Take a fresh look at your lifestyle.

‌ప్రతి కదలికకు కీళ్లే కీలకం నేడు ప్రపంచ ఆర్థరైటిస్‌ ‌దినోత్సవం

మన ప్రతి కదలికకూ కీలే.. కీలకం! జాయింట్లు మృదువుగా, సజావుగా, సున్నితంగా కదులు తుంటేనే… మన జీవితం హాయిగా, సుఖంగా సాగుతుంటుంది. అది వేళ్ల,  మణికట్టు, భుజం, చివరికి పాదాల, వేళ్ల  ఏ జాయింట్లు అయినా కావచ్చు.. మోకాలి కీళ్లు కావచ్చు. ఏ కదలికకైనా ఈ కీళ్లే కీలకం. మరి మన శరీరంలో ఈ కీళ్లు ఉగ్రరూపం  దాలిస్తే కాలు, చేయి మెదపాలంటే కష్టం. మారు తున్న జీవనశైలి, ఆహారపు అలవాట్లు అనేక రకాల అనారోగ్య సమస్యలకు దారి తీస్తుంటాయి. అందులో ఆర్థరైటిస్‌ ‌కూడా ఒకటి. ఇది గ్రీకు పదాలైన ‘‘ఆర్ట్రో’’ నుండి ఉద్భవించింది, అంటే‘‘ఉమ్మడి’’, మరియు ‘‘ఐటిస్‌’’, అం‌టే ‘‘మంట’’. మానవ ఆర్థరైటిస్‌ ‌యొక్క మొట్ట మొదటి జాడలు క్రీ.పూ 4500 నాటివి. ప్రారంభ నివేది కలలో, ఆర్థరైటిస్‌ను చరిత్రపూర్వ ప్రజల అత్యంత సాధారణ వ్యాధిగా సూచిస్తారు. రుమటాయిడ్‌ ఆర్థరైటిస్‌, ఎం‌కైలోడింగ్‌ ఆర్థరైటిస్‌ అనే 2 రకాలున్నాయి.

సాధారణ ఆర్థరైటిస్‌కు ఈ రెండూ భిన్నం. ఈ రెండింటిలో ఉపశాఖలుగా మరో 15 ఆర్థరైటిస్‌లు ఉన్నాయి. ఒకసారి తగులుకుంటే వదిలి పెట్టవు. పూర్తిగా నిర్మూలించలేం. స్టెరాయిడ్స్ ‌తదితర మందులు వాడటం వల్ల వీటిని నియంత్రించ వచ్చు. ఇక సోరియాసిస్‌ ‌కూడా ఆర్థరైటిస్‌కు దారితీస్తుంది. రీటస్‌ ‌డిసీజ్‌ అం‌టే కంటి చూపు మంద గించడం ద్వారా కీళ్ల నొప్పులు వచ్చే అవకాశ ముంది. ఇలాంటి జబ్బులు వస్తే 20-30 ఏళ్లకే ఆపరేషన్లు చేయాల్సి ఉంటుంది. గతంలో 50-60 ఏళ్లలో కనిపించే ఆర్థరైటిస్‌ను ఇప్పుడు 35-40 ఏళ్లలోనే చూస్తున్నాం. దీన్ని ముందుగా గుర్తించి నియంత్రణ చర్యలు తీసుకోక పోతే మున్ముందు నడవలేని, కదల్లేని పరిస్థితులు రావొచ్చని వైద్యులు హెచ్చరి స్తున్నారు. కింద కూర్చోవడం వల్ల, సాధారణ మరుగుదొడ్లు వాడినా మోకాలి నొప్పులు వస్తాయి. ఈ కీళ్లకు వచ్చే అతి పెద్ద సమస్య ఆర్త్థ్రెటిస్‌! అం‌టే కీలు లోపలంతా వాచి పోయి   కదపా లంటేనే తీవ్రమైన నొప్పి, బాధతో జాయింటులో  అరిగి పోవడం వల్ల  రావచ్చు. దాన్ని ‘‘ఆస్టియో ఆర్త్థ్రెటిస్‌’’ అం‌టారు. ఇప్పుడు ఎక్కువ మంది అనుభవిస్తున్న మోకాళ్ల నొప్పుల బాధ ఇదే. ఇక ఒంట్లో ఏదైనా ఇన్ఫెక్షన్‌ ‌తలెత్తి అది కీలుకు చేరటం వల్ల కీళ్లనొప్పి రావచ్చు. దీన్ని ‘‘ఇన్ఫెక్టివ్‌ ఆ‌ర్త్థ్రెటిస్‌’ అం‌టారు. సొరియాసిస్‌ ‌వంటి చర్మ వ్యాధుల్లో కూడా కీళ్ల వాపు, నొప్పి పలకరించవచ్చు. దాన్ని ‘‘సొరియాటిక్‌ ఆ‌ర్త్థ్రెటిస్‌’’ అం‌టారు. అలాగే మూత్రనాళ ఇన్ఫెక్షన్లు, నీళ్ల విరేచనాల వంటి ఇన్ఫెక్షన్ల తర్వాత కూడా కీళ్ల వాపు రావచ్చు. దాన్ని ‘‘రియాక్టివ్‌ ఆ‌ర్త్థ్రెటిస్‌’’ అం‌టారు. చికున్‌గన్యా వంటి వ్కెరల్‌ ‌వ్యాధుల్లో కూడా కీళ్ల వాపులు రావచ్చు, వీటిని ‘‘వ్కెరల్‌ ‌రియాక్టివ్‌ ఆ‌ర్త్థ్రెటిస్‌’’ అం‌టారు.

