Take a fresh look at your lifestyle.

నేడు ప్రపంచ క్యాన్సర్‌ ‌దినం కలవరపెడుతూ కబళిస్తున్న క్యాన్సర్‌

Today is World Cancer Day

ప్రపంచం వ్యాప్తంగా అనేకమంది వయసు ప్రాంతం లాంటి భేదాలు లేకుండా క్యాన్సర్‌ ‌వ్యాధి బారినపడుతున్నారు. గ్రామీణ, పట్టణ ప్రాంతమని భేదం లేకుండా పలువురిని క్యాన్సర్‌ ‌వ్యాధి సోకుతోంది. సామాన్యుల నుంచి సెలబ్రిటీల వరకూ చాలామంది ఈ వ్యాధి బారిన పడుతూ దాదాపు ఏటా 70 లక్షల మంది ప్రాణాలు కోల్పోతున్నారు. ప్రభుత్వ సంస్థలు, ఎన్జీవోలు, స్వచ్ఛంద సంస్థలు వ్యాధి లక్షణాలపై ప్రచారం చేసి, వ్యాధికి గురైనవారికి సరైన చర్యల ద్వారా వ్యాధి నివారణ సాధ్యమన్నది చెప్పాలన్న లక్ష్యంతో ప్రపంచవ్యాప్తంగా క్యాన్సర్‌ ‌నివారణ కార్యక్రమాలు, అవగాహన కార్యక్రమాలు, ర్యాలీలు, సదస్సులు, లెక్చర్లు నిర్వహించడం ద్వారా ప్రజల్లో చైతన్యం కలిగించడం, అంతర్జాతీయ క్యాన్సర్‌ ‌నివారణ సంస్థ సూచనలను, ప్రచార కార్యక్రమాలను, పాంప్లెట్లను ప్రజలకు అందించడం  ద్వారా  ప్రచార కార్యక్రమాలు దేశ వ్యాప్తంగా చేస్తున్నాయి. ఇంటర్నేషనల్‌ ‌క్యాన్సర్‌ ‌కంట్రోల్‌(‌యుఐసిసి) స్థాపించబడ్డ రోజు ఫిబ్రవరి 4న  ప్రతి సంవత్సరం క్యాన్సర్‌ ‌వ్యాధికి వ్యతిరేకంగా ప్రజల్లో చైతన్యం తీసుకొచ్చే కార్యక్రమాలను చేపట్టడం జరుగుతోంది. ఈ వ్యాధి గురించి ప్రతీఒక్కరికి  అవగాహన కల్పించి చికిత్సకు ప్రోత్సహించడం ఈ కార్యక్రమ ఉద్దేశ్యం. ప్రతి సంవత్సరము  ఒక థీమ్‌ను తీసుకుని ప్రచారం కార్యక్రమాలను నిర్వహిస్తారు. ఈ ఏడాది ‘అయామ్‌ అం‌డ్‌ ఐ ‌విల్‌’ అనే నినాదముతో కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు.

