Take a fresh look at your lifestyle.

అసమాన ప్రపంచంలో మానసిక ఆరోగ్యం

నేడు  ప్రపంచ మానసిక ఆరోగ్య దినోత్సవం
ఇప్పుడు ప్రపంచమంతా కోవిడ్‌-19‌తో పోరాడుతోంది. భౌతిక దూరం, వ్యాధి చికిత్స, వ్యాక్సిన్‌ ‌పట్ల అనిశ్చితి, ఆర్థిక చిక్కులు తదితర అంశాలు ప్రజల్లో తీవ్ర ఒత్తిడి, ఆందోళన కలిగిస్తున్నాయి. ఇవన్నీ ప్రజల మానసిక ఆరోగ్యాన్ని మరింత దెబ్బతీస్తున్నాయి. ప్రపంచ ఆరోగ్య సంస్థ గణాంకాల ప్రకారం ప్రపంచ వ్యాప్తంగా 45 కోట్ల మంది వేర్వేరు మానసిక ఆరోగ్య సమస్యలతో బాధపడుతున్నారని అంచనా. ప్రపంచంలో ప్రతి 40 సెకన్లకు ఒకరు ఆత్మహత్యకు పాల్పడుతున్నారు. అంతకు 20 రెట్లు మంది ఆత్మహత్యా ప్రయత్నం చేస్తున్నారు. ఏటా ప్రతి 10 మంది పిల్లలలో ఒకరు, ప్రతి నలుగురు పెద్దలలో  ఒకరు కొత్తగా మానసిక ఆరోగ్య సమస్యలు ఎదుర్కొంటున్నట్టు ఓ అంచనా.

మనోవేదనతో సతమతం
ఆర్థిక కష్టాలు ఉండవు అయినా ఇంకా ఏదో కావాలన్న తపన నిద్రపట్ట నీయదు. కుటుంబ సభ్యులంతా ఆనందంగా ఉన్నా,  ప్రతి ఒక్కరిలో తెలియని ఆవేదన, విద్యార్థి చక్కగా చదువుతాడు. పరీక్షలంటే భయం, తెలివితేటలు పుష్కలంగా ఉన్నా సమస్య వస్తే ఎదుర్కొనలేకపోవడం. ఆరోగ్యంగా ఉన్నా ఒంటరిగా బయటకు వెళ్లేందుకు భయపడడం. పెద్దలు, అధికారులు మందలిస్తే మానసికంగా కుంగిపోవడం, ఇలా రోజు రోజు కు పెరుగుతున్న మానసిక సమస్యలతో సతమతమవుతున్నారు.

అసమాన ప్రపంచంలో మానసిక ఆరోగ్యం
ప్రతి సంవత్సరం అక్టోబర్‌ 10 ‌ప్రపంచ వ్యాప్తంగా మానసిక ఆరోగ్య దినోత్సవం సందర్భంగా ప్రజలకు అవగాహన సందర్భంగా ప్రధాన మైన ఉద్దేశ్యంతో ఒక ప్రత్యేక థీమ్‌తో గుర్తించబడుతుంది, ఈ సంవత్సరం, ‘అసమాన ప్రపంచంలో మానసిక ఆరోగ్యం’ అనే థీమ్‌ ‌ప్రపంచ మానసిక ఆరోగ్య ఫెడరేషన్‌ ‌గుర్తించింది, ‘అసమాన ప్రపంచంలో మానసిక ఆరోగ్యం’ అనేది ‘ఉన్నవారు’ మరియు ‘లేనివారి’ మధ్య అంతరాన్ని తగ్గించడంపై దృష్టి పెడుతుంది. మరియు మానసిక ఆరోగ్య సమస్య ఉన్న వ్యక్తుల సంరక్షణలో నిరంతర అవసరం కొనసాగుతోంది.