ఇలా కీళ్ల వాపుల్లో ఎన్నో రకాలు న్నాయి. అయితే ఇవన్నీ కూడా ఏదో ఒక ప్రత్యేకమైన, స్పష్టమైన కారణంతో వచ్చే కీళ్ల నొప్పులు! వీటికి భిన్నంగా… స్పష్టమైన కారణమేదీ తెలియ కుండానే ఆరంభమయ్యే అతి పెద్ద సమస్య… రుమటాయిడ్‌ ఆ‌ర్త్థ్రెటిస్‌! ‌కీళ్లవాతం!!  వేళ్లు, మణికట్టు వంటి చిన్న జాయింట్లను ఎక్కువగా పట్టి పీడించే ఈ కీళ్లవాతం.. దీర్ఘకాలం ఉండిపోయే సమస్య! దీన్ని నిర్లక్ష్యం చేస్తే శరీరంలో గుండె, ఊపిరితిత్తులు, కళ్ల వంటి ఇతరత్రా అవయవాలూ ప్రభావితమై పరిస్థితి మరింత విషమిస్తుంది. అదృష్టవశాత్తూ- దీన్ని పూర్తి నియంత్రణలోకి తీసుకు వచ్చే  విధానాలు అందుబాటులో ఉన్నాయి. అందుకే ‘ప్రపంచ ఆర్త్థ్రెటిస్‌ ‌దినం’ సందర్భంగా ఈ కీళ్లవాతం గురించి అవగాహన కలిగి వుండాలి. మన శరీరంలో ఒక అద్భుతమైన రక్షణ వ్యవస్థ ఉంది. అదే ‘రోగ నిరోధక వ్యవస్థ’. మనం వ్యాధుల బారినపడకుండా.. ఎటువంటి సూక్ష్మక్రిములూ మనపై దాడి చెయ్యకుండా నిరంతరం పహారా కాస్తుందీ వ్యవస్థ. రేయిం బవళ్లు ఈ బాధ్యతలను ఇది అద్భుతంగా నిర్వర్తిస్తుంటుంది. కానీ.. ఒక్కోసారి ఇది ఏకంగా మన శరీర భాగాల మీదే దాడి చేసేస్తుంది. ఫలితమే రకరకాల ‘ఆటో ఇమ్యూన్‌’ ‌సమస్యలు. కీళ్లవాతం.. రుమటాయిడ్‌ ఆ‌ర్త్థ్రెటిస్‌ ‌కూడా ఇలా తలెత్తే సమస్యే! ఇది మన కీళ్లలో ఎముకల మధ్య ఉండే మృదువ్కెన ‘సైనోవియం’ పొరను చూసి, దానిపై దాడి చేసి దెబ్బతీయటం ఆరంభిస్తుంది. దీంతో కీళ్లు ఎర్రగా వాచిపోవటం, నొప్పుల వంటి బాధలన్నీ ఆరంభ మవుతాయి. సాధారణంగా ఇతరత్రా కీళ్ల నొప్పుల్కెతే శరీరంలోని ఏదో ఒకవ్కెపు కీలుకు మాత్రమే వస్తాయి.