మన శరీరంలో కణ విభజన అనేది నిరంతరం జరిగే ప్రక్రియ. అయితే ఇది అన్ని భాగాలలో జరగదు మన శరీరంలో కన్ను మెదడు గుండె మూత్రపిండాలు వంటి ప్రత్యేక క్రియల కోసం ఏర్పడ్డ అవయవాలు పుట్టినప్పుడు ఏ విధంగా ఉంటాయో జీవితాంతం కూడా అదే విధంగా ఉంటాయి. వీటిలో కణ విభజన జరగదు. అయితే వయసుతో పాటు వీటిని సంఖ్య తగ్గుతుంది కానీ పెరగదు. మరికొన్ని కణాలు అవసరాన్ని బట్టి పుడుతూ చనిపోతూ ఉంటాయి. ఎర్రరక్త కణాలు, తెల్ల రక్త కణాలు నిరంతరం విభజన చెందుతూనే ఉంటాయి వాటి జీవిత కాలం అయిపోగానే అవి చనిపోయి  వాటి స్థానంలో కొత్త కణాలు వచ్చి చేరుతూ ఉంటాయి. కొన్ని సార్లు కణంలో జన్యువులలో వచ్చే మార్పుల వల్ల ఒకటి లేక కొన్ని పనికిరాని కణాలు ఒక పద్ధతి ప్రకారం కాకుండా నిరంతరం విభజన చెందుతూ ఆరోగ్యకరమైన కణాలను నాశనం చేస్తూ వాటి అవాసాలను ఆక్రమిస్తూ చుట్టూ ఉన్న కణాలను  మొత్తం ఆక్రమిస్తాయి. వీటికి మరణం లేకుండా నిరంతరం విభజన చెందుతూ, ఆ ప్రాంతంలో గడ్డలు  ఏర్పడుతూ ఉంటాయి. అన్ని గడ్డలు (వ్రనాలు) క్యాన్సర్‌ ‌గడ్డలు కావు. నొప్పిని కలిగి ఉన్న గడ్డలు క్యాన్సర్‌ ‌కలిగిస్తాయి.  ఫలితంగా చుట్టుపక్కల ఉన్న కణాలు వాటి విధులు నిర్వర్తించక  జీవక్రియలు తగ్గిపోయి క్రమంగా మనిషి మరణానికి దగ్గరవుతాడు క్యాన్సర్‌ ‌కణాలు ఒక భాగంలో పుట్టి అక్కడే ఉండవచ్చు లేదా రక్తనాళాలు ద్వారా ఒక చోటి నుంచి మరో చోటికి వ్యాపించి మిగతా కణాలను నాశనం చేయవచ్చు. అనువంశికంగా వచ్చే జన్యువులు 10 శాతం కాన్సర్‌లకు కారణం అయితే మిగిలిన 90 శాతానికి మన జీవన శైలే కారణం.  ఆహారపు అలవాట్లతో పాటు వాతావరణ కాలుష్యానికి అతినీలలోహిత కిరణాలకు హానికర రసాయనాలు విషపదార్థాల, వైరస్‌  ‌ప్లాస్టిక్‌ ‌వాడకం, రేడియేషన్‌ ‌బారిన పడి క్యాన్సర్‌కు గురి అవుతున్నాము.

కేన్సర్‌కు కారణాలలో ఆధునిక జీవన శైలి ప్రధానమైంది. చుట్ట, బీడీ సిగరెట్‌, ‌పొగతాగడం, గుట్కా, తంబాకు టోబాకో నమలడం,  స్థూలకాయం, అధిక బరువు, పండ్లు తక్కువగా తీసుకునేవారు, కూరగాయలు తీసుకొననివారు, శారీర శ్రమ తక్కువగా చేసేవారు, మద్యం సేవించేవారు, అనారక్షితమైన శృంగారం కారణంగా, హెచ్‌ఐవి ఇన్ఫెక్షన్‌ ‌సోకినవారు, పట్టణ ప్రాంతాల్లో కాలుష్యం బారినపడినవారు, పొగ వాసన ఎక్కువగా భరించేవారు, అనువంశికంగా ఎక్కువ సమస్యలు ఎదుర్కొనేవారు, సూర్యరశ్మిని నేరుగా ఎదుర్కొనేవారు క్యాన్సర్‌ ‌బారినపడే అవకాశం ఉంది. సాధారణంగా శరీరంలోని అన్ని భాగాలకు క్యాన్సర్‌ ‌వస్తుంది కొన్ని క్యాన్సర్ల నివారణకు మనం తినే ఆహార పదార్థాలు సమర్థంగా పనిచేసి క్యాన్సర్‌ను సులభంగా నిరోధిస్తాయి. క్యాన్సర్‌లలో  ప్రోస్టేట్‌ ‌క్యాన్సర్‌, ‌బోన్‌ ‌క్యాన్సర్‌, ‌బ్రెయిన్‌ ‌క్యాన్సర్‌, ‌పెదవులు, నోరు వంటి భాగాలకు వచ్చే క్యాన్సర్‌, ‌మూత్రాశయ క్యాన్సర్‌, ‌తల, మెడ క్యాన్సర్‌, ‌పెద్దపేగు మలద్వార క్యాన్సర్‌, ‌గాలిబ్లాడర్‌ ‌క్యాన్సర్‌, ‌జీర్ణాశయ క్యాన్సర్‌, ‌మూత్రపిండాల క్యాన్సర్‌, ‌కాలేయ క్యాన్సర్‌, ‌రొమ్ము క్యాన్సర్‌, ‌గర్భాశయ ముఖద్వార క్యాన్సర్‌, ఒవెరియన్‌ ‌క్యాన్సర్‌, ‌కంటి క్యాన్సర్‌ ఇలా శరీరంలో ఎక్కడైనా ఏ బాగానికైనా  రావచ్చు. శరీరంలో ఏదైనా అవయవానికి కేన్సర్‌ ‌సోకితే తొలిదశలో లక్షణాలు అంతగా కనిపించవు. వ్యాధి సోకిన అవయవాన్ని బట్టి దీని నిర్ధారణ పరీక్షలు కూడా వేర్వేరుగా ఉంటాయి. కొన్ని రకాల క్యాన్సర్లనూ ఒకే విధమైన పరీక్షతో తెలుసుకోవడం సాధ్యం కాదు. క్యాన్సర్‌ అం‌టువ్యాధి• కాదు. అలాగే వంశపారంపర్యంగా వచ్చే అవకాశం కూడా తక్కువే. అయితే, రొమ్ము, థైరాయిడ్‌, ‌పెద్దపేగు, పాంక్రియాస్‌ ‌క్యాన్సర్లు జన్యుపరంగా సంక్రమిస్తాయి. కుటుంబంలో ఎవరికైనా ఈ కేన్సర్లు వస్తే వంశపారంపర్యంగా వచ్చే ప్రమాదం ఉంది. క్యాన్సర్‌ను తొలి దశలో గుర్తించకపోతే ఇతర భాగాలకూ వ్యాపించి, చికిత్సకు సైతం ఏమాత్రం తగ్గుముఖం పట్టవు. కాబట్టి దీనిపై అవగాహనతో ఎదుర్కొవాలి. క్యాన్సర్‌ ‌సోకినవారిని సమాజానికి దూరంగా ఉంచకుండా ప్రజల్లో చైతన్యం తీసుకొచ్చేలా కార్యక్రమాలు రూపొందించాలి.