ప్రపంచ మానసిక ఆరోగ్య దినోత్సవం సందర్భంగా ప్రపంచ మానసిక ఆరోగ్య సమాఖ్య అసమాన ప్రపంచంలో మానసిక ఆరోగ్యం

థీమ్‌ ‌ద్వారా  75% నుండి 95% వరకు మధ్య మానసిక రుగ్మతలతో ఉన్న వ్యక్తులతో మానసిక ఆరోగ్య సేవలను పొందడంలో గాని, అందించడంలో గాని  అసమానంగా ఉందని చైతన్యం చేయడానికి లక్ష్యంగా పెట్టుకుంది. భారత్‌ ‌వంటి దేశాలు మానసిక ఆరోగ్య సేవలను పూర్తి స్తాయిలో అందించలేకపోతున్నాయి. మానసిక వ్యాధితో బాధపడుతున్న చాలా మంది వ్యక్తులు మరియు సరైన చికిత్సను పొందలేరని ఇది పేర్కొంది. వారి కుటుంబాలు మరియు సంరక్షకులతో కలిసి వివక్షను అనుభవిస్తూనే ఉన్నారు అని తన నివేదికలో వెల్లడించింది.

ప్రపంచ మానసిక ఆరోగ్య దినోత్సవం యొక్క ప్రాముఖ్యత
కోవిడ్‌ -19 ‌మహమ్మారి ప్రజల మానసిక ఆరోగ్యంపై తీవ్ర  ప్రభావాన్ని చూపిందని ప్రపంచ ఆరోగ్య సంస్థ తీవ్రాస్తాయిలో ఆందోళన వ్యక్తం చేస్తుంది. ఆరోగ్యం సిబ్బంది, ఫ్రంట్‌లైన్‌ ‌కార్మికులు, విద్యార్థులు, ఒంటరిగా నివసించే వ్యక్తులు మరియు ఇంతకు ముందే మానసిక ఆరోగ్య పరిస్థితులు ఎదుర్కొంటున్న వారితో సహా కొన్ని సమూహాలు తీవ్ర ప్రభావితమయ్యాయని పేర్కొంది. మానసిక సంబంధిత రుగ్మతల కొరకు సేవలు గణనీయంగా దెబ్బతిన్నాయి. మే 2021 లో జరిగిన ప్రపంచ ఆరోగ్య అసెంబ్లీ సందర్భంగా, ప్రపంచవ్యాప్తంగా ఉన్న ఆయా దేశాల ప్రభుత్వాలు అన్ని స్థాయిలలో నాణ్యమైన మానసిక ఆరోగ్య సేవలను పెంచాల్సిన అవసరాన్ని గుర్తించాయి.

మానసిక ఆరోగ్యాన్ని కాపాడుకోవాలి
సమస్యను గుర్తించండి:
మనస్సు యొక్క ఆలోచన ఒక నైరూప్య భావన మరియు ఈ రోజు మన ఆలోచనల గురించి ఆలోచించడానికి అనుమతిస్తుంది. మేము పాత అవగాహనలకు మించి అభివృద్ధి చెందుతున్నాము మరియు మానసిక ఆరోగ్యం యొక్క కళంకాన్ని విడుదల చేస్తున్నాము, తద్వారా మనం దానిని సరిగ్గా నిర్ధారించి, మనల్ని మనం జాగ్రత్తగా చూసుకోవచ్చు. మానసిక ఆరోగ్య సమస్యల నుండి భారం మరియు భయాన్ని తొలగించడంతో, యుద్ధం గణనీయంగా సులభం అవుతుంది.

బాధను పంచుకోండి:
ఈ రోజు మీరు ఏమి చేస్తున్నా, మీరు ఒంటరిగా లేరని మీకు గుర్తు చేస్తుంది. చాలాసార్లు మనం మాత్రమే కష్టకాలం ఎదుర్కొంటున్నామని అనుకుంటాం. ఇతర వ్యక్తులు దాని గుండా వెళ్లారని మరియు మరొక చివరకి చేరుకున్నారని తెలుసుకోవడం ఉత్సాహాన్నిస్తుంది. మీరు మీ స్వంత బాధను అధిగమించవచ్చని ఇది మీకు గుర్తు చేస్తుంది.

