధం చేసి ఒక చట్టాన్ని 1856లో ఈశ్వరచంద్ర జారిచేయించారు. తన కుమారుడికి వితంతువుతో పెళ్ళి జరిపించడం ద్వారా నూతన ఒరవడికి నాంది పలికారు. ఆ తర్వాత అటువంటి పెళ్ళిళ్లకి అయ్యే ఖర్చును ఆయన భరించేవారు.
వితంతు పునారావాస, పునర్వివాహ సంఘాలని స్థాపించి 1881 డిసెంబర్‌ 11‌న రాజమండ్రిలో వీరేశలింగం పంతులు వితంతు పునర్వివాహన్ని జరిపించారు. వీరేశలింగం పంతులు చేస్తూన్న కృషిని వార్తా పత్రికలలో చూసి సుదూర ప్రాంతాల నుంచి అనేక మంది వితంతువులు ఆయన దగ్గరకి వచ్చి పునర్వివాహలు చేసుకునేవారు.

1855 లో కాశిభాయి అనే బాల వితంతువు ఫూలే నెలకొల్పిన బాల్యహత్య ప్రతిబంధక గృహంలో శివువును కని వదిలివెళ్లి పోయింది. ఆ శిశువునే ఫూలే దంపతులు దత్తత తీసుకొని యశ్వంత్‌ అనే పేరు పెట్టుకొని పెంచుకున్నారు. ఇంటా బయట మగ మృగాలు, వావివరుసలు మరిచి వితంతువులపై హత్య, అత్యాచారం చేసేవాళ్ళు. అలాంటి అభాగ్యురాళ్ళు ఆత్మహత్యలకో, భూ•ణహత్యలకో పాల్పడవద్దు అని ఫూలే దంపతులు కరపత్రాలు, పోస్టర్ల ద్వారా విస్త•త ప్రచారం చేసేవాళ్ళు. పుట్టింటికి ఆహ్వనించినట్లుగా మా గృహనికి రండి..పురుడు పోసుకొని శిశువును మాకు వదిలి వెళ్ళండి. భూ•ణ, ఆత్మహత్యలకు పాల్పడకండి అంటు వారు చేసిన ప్రచారానికి స్పందించిన అనేక మంది నిర్భయంగా ముందుకు వచ్చేవాళ్ళు. విధివంచితులు అయిన వితంతువులు సాంఘిక దురాచారాలకు గురయ్యారు. ఇప్పటికి అదే పరిస్థితి కొనసాగుతుంది. మరణం ఎవరికైనా సహజమే. కాని భర్త చనిపోయినా స్త్రీని ముండ్రాలిని చేసిన సమాజం ఆమెకు అనేక ప్రతిబంధకాలను కల్పించింది. మరణించిన తమ భర్తల ఆస్థిని అనుభవించడం గగనమైపోతున్నది. భర్త బంధువుల నుండి, అత్తమామలు, ఆడబిడ్డలు నుండి అనేక ఇబ్బందులను ఎదుర్కుంటున్నారు. జీవితాంతం తోడు వుంటాడు అనుకున్న భర్తల ఆకాల మరణంతో కుంగుబాటుకు గురై దు:ఖంలో వున్న మహిళలు పుట్టింటి నుండి మెట్టినింటి వరకు అడుగుఅడుగున అవమానాలు ఎదుర్కొంటున్నారు.

- Advertisement -

పిల్లల పెంపకంలో స్త్రీ, పురుష వివక్ష కొనసాగుతున్న పిత్రుస్వామిక వ్యవస్థలో భార్య చనిపోయిన, పిల్లలువున్న కొడుకులకు మరో వివాహం చేయడానికి సగర్వంగా ముందుకు వస్తున్న తల్లిదండ్రులకు భర్త చనిపోయిన భవిష్యత్తు శూన్యం అయి వున్న కూతురుకు మరో వివాహం చేయాలనే సోయి వుండదు. ఎవరన్నా ఆమాట అంటే అదేదొ తప్పుగా చూస్తూ మరో వివాహం చేస్తే మా పరువేంకావాలి అని తమకు తాము స్వాంతన చేకూర్చుకునే మాటలు మాట్లాడుతారు. భర్త చనిపోయిన కూతురు ఎదురొస్తేనే అపశకునం అని సూటిపోటి మాటలు అంటున్నారు. పుటింట్లోనే ఇలాంటి వివక్షకు గురిఅవుతున్న వితంతువులకు అత్తవారింట్లో వుండే పరిస్థితి ఎలా వుంటుందో ఊహించుకోవచ్చు. తమ ఆడబిడ్డల పెళ్ళిలలో సొంతపిల్లల వివావాది కార్యక్రమాలలో వారు దూరాదూరంగానే ఉండవల్సిన దౌర్భగ్య పరిస్ధితులు నెలకొనివున్నాయి.