క్యాన్సర్‌ ‌కణం శరీరంలో ఎక్కడుందనే విషయం తెలుసుకోవడం కష్టం. ఏ అవయవానికి సోకిందనే అనుమానం ఉంటే దానికి సంబంధించిన పరీక్షలు వేర్వేరుగా ఉంటాయి. వీటిలో బయాప్సీ, యఫ్‌యన్‌ఏ ‌టెస్ట్, ‌బ్లడ్‌ ‌మార్కర్స్, ఎక్స్-‌రే, సీటీ స్కాన్‌, ‌యంఆర్‌ఐ, ‌పీఈటీ స్కాన్‌ ‌వంటివి అవసరాన్ని బట్టి  పరీక్ష చేస్తారు. అయితే సర్వైకల్‌ ‌క్యాన్సర్‌ను పాప్‌స్మియర్‌ ‌ద్వారా ముందుగా గుర్తించవచ్చు.అందరితో సమానమన్న భావన కూడా  కలిగంచడం ప్రపంచ క్యాన్సర్‌ ‌దినం యొక్క  ప్రధాన ఉద్దేశం. క్యాన్సర్‌ ‌వ్యాధిగ్రస్తులపై ఎవరూ జాలి చూపించాల్సిన అవసరం లేదన్నది ఇక్కడ ముఖ్యమైన విషయం. క్యాన్సర్‌ ‌వ్యాధి సోకినవారు జీవితంలో ఏదైనా సాధించగలరన్న అభిప్రాయాన్ని కలిగించేందుకు విజయవంతమైన జీవితాలను వారికి వివరించాలి. క్యాన్సర్‌ ‌వ్యాధి బారినపడుతున్నవారు, వ్యాధితో చనిపోతున్న వారు  ఎక్కువగా అభివృద్ధి చెందని ప్రాంతాల్లోనే ఉన్నారు. ఈ పరిస్థితిని అదుపు చేయలేకపోతే వచ్చే 2030 నాటికి మృతుల సంఖ్య విపరీతంగా పెరిగే ప్రమాదం ఉంది.

- Advertisement -

image.png
నెరుపటి ఆనంద్‌
ఉపాధాయులు
టేకుర్తి
9989048428

Leave a Reply