Take a fresh look at your lifestyle.

నేడు ప్రపంచ మానవతా దినోత్సవం.. మరింత మానవత్వం కావాలి

“మనిషి స్వార్ధపరుడు,ద్రోహం,ద్వేషం,హింస ,క్రౌర్యంల మృగప్రాయ స్వభావం తో ఉంటాడు, నాగరికత తన వెంట అనేక అమానవీయ అపశ్రుతులను తీసుకోవచ్చి విలువలు లేని నిస్సారమైన సమాజాన్ని ఏర్పాటు చేసింది అనే అభిప్రాయాలను పటా పంచలు చేస్తూ మైత్రి, ప్రేమ, కారుణ్యం, ఋజువర్తన లక్షణాల నూతన మానవ సృష్టి సమాంతరంగా జరుగుతూనే ఉంది. ఈ కృషిని  కొనసాగించడం, వేగవంతం చేయడం మన సంస్కృతిలో నిత్య కృత్యం కావాలి. నిజజీవిత హీరోలను కాపాడుకోవాలి. ప్రభుత్వాలు, కార్పొరేట్లు మానవ జీవన నైతిక సౌందర్యం పరుల కష్టాల పట్ల చలించినప్పుడే, సహానుభూతి చెందినప్పుడే ఉందనే సత్యాన్ని గ్రహించాలి.యుద్ధాలు,మానవ దురాశ వలన కలిగే ప్రకృతి విపత్తులు  తరగాలి, శాంతి, సౌభాగ్యాలు మహామ్మారులు లాగా ప్రబలాలి. ఈ వెలుగులో ప్రజాస్వామిక వాదులు, విద్యావేత్తలు, పౌర సమాజం పనిచేయడమే అమరులైన మానవత్వ పుష్పాలకు మనం ఇచ్చే నిజమైన నివాళి.”

మానవజాతి చరిత్రను 24 గంటల కాలంగా భావిస్తే అందులో 23 గంటల 45 నిమిషాలు సంతోష జాడలు లేని కేవలం కష్టాలే జీవితంగా గడిపారు. 1800 సంవత్సరం వరకు కూడా మూడొంతుల జనాభా ప్రభువులకి వెట్టి చాకిరి చేసేవారు.90%ప్రజలు భూములలో పనిచేశారు.80%ప్రజలు దుర్భర దారిద్య్రంలో గడిపారు.చివరి 15 నిమిషాల నుండి నాగరికత పౌర సమాజం ప్రారంభమయ్యింది. బానిసత్వం రద్దు కాబడింది. పేదరికము తగ్గింది.సంక్రామిక వ్యాధులను వాటిని తగ్గించే టీకాలు కణుగోనబడ్డాయి.మధ్య యుగాల్లో ప్రభువుల రాజ్య విస్తరణ,సంపద పై అధికారం కోసం జరిగిన యుద్హాలలో ప్రపంచ జనాభాలో 12% ప్రాణాలు కోల్పోయారు.మనం అనుకునే ఆధునిక  నాగరికత సమాజ ప్రస్థానంలో జరిగిన ప్రపంచ యుద్దం ×, ×× లలో ప్రపంచ జనాభాలో 1.3% ప్రజలు ప్రాణాలు కోల్పోయారు. 20 శతాబ్దంలో ఇప్పుడు కొనసాగుతున్న21 శతాబ్దంలో తలెత్తిన ప్రకృతి విపత్తుల సమయంలో,వ్యాధి మహామ్మారులు ప్రబలిన కాలంలో ,సామ్రాజ్యవాద జాతుల విముక్త ,దేశాల విముక్త పోరాటంలో,అలాగే మతోన్మాద కార్యక్రమాలలో  అపార మానవ ప్రాణ నష్టం జరుగుతున్నది. బాధిత ప్రజలకు,యుద్ధ రంగ క్షతగాత్రులకు మానవత్వం నిలువెత్తు మూర్తీభవించిన స్వచ్ఛంద సంస్థలు వ్యక్తుల సహాయక చర్యలతో ఎంతో ఉపశమనాన్ని కలిగిస్తున్నది.అత్యంత సాహసిక సహాయ చర్యలతో లక్షలాది ప్రజల ప్రాణాలు కాపాడబడుతున్నాయి.ఈ రకమైన వ్యక్తులను ఉన్నతీకరణ చెందిన సమున్నత స్పందన గల నూతన మానవులుగ పరిగణించ బడుతున్నారు. ఇతరులకు సహాయం చేయడానికి తమ జీవితాలను అంకితం చేసిన మానవతావాదులను స్మరించడం కోసం ప్రతి ఏడు ఐక్యరాజ్యసమితి ఆగస్ట్ 19 ‌ను ప్రపంచ మానవత్వ దినోత్సవంగా నిర్వహిస్తున్నది.ఇరాక్‌లోని బాగ్దాద్‌లోని కెనాల్‌ ‌హోటల్‌పై 2003 ఆగస్టు 19 న జరిగిన బాంబు దాడిలో  ఇరాక్‌లో సహాయక చర్యలు చేపడుతున్న బ్రెజిల్‌ ‌మానవతావాది సెర్గియో వియెరాడి మెల్లోతో సహా 22 మంది మరణించారు. వీరి జ్ఞాపకార్ధం 2009 లో ఐక్యరాజ్యసమితి సర్వసభ్య సమావేశం ఈ రోజును ప్రపంచ మానవతా దినోత్సవంగా అధికారికం చేసింది.మేము మానవతా శ్రామికులం,ప్రజలకు సహాయం చేస్తున్న ప్రజలు,మేము ఉన్నాం అనే ఇతివృత్తాలతో చైతన్య అవగాహన కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు.