ప్రపంచవ్యాప్తంగా వితంతువుల సంక్షేమం కోసం అలుపెరుగాని పోరుసల్పిన ‘‘లుంబా పౌండేషన్‌’’ ‌చేసిన ప్రచారం ఫలితంగా 2011లో ఐకరాజ్యసమితి జూన్‌ 23 ‌ను ప్రపంచ వితంతువు రోజుగా గుర్తించింది. ఈ ఫౌండేషన్‌ ‌ప్రపంచవ్యాప్తంగా ఆ దిశగా కృషిచేస్తూ కోట్లాది మంది వితంతువులలో వెలుగులు నింపించి భారతదేశంలో హిందూజా ఫౌండేషన్‌తో కలిసి 13 రాష్ట్రాలలో వితంతువుల వికాసం కోసం అనేక కార్యక్రమాలు చేస్తున్నది. భారతీయ మూలాలు వున్న లార్డ్‌లుంబా లండన్‌లో తన తండ్రి జాగిరిలాల్‌ ‌చనిపోయిన జూన్‌ 23 1954‌న అతని తల్లి పుష్పవతి లుంబా దినస్థితిని చూసి చలించి ఆ రోజు నుండే వితంతువల అభివృద్ధి కోసం లుంబాషౌండేషన్‌ ఏర్పాటు చేసి ఆ దిశగా కృషిచేస్తు సత్ఫలితాలను సాధిస్తున్నాడు. కెనడా కేంద్రంగా సోపర్‌ ‌సంస్ధ ద్వారా అనేక సామాజిక కార్యక్రమాలను నిర్వహిస్తున్న బాలవికాస స్వచ్ఛంద సేవా సంస్థ సామాజిక రుగ్మతలపై, అభివృద్ధిపై తనదైన ముద్రవేసింది. భారతదేశంలో ఈ సంస్థ 2006లో వితంతువుల వివక్షతను దూరం చేయడం కోసం అనేక కార్యక్రమాలను చేస్తున్నది. 6 రాష్ట్రాలలోని 6 వేల గ్రామా)లో 40 లక్షల మంది వితంతువుల జీవితాలలో మార్పు తీసుకువచ్చింది. బాలవికాస పనిచేస్తున్న ఏరియాలలో చెప్పుకోదగ్గ మార్పు తీసుకవచ్చింది. బాలవికాస పనిచేస్తున్నా ప్రాంతాలలోని వితంతువులు మూఢనమ్మకాలను వ్యతిరేకిస్తున్నారు. విందు, వినోదాలు, పేరంటాలలో సగర్వంగా పాల్గొంటున్నారు. ఎలాంటి జంకుబొంకు లేకుండా పునర్వివాహలు చేసుకోడానికి ముందుకు వస్తున్నారు. వితంతువుల రక్షణ చట్టం తేవడానికి ఈ సంస్థ అలుపెరుగని పోరు సలుపుతుంది.

వితంతువులను వివాహం చేసుకోవడానికి ముందుకు వచ్చే వారికి కల్యాణలక్ష్మిని రెండితలుగా ఇవ్వాలని డిమాండ్‌ ‌చేస్తున్నది. అలాగే కట్టుదిట్టమైన రక్షణ చర్యలు చెప్పట్టాలని ఎప్పటినుండో డిమాండ్‌ ‌చేస్తున్నారు. బాలవికాస ముందుకు తెచ్చిన చాలా వాటిపట్ల సానుకూలంగా స్పందిస్తున్న ప్రభుత్వాలు వాటిని చట్టరూపంలో తేవడానికి మీనమేషాలు లెక్కిస్తున్నవి. ఈ పరిస్ధితి మారాలి. అందరిలాగానే వారికి కూడా సమానహక్కులు కల్పించాలి. మూఢనమ్మకాలకు దూరంగా తలెత్తుకొని బ్రతికే విధంగా పరిస్థితులు కల్పించాలి. వితంతువులకు అత్తవారిటింలో ఆస్థుల పంపకంలో వారికి ఎదురువుతున్న ఇబ్బందులను పరిష్కరించడానికి ప్రభుత్వం కఠినచర్యలు తీసుకోవాలి. వితంతువులుగా ఆత్మన్యూనతా భావంతో కాకుండా ఆత్మగౌరవంతో సగర్వంగా బ్రతికేలా చర్యలు తీసుకోవాలి. కుటుంబ పరంగా, సామాజిక పరంగా, లైగింక వేధింపులకు గురిచేసే వారిపై కఠిన చర్యలు తీసుకోవాలి. అన్ని శుభకార్యాలలో వారు అందరిలా పాల్గొనేలా చర్యలు తీసుకోవాలి.
పబ్బు శ్రీనివాస్‌, ‌సీనియర్‌ ‌జర్నలిస్టు, 7396947408

Leave a Reply