Take a fresh look at your lifestyle.

అమరుల ‘‘యాది’’ చేస్కోవాలే !

రజాకార్ల ఆరాచకత్వానికి…
భూస్వాముల దాష్టికత్వానికి
నిజాం నిరంకుశత్వానికి వ్యతిరేకంగా …
తెలంగాణ జనం రగల్‌ ‘‘‌జెండా’’ ఎత్తింది
భూమికోసం…భుక్తి కోసం …
బానిసత్వ విముక్తి కోసం …
సబ్బండ జాతి ఉద్యమ బాట పట్టింది
ఊరు, వాడలు ఏకమై…
దండు గట్టి దండెత్తినయ్‌
‌బాంచెన్‌ ‌దొరా ! అన్న గొంతులే..
సమర సింహలై గర్జించినయ్‌
‌దండం బెట్టిన చేతులే …
బందుకు పట్టి ‘‘సై’’ అంటూ తొడగొట్టినయ్‌
‌తెలంగాణ సాయుధ పోరాట ధాటికి…
ఖాసీం రజ్వీ ముష్కరుల పలాయనం
భూస్వాముల దొరతనం భూస్థాపితం
నిజాం సంస్థాన కోట గోడలు నేలమట్టం
చాకలి ఐలమ్మ శూరత్వం ..
దొడ్డి కొమురయ్య ధీరత్వం ..
ఎందరో  వీరుల అమరత్వం..
ఇంకెందరో యోధుల పరాక్రమం…
వెరసి స్వేచ్ఛా స్వాతంత్య్రం సంప్రాప్తం
విలీనమో … విద్రోహమో..
విమోచనమో..ఎదై•తేనేమి ?
ఈ శుభ గడియల…
అమర వీరుల మదిల దల్చుకోవాలే…
పోరాట యోధులకు పొర్లు దండం బెట్టాలే
పల్లె పల్లె సంబురంగా పండుగ జేస్కోవాలే
తెలంగాణ ఆత్మగౌరవ పతాకం ఎగరేయ్యాలే..

(నేడు తెలంగాణ దాస్య శృంఖలాల తెంచుకున్న  సుదినం)
కోడిగూటి తిరుపతి,

 9573929493

Leave a Reply