సరైన చికిత్స:
మానసిక ఆరోగ్యంపై మన అవగాహన పెరుగుతున్న కొద్దీ, సరైన చికిత్సను పొందే సామర్థ్యం పెరుగుతుంది. సరైన థెరపిస్ట్, ‌సైకాలజిస్ట్ ‌మరియు అవసరమైన కౌన్సెలింగ్‌, ‌సైకోథెరపీలు, మందులతో, మీరు మరింత సమర్థవంతమైన స్థాయిలో పనిచేయగలరు. మనం ఎంత ఎక్కువ అంగీకరిస్తున్నామో మరియు పరిశోధన మరియు మానసిక ఆరోగ్య సంరక్షణలో ఎక్కువ నిధులు సమకూర్చబడతాయి, ప్రపంచ ప్రభావం ఎక్కువగా ఉంటుంది.

ఆప్తులతో మానసిక ఆరోగ్యం:
సాధారణ భావోద్వేగాలు, అనుభూతులు పొందుతూ అవసరమైనప్పుడు నియంత్రించుకుంటూ దైనందిన జీవితంలో ఎదురయ్యే సమస్యలను ఎదుర్కొనే శక్తి కలిగి జీవితం గడుపుతుంటే మానసికంగా ఆరోగ్యంగా ఉన్నట్టే. మంచి ఆరోగ్యం, సరిపడినంత నిద్ర, వ్యాయామం, యోగ, కుటుంబం, స్నేహితులతో మంచి బంధాలు కలిగి ఉండడం ద్వారా మానసిక ఆరోగ్యాన్ని మనం కాపాడుకోవచ్చు. ఒత్తిడి, కుంగుబాటు, భయం లేదా మరేదైనా మానసిక సమస్య ఎదురైనప్పుడు అందుబాటులో ఉన్న మానసిక ఆరోగ్య నిపుణులను కలిస్తే సమస్య తీవ్రం కాకుండా కాపాడుకోవచ్చు

కౌన్సెలింగ్‌ ‌తో విముక్తి:
మానసిక సమస్యలు ఎదుర్కొనేవారి సంఖ్య ఇటీవల కాలంలో విపరీతంగా పెరుగుతోంది. ఒక్కొక్కరు ఒక్కో సమస్యతో మానసిక వేధనకు గురవుతున్నారు. మానసిక సమస్యకు సకాలంలో పరిష్కారం పొందాలి. అవసరమైతే చికిత్స చేయించుకోవాలి. లేదంటే ఆరోగ్యం దెబ్బతింటుంది. ప్రతి ఒక్కరు ఒత్తిడికి దూరం కావాలి. ప్రశాంత జీవనాన్ని అలవర్చుకోవాలి. ప్రశాంతంగా ఉండడానికి ప్రయత్నించాలి. వ్యాయామం, యోగ వంటివి చేయడం అలవాటు చేసుకోవాలి. ఆరోగ్యంగా జీవించడానికి పౌష్టిక ఆహారాన్ని తీసుకోవాలి.
ఈ రోజు ప్రపంచాన్ని ప్రభావితం చేస్తున్న మానసిక ఆరోగ్య సమస్యల కోసం కలిసి రావడానికి మరియు కలిసి పనిచేయడానికి ఒక అవకాశాన్ని అందిస్తుంది మరియు ప్రజలు మంచి మానసిక ఆరోగ్యాన్ని ఆస్వాదించడానికి, జీవించడానికి ఒక మార్గాన్ని నిర్దేశించుకోవాల్సిన ఆవశ్యకత ఉంది.
– డా. అట్ల శ్రీనివాస్‌ ‌రెడ్డి,  రిహాబిలిటేషన్‌ ‌సైకాలజిస్ట్  ‌ఫ్యామిలీ కౌన్సెలర్‌, 9703935321

Leave a Reply