కానీ రుమటాయిడ్‌ ఆ‌ర్త్థ్రెటిస్‌లో- ఒకేసారి రెండు వ్కెపులా వాపు కనిపిస్తుంది. అంటే ఉదాహరణకు కుడి చేతి వేలి కీళ్లు వాస్తే, ఎడమ చేతి వేలి కీళ్లు కూడా వాస్తుంటాయి. కుడి మణికట్టు కీలు వాస్తే, ఎడమ మణికట్టు కీలూ వాస్తుంది. అలాగే ఈ వాపు ఏకకాలంలో శరీరంలోని చాలా కీళ్లకూ రావచ్చు. కీళ్లవాతం ఏ వయసు వారికైనా రావచ్చుగానీ సాధారణంగా పెద్దవారి లోనే.. అదీ 30-60 ఏళ్ల మధ్య వయసు వారిలో ఎక్కువగా కనిపిస్తుంటుంది. ముఖ్యంగా- ఇది మహిళల్లో ఎక్కువ. కీళ్లవాతం సాధారణంగా శరీరంలోని చిన్న కీళ్లతో మొదలవు తుంది. అంటే చేతివేళ్లు, మణికట్టు, కాలివేళ్ల వంటి వాటితో ఆరంభమై క్రమేపీ మోకాలు, తుంటి వంటి పెద్ద జాయింట్లకూ రావచ్చు. వాపు, నొప్పి వంటివన్నీ చిన్న జాయింట్లతో ఆరంభం కావటం దీని ప్రత్యేక లక్షణం. రుమటాయిడ్‌ ఆ‌ర్త్థ్రెటిస్‌ ‌బాధితుల్లో చాలా కొద్దిమందికి మాత్రమే కీళ్ల మార్పిడి అవసరం అవుతుంది. కీళ్లవాతం కొంతకాలం పెరుగుతూ తగ్గుతూ ఉండటం దీని మరో ప్రత్యేకత. కీళ్లవాతం వచ్చిన తొలిదశలో కీళ్ల మీది పైపొర మాత్రమే దెబ్బతింటుంది. వ్యాధి ముదురుతున్న కొద్దీ క్రమేపీ అది కీళ్లను, లోపలి ఎముకలను కొరికేస్తుంది. ఇంకా తీవ్రమైతే కీళ్ల మధ్య ఖాళీ తగ్గిపోతుంది. దీంతో ఎముకల రాపిడి కారణంగా నొప్పి వస్తుంది. కొన్నాళ్లకు కీళ్లు మొత్తం దెబ్బతింటాయి.

రుమటాయిడ్‌ ఆ‌ర్త్థ్రెటిస్‌ను  నియంత్రించు కోకపోతే – గుండె జబ్బులు, పక్షవాతం వంటివి పదేళ్ల ముందుగానే వచ్చే ప్రమాదం ఉంది. కళ్లు పొడిబారటం, లాలాజలం తగ్గిపోవటంతో పాటు గుండె చుట్టూ, వూపిరితిత్తుల చుట్టూ నీరు చేరటం వంటి ఇబ్బందులూ ఎదురవ్వచ్చు. వ్యాధిని సత్వరమే గుర్తించి చికిత్స ఆరంభిస్తే ఈ కీళ్ల మార్పిడి అవసరం అంతగా రాదు. చిన్న కీళ్లకు ఈ మార్పిడి అవకాశమూ ఉండదు. అందుకే మందులతో చికిత్సకే ప్రాధాన్యం ఇస్తారు. కీళ్లవాతం బాధితుల్లో చాలామంది పూర్తి విశ్రాంతిగా పడుకుంటూ వ్యాయామం మానేస్తుంటారు. ఇది సరికాదు. వ్యాయామం చేయకపోతే కీళ్లు గట్టిగా బిగుసుకు పోతాయి. కొన్నిసార్లు ఆపరేషన్‌ ‌చేసినా ఫలితం ఉండక పోవచ్చు. మందులతో నొప్పి తగ్గాక వ్యాయామం మొదలెట్టాలి. నొప్పి తగ్గుతున్న కొద్దీ వ్యాయామం చేసే సమయాన్ని కూడా పెంచుకోవాలి. ఏరోబిక్‌, ‌యోగా, నడక వంటి వ్యాయామాలు ఏవైనా చేయొచ్చు. పొగ తాగకూడదు. బరువు పెరగ కుండా, శరీరానికి తగ్గట్లుగా ఉండాలి. ఆర్థరైటిస్‌ను ముందుగా గుర్తించకపోతే పనిచేసే సామర్థ్యం తగ్గిపోతుంది. దీనివల్ల శరీరంలో కొవ్వు పెరిగిపోతుంది. ఫలితంగా గుండెకు చేటు తెస్తుంది. అలాగే మెటబాలిజం తగ్గుతుంది. దీంతో ఒత్తిడి పెరుగుతుంది. మన జనాభాలో సుమారు ఒక శాతం మంది దీంతో బాధపడు తున్నారు. కీళ్ల 20 శాతం అరుగుదల ఉంటే, దాన్ని పెరగకుండా చూసుకోవాలి. మృదులాస్థి పెరగడానికి మందులు ఇస్తారు. అవి వాడాలి. సైక్లింగ్‌, ఈత వంటివి చేయాలి. దీని వల్ల కీళ్లపై ప్రభావం చూపదు. నిర్ణీత మోతాదులో డాక్టర్ల సూచన మేరకు నడవవచ్చు. ఏదైనా సమతుల్య మైన శారీరక శ్రమ, వ్యాయామం అవసరం. రుమటాయిడ్‌ ఆ‌ర్త్థ్రెటిస్‌ ‌దీర్ఘకాలిక సమస్య. కాబట్టి చికిత్స కూడా దీర్ఘకాలం, జీవితాంతం తీసుకోవాల్సి ఉంటుంది.
– రామ కిష్టయ్య సంగన భట్ల…
     9440595494

Leave a Reply