సంక్షుభిత కల్లోల సమయాలలో  సహాయక,సపర్యలు చేపడుతున్న ఈ మానవతా దివిటీలపై అక్కడక్కడ ఉన్మాద మూకలు దాడులకు తెగబడుతున్నాయి.2019 లో 483 మంది సహాయక కార్మికులపై దాడి చేశారు: మొత్తం 277 వేర్వేరు సంఘటనలలో 125 మంది మరణించారు, 234 మంది గాయపడ్డారు మరియు 124 మంది కిడ్నాప్‌ ‌చేయబడ్డారు. సిరియాలో ఎక్కువ దాడులు జరిగాయి, తరువాత దక్షిణ సూడాన్‌, ‌డెమొక్రాటిక్‌ ‌రిపబ్లిక్‌ ఆఫ్‌ ‌కాంగో, ఆఫ్ఘనిస్తాన్‌, ‌సెంట్రల్‌ ఆ‌ఫ్రికన్‌ ‌రిపబ్లిక్‌ , ‌యెమెన్‌ ‌మరియు మాలి ఉన్నాయి.వైద్య సహాయం అందిస్తున్న ఆరోగ్య కార్యకర్తలపై 1009 కి పైగా దాడులు జరిగాయని ప్రపంచ ఆరోగ్య సంస్థ ప్రకటించింది. ఈ దాడులలో ఆరోగ్య సంరక్షణ కార్మికులు 200 మంది మరణించారు. 2019 లో ప్రపంచవ్యాప్తంగా మానవతా సహాయం అనేక రకాలుగా  అందించబడింది.28.9 మిలియన్ల పిల్లలకు ప్రపంచవ్యాప్తంగా మీజిల్స్‌కు టీకాలు వేశారు.6.9మిలియన్ల తీవ్రమైన పోషకాహార లోపంతో గర్భిణీల, మరియు పాలిచ్చే మహిళలను ప్రపంచవ్యాప్తంగా చికిత్స కోసం చేర్చారు. 32.2 మిలియన్ల మందికి  వంట మరియు వ్యక్తిగత పరిశుభ్రత కోసం సురక్షితమైన నీరును అందచేశారు. ప్రపంచవ్యాప్తంగా 92.6 వీ పిల్లలు మరియు వారి సంరక్షకులు మానసిక ఆరోగ్యం మరియు సామాజిక సహాయాన్ని పొందారు.టీకాలు  మరియు చికిత్సలతో  42.0 వీపశువులు కాపాడబడ్డాయి.

