Take a fresh look at your lifestyle.

ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీల నామినేషన్లకు నేడు చివరి రోజు

  • అభ్యర్థుల ఎంపికపై సిఎం కెసిఆర్‌ ‌కసరత్తు
  • పార్టీ ముఖ్యులతో చర్చలు

రాష్ట్రంలో ఎమ్మెల్యే కోటా ఎంఎల్‌సి అభ్యర్థుల ఎన్నికలకు సంబంధించి నామినేషన్ల ఘట్టం నేడు ముగియనుంది. సిఎం కెసిఆర్‌ ఇం‌కా అభ్యర్థలు పేర్లను ఖరారు చేయలేదు. దీనికి సంబంధించి ఆయన కసరత్తు పూర్తి చేశారని సమాచారం. ఉదయానికల్లా అభ్యర్థులు ప్రకటించే అవకాశం ఉంది. అయితే ఎమ్మెల్సీ కోసం అనేకులు ఆశగా ఎదురు చూస్తున్నారు. దీంతో ఎవరికి అదృష్టం దక్కనుందో సిఎం కెసిఆర్‌ ‌ప్రకటించనున్నారు. తొలిదశలో ఎమ్మెల్యే కోటాలో ఆరుగరికి, గవర్నర్‌ ‌కోటాలో ఒకరికి ఛాన్స్ ‌దక్కనుంది. వీటికోసం పదుల సంఖ్యలో పలువురు ఎదురుచూస్తున్నారు. అభ్యర్థుల ఎంపికపై పలుమార్లు వడపోత కార్యక్రమం నిర్వహించిన అనంతరం తుది జాబితాను సిద్ధం చేశారు. ఆదివారం రాత్రి ప్రగతి భవన్‌కు చేరుకున్న సిఎం కెసిఆర్‌ అం‌దుబాటులో ఉన్న మంత్రులతో కూడా మరోసారి సమావేశం అయినట్లుగా తెలుస్తుంది. ఈ నేపథ్యంలో శాసనసభ్యుల కోటా, స్థానిక సంస్థల కోటా, గవర్నర్‌ ‌కోటాలో అవకాశం కల్పించనున్న అభ్యర్థుల జాబితాను మరోసారి కూడా చర్చించారని పార్టీ వర్గాల్లో వినిపిస్తుంది.

ప్రధానంగా పార్టీ కోసం వారి చేసిన సేవ సామాజిక వర్గం, ప్రజల్లో ఉన్న ఆదరణ, ఉద్యమ నేపథ్యం తదితర అంశాలను భేరీజు వేసి ఫైనల్‌ ‌లిస్టును ఖరారు చేసినట్లుగా సమాచారం. అయితే తుది జాబితాను ఉదయాని కల్ల అధికారికంగా ప్రకటించే అవకాశముందని తెలుస్తుంది. జాబితాలో పూర్తి స్పష్టత వొచ్చిన కొంత మందికి ఎంఎల్‌సిగా నామినేషన్‌ ‌వేసేందుకు సిద్దంగా ఉండాలని ఇప్పటికే సిఎం కార్యాలయం నుంచి సమాచారం కూడా ఇచ్చారని తెలుస్తుంది. అయితే ఇప్పటి వరకు ఎవరికి ఎంఎల్‌సి అవకాశం వొస్తుందనే అంశంపై పార్టీ ముఖ్యనేతలకు తగు సమాచారం రాలేదని తెలుస్తుంది. ఈ నేపథ్యంలో ఆశావహులంతా నామినేషన్‌కు సంబంధించి అన్ని ఏర్పాట్లు చేసుకున్నారు. ప్రగతి భవన్‌ ‌నుంచి సమాచారం రాగానే నామినేషన్‌ ‌వేసేందుకు ఎదురుచూస్తున్నారు. ఇదిలావుంటే శాసనమండలి ఎమ్మెల్యే కోటాలోని ఆరుగురు టీఆర్‌ఎస్‌ ఎమ్మెల్సీ అభ్యర్థుల జాబితా సిద్ధమైందని కొందరు అంటున్నారు. ఈ మేరకు అభ్యర్థుల పేర్లను టీఆర్‌ఎస్‌ అధినేత, ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు ఖరారు చేశారు. ఈ జాబితాను విడుదల చేయడమే తరువాయి అని అంటున్నారు.

ఒక్కో అభ్యర్థికి మద్దతుగా కనీసం పదిమంది ఎమ్మెల్యేలు నామినేషన్‌ ‌పత్రాలపై సంతకాలు చేయాల్సి ఉంటుంది. నామినేషన్‌ ‌పత్రాలపై వారి పేర్లను ప్రతిపాదిస్తూ సంతకాలు చేసేందుకు అందుబాటులో ఉండాల్సిందిగా టీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యేలకు అధిష్టానం నుంచి ఆదేశాలు వెళ్లాయి. దీంతో నియోజకవర్గాల్లో ఉన్న టీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యేలు హైదరాబాద్‌కు చేరుకునేందుకు ఏర్పాట్లు చేసుకున్నారు. మరోవైపు స్థానికసంస్థల కోటాలో ఖాళీ అవుతున్న 12 ఎంఎల్‌సి సీట్లకు వొచ్చేనెల 10న పోలింగ్‌ ‌జరగనుంది. ఈ నెల 16 నుంచి 23 వరకు స్థానికసంస్థల కోటా నామినేషన్ల స్వీకరణ కార్యక్రమం కొనసాగనుండగా, ఈ నెల 22న టీఆర్‌ఎస్‌ అభ్యర్థుల జాబితా వెలువడే అవకాశం ఉంది. ఖాళీగా ఉన్న గవర్నర్‌ ‌కోటాస్థానానికి ఈ ఏడాది ఆగస్టు 2న పాడి కౌశిక్‌రెడ్డి పేరును ప్రతిపాదించినా పోలీసు కేసులను కారణాలుగా చూపుతూ గవర్నర్‌ ఆమోదించలేదు. ఈ నేపథ్యంలో త్వరలో జరిగే కేబినెట్‌ ‌భేటీలో కౌశిక్‌ ‌స్థానంలో మరొకరి పేరును ప్రతిపాదించే అవకాశం ఉంది. 119 మంది సభ్యులున్న అసెంబ్లీలో టీఆర్‌ఎస్‌కు 103 మంది సభ్యుల బలం ఉంది. పార్టీ మిత్రపక్షం ఎంఐఎంకు కూడా ఏడుగురు సభ్యులు ఉండటంతో 110 మంది ఎమ్మెల్యేల మద్దతుతో టీఆర్‌ఎస్‌ ఆరు ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ స్థానాలను కైవసం చేసుకోనుంది. ఈ నేపథ్యంలో టీఆర్‌ఎస్‌ ‌పార్టీ అధినేత, సీఎం కేసీఆర్‌ ‌సామాజిక సవి•కరణాలు, జిల్లాలవారీగా ఎమ్మెల్సీల లెక్కలను వేసుకుని అభ్యర్థులను ఎంపిక చేయనున్నట్లు తెలిసింది.

Leave a Reply