Take a fresh look at your lifestyle.

ప్రజల ఐఏఎస్‌ అధికారి ఎస్‌ అర్‌ ‌శంకరన్‌

“తనకంటూ సొంత ఇల్లు కూడా లేని నిరాడంబరి. ఐఏఎస్‌ అధికారులు సమాజంలోని అట్టడుగు వర్గాల ప్రజలకు ఏ స్థాయిలో సేవ చేసి వారి జీవితాల్లో వెలుగులు నింపొచ్చో ప్రత్యక్షముగా చేసి చూపించిన మహనీయుడు.షెడ్యూల్‌ ‌కులాలు మరియు షెడ్యూల్‌ ‌తెగల సంక్షేమం కొరకు అహర్నిశలు కృషి చేసిన మహోన్నత వ్యక్తి మరియు శక్తి అని చెప్పవచ్చు. రాజ్యాంగం,న్యాయ వ్యవస్థ,ప్రభుత్వ పాలనా విభాగాలేవైనా సరే వారి ప్రధమ కర్తవ్యం అణగారిన వర్గాల సమస్యల పరిష్కారమే అని నమ్మి ఆచరించిన వ్యక్తి. అట్టడుగు వర్గాల అభ్యున్నతి కొరకు పాలనా వ్యవస్థను పరుగులు పెట్టించిన ఘనత ఎస్‌ ఆర్‌ ‌శంకరన్‌ ‌గారికే దక్కినదని చెప్పవచ్చు.”

నేడు ఎస్‌ఆర్‌ ‌శంకరన్‌ ఐఏఎస్‌ ‌పదవ వర్ధంతి..

జీవితం మొత్తం అణగారిన వర్గాల ప్రజల జీవితాల్లో వెలుగులు నింపడానికి కృషి చేసిన మహోన్నత వ్యక్తి ఎస్‌ అర్‌ ‌శంకరన్‌ ఐఏఎస్‌. ‌తన జీవితం అంతా నిజాయితీగా గడిపిన అద్భుతమైన వ్యక్తి. తనకంటూ సొంత ఇల్లు కూడా లేని నిరాడంబరి.ఐఏఎస్‌ అధికారులు సమాజంలోని అట్టడుగు వర్గాల ప్రజలకు ఏ స్థాయిలో సేవ చేసి వారి జీవితాల్లో వెలుగులు నింపొచ్చో ప్రత్యక్షముగా చేసి చూపించిన మహనీయుడు.షెడ్యూల్‌ ‌కులాలు మరియు షెడ్యూల్‌ ‌తెగల సంక్షేమం కొరకు అహర్నిశలు కృషి చేసిన మహోన్నత వ్యక్తి మరియు శక్తి అని చెప్పవచ్చు. రాజ్యాంగం,న్యాయ వ్యవస్థ,ప్రభుత్వ పాలనా విభాగాలేవైనా సరే వారి ప్రధమ కర్తవ్యం అణగారిన వర్గాల సమస్యల పరిష్కారమే అని నమ్మి ఆచరించిన వ్యక్తి. అట్టడుగు వర్గాల అభ్యున్నతి కొరకు పాలనా వ్యవస్థను పరుగులు పెట్టించిన ఘనత ఎస్‌ ఆర్‌ ‌శంకరన్‌ ‌గారికే దక్కినదని చెప్పవచ్చు.

అయన తమిళనాడులోని తంజావూరులో 1934 అక్టోబర్‌ 22‌న మధ్య తరగతి కుటుంబంలో జన్మించారు. 1956లో ఐఏఎస్‌ ‌గా చేరిన శంకరన్‌ ‌గారు 1959లో కర్నూల్‌ ‌జిల్లా నంద్యాల సబ్‌ ‌కలెక్టర్‌ ‌గాను,నెల్లూర్‌ ‌జిల్లా జాయింట్‌ ‌కలెక్టర్‌ ‌గాను పని చేశారు.1971-73 మధ్య కాలం లో కేంద్ర బొగ్గు గనుల శాఖా మంత్రిగా ఉన్న కుమార మంగళం వద్ద స్పెషల్‌ అసిస్టెంట్‌ ‌సెక్రటరీ గా పనిచేసిన కాలంలో బొగ్గు గనులను జాతీయం చేసిన కార్యక్రమంలో అయన పాత్ర అత్యంత కీలకమైనది అని చెప్పవచ్చు.బొగ్గు గని కార్మికులను బానిసలుగా చూస్తున్న స్థితిలో వారికి రాజ్యాంగ పరమైన హక్కులను కల్పించడంలో ఆయన పాత్ర అభినందనీయం.