ఈ 2020 సంవత్సరంలో నాగరికత చరితలో ఎన్నడూ లేని భయంకరమైన కోవిడ్‌ -19  ‌మహమ్మారితో విల విలాడుతున్నది. ప్రపంచవ్యాప్తంగా మానవతా కార్యకలాపాలకు అతిపెద్ద సవాలుగా నిలుస్తున్నది.2020 లో 168 మిలియన్ల ప్రజలు మానవతా సహయం,రక్షణ కై ఎదురుచూస్తున్నారు.ప్రతి 45 మందిలో ఒకరు సంక్షోభంలో అభద్రతలో ఉంది సహకార కోసం అభ్యర్థిస్తున్నారు. యు యన్‌ ‌నివేదిక ప్రకారం 109 మిలియన్ల ప్రజల జీవితాలు కోవిడ్‌19, ‌వాతావరణ మార్పు ప్రభావాలతో ప్రమాదస్థితికి చేరుకున్నాయి.వీరి రక్షణ కోసము మానవత వనరులతో పాటు 28.8 బిలియన్ల డాలర్ల నిధులు అవసరముంది. కోవిడ్‌ -19 ‌తో ముడిపడి ఉన్న అనేక తీవ్ర  ప్రమాదాలు ఉన్నప్పటికీ ప్రాణాలను కాపాడటానికి మరియు రక్షించడానికి మానవతావాదులు ఎప్పటిలాగే పని చేస్తున్నారు.వీరి స్ఫూర్తిని ,విజయాలను ప్రశంసిస్తూ • తీవ•శ్రీ శ్రీఱ•వ ష్ట్రవతీశీ• హాష్‌ ‌ట్యాగ్‌ ‌లతో ప్రచారం చేస్తూ  వీరి దారిలో మరెందిరినో  నడిపించే దానిపై ఐక్యరాజ్యసమితి  దృష్టి పెడుతున్నది.సోనుసూద్‌కు వచ్చిన ప్రాచుర్యం తెలిసిందే. తెలంగాణలో కొరోనాతో మరణించిన శవాలను దహనం చేయడానికి స్ఫూర్తినిచ్చిన వైద్యులు పెండ్యాల శ్రీరామ్‌, ‌చెరుకు సుధాకర్‌, అలాగే పశు సంపదను కాపాడుతున్న వరంగల్‌ ‌వెట్‌ ‌ప్రవీణ్‌ ,‌విపత్తులో వెరవకుండా జెంక కుండా ప్రజా ప్రతినిధులకు ఒక నమూనా గా పని చేస్తున్న కేటిఆర్‌, ‌హరీష్‌ ‌రావులు. ఇంకా అనేక మంది ఈ విపత్తులో భిన్నమైన మార్గాలలో శిఖర సమాన మానవత్వం ను చూపుతున్నారు

కోవిడ్‌-19 ‌మహమ్మారి యొక్క వ్యాప్తి ప్రబలంగా ఉండి మానవ ఆస్తుల తగ్గుదల,హక్కుల క్షీణత,  మరియు జీవనోపాధిని కోల్పోవడం లాంటి అనేక ఉపద్రవాలు సంభవిస్తున్నాయి.ఇలాంటి గడ్డు పరిస్థితులలో మానవ అనారోగ్యాలను, మరణాలను తగ్గించడానికి, సామాజిక సమైక్యతను కాపాడుకోవడానికి ప్రధమ ప్రాధాన్యతగా మానవతావాదులు పని చేస్తున్నారు.మహమ్మారికి గురయ్యే శరణార్థులు, అంతర్గతంగా స్థానభ్రంశం చెందినవారు, వలస వచ్చినవారి కోసం కుడా సహాయక రక్షక చర్యలను చేపడుతున్నారు.
మనిషి స్వార్ధపరుడు,ద్రోహం,ద్వేషం,హింస ,క్రౌర్యంల మృగప్రాయ స్వభావం తో ఉంటాడు, నాగరికత తన వెంట అనేక అమానవీయ అపశ్రుతులను తీసుకోవచ్చి విలువలు లేని నిస్సారమైన సమాజాన్ని ఏర్పాటు చేసింది అనే అభిప్రాయాలను పటా పంచలు చేస్తూ మైత్రి, ప్రేమ, కారుణ్యం, ఋజువర్తన లక్షణాల నూతన మానవ సృష్టి సమాంతరంగా జరుగుతూనే ఉంది.ఈ కృషిని  కొనసాగించడం, వేగవంతం చేయడం మన సంస్కృతిలో నిత్య కృత్యం కావాలి. నిజజీవిత హీరోలను కాపాడుకోవాలి. ప్రభుత్వాలు, కార్పొరేట్లు మానవ జీవన నైతిక సౌందర్యం పరుల కష్టాల పట్ల చలించినప్పుడే, సహానుభూతి చెందినప్పుడే ఉందనే సత్యాన్ని గ్రహించాలి. యుద్ధాలు,మానవ దురాశ వలన కలిగే ప్రకృతి విపత్తులు  తరగాలి, శాంతి, సౌభాగ్యాలు మహామ్మారులు లాగా ప్రబలాలి.ఈ వెలుగులో ప్రజాస్వామిక వాదులు, విద్యావేత్తలు, పౌర సమాజం పనిచేయడమే అమరులైన మానవత్వ పుష్పాలకు మనం ఇచ్చే నిజమైన నివాళి.

asnala srinivas
అస్నాల శ్రీనివాస్‌, 9652275560
‌తెలంగాణ గెజిటెడ్‌ అధికారుల సంఘం

Leave a Reply