అతలాకుతలం జేస్తిరి
జీవరాశి ఉసురు బోసుకుంటిరి
చెరువులు, కుంటలను కాంక్రీట్ మయం జేస్తిరి
జీవం లేని జలాన్ని కొనుక్కొని తాగుతాంటిరి
రసాయనిక ఎరువులు, పురుగు మందులతో
మట్టి సారాన్ని జలగల్లా పీల్సుక తింటిరి
తినే తిండిని సైతం విషతుల్యం జేస్తిరి
బారెడు దూరానికి గూడ
పెయ్యి అల్వకుండ బండెక్కే పోతాంటిరి
పెనం మీది పేలాల లాగ ఏగుతాంటిరి
అకాల వర్షాలతో ఆగమైతాంటిరి
నీళ్లు, నేల తేడా లేకుండా ప్లాస్టిక్‌తో నింపేస్తిరి
జల జీవానికి ముప్పు తెస్తిరి
భూమిలో విషపు పొర సృష్టిస్తిరి
కొండలు తవ్వి కోట్లు గడిస్తిరి
పుడమి పొక్కిలి చేసి సంపదంతా
రాశులు బోసి అమ్ముకుంటాంటిరి
పైసలెనకాల పరుగులు తీసి
తనువును రోగాల పుట్ట జేసుకుంటిరి
నిర్జీవమైన కొరోనాకు భయపడి
ముసుగేసుకొని నట్టింట్ల మూలుగుతాంటిరి
అంటే అన్నవంటరు గనీ..
అడగకుండానే అన్నీ ఇచ్చిన ధరణిని
విచక్షణారహితంగా నిలుపు దోపిడి చేసి
కంట్లెం మీదికి తెచ్చుకుంటాంటిరి
చేసిన తప్పులన్నీ..
సునామై ముంచేయక ముందే
జర సోయికి రాండ్రి
రేపటి ఆశల తరానికి
నిలువ నీడ లేకుండ చేయకుండి
వరంగల్,
9866899046.