ఆంధ్రప్రదేశ్‌ ‌రాష్ట్ర సాంఘీక సంక్షేమ శాఖ కార్యదర్శిగా భాద్యతలు నిర్వహించిన సందర్భంలో దళిత,ఆదివాసీలసంక్షేమానికి, అభ్యున్నతికి, అభివృద్ధికి బీటలు వేసే అనేక కీలక మైన నిర్ణయాలు తీసుకున్నారు. ఒక్క ఏడాదిలోనే 120 కి పైగా ప్రభుత్వ ఉత్తర్వులు జారీ చేసిన ఘనత ఆయనది . అందులో 100కి పైగా ఉత్తర్వులు శంకరన్‌ ‌గారి సంతకంతో ఉండడం అయన నిజాయితీకి ఒక మచ్చు తునక.అందులో హరిజన సంక్షేమ మంత్రిత్వ శాఖను సాంఘీక సంక్షేమ శాఖగా మార్పు చేసే జీవో ఒకటిగా చెప్పవచ్చు.అయన ఆదివాసుల అభివృద్ధి మరియు సంక్షేమం కోసం ఎంతోగానో కృషి చేసారు.ముఖ్యంగా ఆదివాసీల కొరకు సమీకృత ఆదివాసీ అభివృద్ధి సంస్థ (ఐ టీ డి ఏ ) లను ఏర్పాటు చేయడంలో,గిరిజన ఉప ప్రణాళికలను ప్రవేశ పెట్టడం లో ముఖ్య పాత్ర పోషించారు.1984లో బడుగు,బలహీన వర్గాల విద్యార్థుల కొరకు సాంఘీక సంక్షేమ పాఠశాలలను ఏర్పాటు చేసి వాటిని ప్రయివేటు పాఠశాలలకు ధీటుగా తీర్చిదిద్దారు.విద్యార్థులు చదువు తో పాటు ఆటలు మరియు సాంస్కృతిక అంశాల యందు రాటు దేలేలా కృషి చేశారు.1976 లో వచ్చిన వెట్టి చాకిరీ నిషేధ చట్టం అయన కృషి ఫలితమే అని చెప్పవచ్చు.త్రిపుర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా పని చేసినప్పుడు అక్కడ కేంద్ర పారా మిలటరీ దళాల అరాచకాలకు అడ్డుకట్ట వేసేందుకు అయన ఎంతగానో కృషి చేసారు.

భారత ప్రభుత్వం ఆయన సేవలను గుర్తించి 2005లో పద్మ భూషణ్‌ అవార్డును ప్రకటించగా సున్నితంగా తిరస్కరించి తన నిరాడంబరతను చాటుకున్న గొప్ప వ్యక్తి. ఖమ్మం మరియు ఆదిలాబాద్‌ ‌జిల్లాల్లో పని చేసినప్పుడు,ఆయనకు బదిలీలు జరుగగా ఆయనను బదిలీ చేయవద్దని ప్రజలు ఆందోళనకు దిగడం ప్రజలకు ఆయనపై గల అచంచల విశ్వాసాన్ని,నమ్మకాన్ని తెలియజేస్తుంది. ఏ రోజూ కూడా అయన తన స్వంత పనులకు ప్రభుత్వ వాహనాన్ని వాడలేదు. సొంత పనులకు ప్రభుత్వ వాహనాన్ని ఉపయోగించుకోవడానికి ఆయన వ్యతిరేఖం.నెల్లూరు జిల్లా కలెక్టర్‌ ‌గా పనిచేస్తున్నప్పుడు అక్కడి మహిళా కళాశాలలో సరియైన వసతులు లేవని తెలిసి కలెక్టర్‌ ‌బంగ్లా ను వాడు కొమ్మని ఇచ్చిన ఘనత ఆయనకే దక్కింది.బిళ్ళ బంట్రోత్‌ ‌లేకపోతే ఆయనను కలెక్టర్‌ ‌గా గుర్తించడంకూడా కష్టమే .అంత సాధారణమైన జీవితాన్ని అయన గడిపేవారు. అందుకే ఆయన పనిచేసే చోట ప్రజలు ఆయనను’’ ఐ ఏ ఎస్‌ ‌గాంధీ’’ అని పిలిచేవారు. పదవీ విరమణ అనంతరం తనకు వచ్చిన పెన్షన్‌ ‌కూడా పేద ఎస్‌ ‌సి,ఎస్‌ ‌టీ. విద్యార్థుల చదువుల కొరకు ఖర్చు పెట్టేవారు. పదవీ విరమణ అనంతరం, ప్రభుత్వానికి నక్సలైట్లకు మధ్య జరిగుతున్న పోరులో ప్రాణాలు కోల్పోతున్న ప్రజల కొరకు మానవతా దృక్పధంతో మేధావులతో కూడిన పౌర స్పందన వేదికను ఏర్పాటు చేసి ప్రభుత్వానికి మరియు నక్సలైట్లకు మధ్య చర్చలు జరగడానికి తీవ్రమైన కృషి చేశారు. 2004లో ప్రభుత్వంతో మాట్లాడి నక్సలైట్‌ ‌లను శాంతి చర్చలకు ఆహ్వానింపజేయడంలో ముఖ్య మైన అనుసంధాన కర్త గా ఉన్నారు.భారత దేశచరిత్ర లోనే దీనిని ఒక అరుదైన సంఘటన గా చెప్పవచ్చు. దళిత మానవ హక్కుల కార్యకర్త బెజవాడ విల్సన్‌ ‌తో కలిసి సఫాయి కర్మచారి అందోళన్‌ అనే సంస్థను స్థాపించి పాకీ పనివారి విముక్తికై దేశ వ్యాప్త ఉద్యమం చేసి ప్రభుత్వం వారి సంక్షేమంపై దృష్టి సారించేలా చేశారు.ఆ ఉద్యమం వల్ల ఎంతో మంది చేతితో మలం ఎత్తే అమానవీయ పనినుండి బయట పడ్డారు.1985లో జరిగిన కారంచేడు బాధితుల పునరావాసంలో ఆయన చురుకైన పాత్ర పోషించారు.

చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోయి’’ ప్రజల ఐఏఎస్‌ అధికారి’’గా ప్రజల గుండెల్లో మానవతావాదిగా నిలచి పోయిన నిరాడంబరమైన ఐఏఎస్‌ ‌శంకరన్‌ ‌గారి జీవితం నేటి తరం అధికారులకు స్ఫూర్తిదాయకం.ప్రజా సంక్షేమానికి అంకితమైన శంకరన్‌ ‌గారు 2010 అక్టోబర్‌ 7 ‌న హైదరాబాద్‌ ‌లో అస్తమించారు. ఎస్‌ ఆర్‌ ‌శంకరన్‌ ‌గారి జీవితం (1934-2010) ఆర్ధిక మరియు సామాజిక న్యాయం కొరకు కట్టుబడి ఉన్న వారందరికీ స్ఫూర్తిదాయకం అని చెప్పవచ్చు’’. నిరుపేదల పాలనే ప్రజా పాలన’’ అని నిరూపించిన మహోన్నత వ్యక్తి.కోట్లాది మంది దళిత ఆదివాసీ జీవితాల్లో వెలుగు నింపిన అసలు సిసలు ప్రజాసేవకుడు ఐఏఎస్‌ ‌శంకరన్‌ ‌గారు అని చెప్పవచ్చు.

pulluru venugopal
పుల్లూరు వేణు గోపాల్‌, 9701047002

Get real time updates directly on you device, subscribe now.

Leave a Reply